Kalki Movie: ప్ర‌భాస్ క‌ల్కి కంటే ముందు దీపికా ప‌డుకోణ్ చేసిన తెలుగు మూవీ ఇదే - షూటింగ్ పూర్త‌యిన రిలీజ్ కాలేదు-which is the first straight telugu movie deepika padukone did before prabhas kalki 2898 ad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki Movie: ప్ర‌భాస్ క‌ల్కి కంటే ముందు దీపికా ప‌డుకోణ్ చేసిన తెలుగు మూవీ ఇదే - షూటింగ్ పూర్త‌యిన రిలీజ్ కాలేదు

Kalki Movie: ప్ర‌భాస్ క‌ల్కి కంటే ముందు దీపికా ప‌డుకోణ్ చేసిన తెలుగు మూవీ ఇదే - షూటింగ్ పూర్త‌యిన రిలీజ్ కాలేదు

Nelki Naresh Kumar HT Telugu
May 18, 2024 12:48 PM IST

Prabhas: ప్ర‌భాస్ క‌ల్కి కంటే ముందు తెలుగులో దీపికా ప‌డుకోణ్ ల‌వ్ 4 ఎవ‌ర్ అనే సినిమాలో న‌టించింది. ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్‌కు ప్ర‌భాస్ ఛీఫ్ గెస్ట్‌గా రావ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌భాస్
ప్ర‌భాస్

Prabhas: ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న క‌ల్కి 2898 ఏడీ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌డుకోణ్‌. దాదాపు ఆరు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ జూన్ 27న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సూప‌ర్ హీరో మూవీలో విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ విల‌న్‌గా క‌నిపిస్తోండ‌గా బాలీవుడ్ లెజెండ‌రీ యాక్ట‌ర్ బిగ్‌బీ కీల‌క పాత్ర చేస్తోన్నారు.

yearly horoscope entry point

2010లో ల‌వ్ 4 ఎవ‌ర్‌...

ప్ర‌భాస్ క‌ల్కి కంటే ముందే దీపికా ప‌డుకోణ్ తెలుగులో ఓ సినిమా చేసింది. షూటింగ్ పూర్త‌యినా ఆమూవీ మాత్రం ఇప్ప‌టికీ రిలీజ్ కాలేదు. 2010లో ర‌ణ‌దీప్‌, షాలీనా హీరోహీరోయిన్లుగా ల‌వ్ 4 ఎవ‌ర్ పేరుతో టాలీవుడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ జ‌యంత్ సీ ప‌రాన్జీ స్వీయ నిర్మాణంలో ఓ మూవీని అనౌన్స్‌చేశారు.

అదే ఏడాది రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్‌ను భారీగా నిర్వ‌హించారు. ఈ ఓపెనింగ్ వేడుక‌కు ప్ర‌భాస్ చీఫ్ గెస్ట్‌గా వ‌చ్చాడు. ఈశ్వ‌ర్‌తో మూవీతో త‌న‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసింది డైరెక్ట‌ర్‌ జ‌యంత్ సీ ప‌రాన్జీ కావ‌డంతోనే ఆ కృత‌జ్ఞ‌త భావంతో ప్ర‌భాస్ ఈ వేడుక‌లో పాల్గొన్నాడు. ప్ర‌భాస్‌తో పాటు వెంక‌టేష్ కూడా ఓపెనింగ్ ఈవెంట్‌లో సంద‌డి చేశాడు.

దీపికా ప‌డుకోణ్ స్పెష‌ల్ సాంగ్‌...

ఈ చిన్న సినిమాలో దీపికా ప‌డుకోణ్ ఓ స్పెష‌ల్ సాంగ్ చేయ‌డానికి దీపికా ప‌డుకోణ్‌ను సంప్ర‌దించాడు జ‌యంత్ సీ ప‌రాన్జీ. బాలీవుడ్‌లో అప్పుడ‌ప్పుడే హీరోయిన్‌గా నిల‌దొక్కుకుంటున్న దీపికా ప‌డుకోణ్ వెంట‌నే ఈ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ సినిమాలో ప్ర‌త్యేక గీతంలో పాటు ఓ రెండు, మూడు సీన్స్‌లో దీపికా న‌టించింది. 2010లోనే ల‌వ్ 4 ఎవ‌ర్ షూటింగ్ పూర్త‌యింది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా రిలీజ్‌కు నోచుకోలేదు.

దీపిక క‌ల తీర‌లేదు...

ల‌వ్ 4 ఎవ‌ర్‌తోనే 14 ఏళ్ల క్రిత‌మే తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాల‌ని అనుకున్న దీపికా క‌ల తీర‌లేదు. ప్ర‌భాస్ గెస్ట్‌గా వ‌చ్చిన మూవీ ఆగిపోయినా అత‌డు హీరోగా న‌టిస్తోన్న క‌ల్కి 2989 ఏడీతో దీపికా ప‌డుకోణ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

మే 9న రిలీజ్ కావాల్సింది...కానీ...

క‌ల్కి మూవీకి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తొలుత క‌ల్కి మూవీని మే 9న రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కానీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం కావ‌డంతో జూన్ 27కు ఈ మూవీ వాయిదాప‌డింది.

పురాణాల్లోని క‌ల్కి అవ‌తారం గాథ‌ నుంచి స్ఫూర్తి పొందుతూ మోడ్ర‌న్ స్టైల్‌లో హాలీవుడ్‌కు ధీటుగా డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ క‌ల్కి మూవీని తెర‌కెక్కిస్తోన్న‌ట్లు స‌మాచారం. తెలుగుతో పాటు హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో ఈ మూవీని షూట్ చేశారు. త‌మిళ్‌, మ‌ల‌యాళం, క‌న్న‌డంతో పాటు ఇంగ్లీష్ భాష‌ల్లోకి డ‌బ్ చేసి విడుద‌ల‌చేయ‌బోతున్నారు.

భైర‌వ‌గా ప్ర‌భాస్‌...

ఈ సినిమాలో భైర‌వ అనే పాత్ర‌లో ప్ర‌భాస్ క‌నిపించ‌బోతుండ‌గా...అశ్వ‌త్థామ‌గా అమితాబ్‌, కాళీగా క‌మ‌ల్‌హాస‌న్ న‌టిస్తున్నారు. క‌ల్కి కోసం క‌మ‌ల్‌హాస‌న్ కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్‌ విల‌న్‌గా మార‌డం ద‌క్షిణాది వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. క‌ల్కి మూవీకి ద‌స‌రా ఫేమ్ సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతాన్ని స‌మ‌కూర్చుతున్నాడు.

స‌లార్ సీక్వెల్‌...

ప్ర‌భాస్ హీరోగా న‌టించిన‌ స‌లార్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద 600 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీకి సీక్వెల్ రాబోతోంది. స‌లార్ 2 శౌర్యంగ‌ప‌ర్వం పేరుతో రూపొందుతోన్న ఈ సీక్వెల్‌ ఈ ఏడాదే సెట్స్‌పైకి రానుంది. స‌లార్ సీక్వెల్‌తో పాటు డైరెక్ట‌ర్ మారుతితో రాజాసాబ్ సినిమా చేస్తోన్నాడు ప్ర‌భాస్‌. రాజా సాబ్ ఈ ఏడాది థియేటర్లలోకి రాబోతోంది. కల్కి రిలీజ్ తర్వాతే రాజా సాబ్ విడుదల తేదీని వెల్లడిస్తారని సమాచారం.

Whats_app_banner