Karan Johar: లాజిక్‍లు లేకున్నా.. సక్సెస్: రాజమౌళిపై బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కామెంట్స్-where do you see logic in rajamouli films says bollywood film maker karan johar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karan Johar: లాజిక్‍లు లేకున్నా.. సక్సెస్: రాజమౌళిపై బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కామెంట్స్

Karan Johar: లాజిక్‍లు లేకున్నా.. సక్సెస్: రాజమౌళిపై బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కామెంట్స్

Chatakonda Krishna Prakash HT Telugu
Updated Feb 17, 2025 10:41 AM IST

Karan Johar - SS Rajamouli: రాజమౌళి సినిమాల్లో లాజిక్‍లు ఎక్కడ ఉంటాయని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ అన్నారు. అయినా ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు చాలా సక్సెస్ అవుతున్నాయని, అందుకు కారణమేంటో కూడా తన అభిప్రాయాన్ని చెప్పారు.

Karan Johar: లాజిక్‍లు లేకున్నా.. సక్సెస్: రాజమౌళిపై బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కామెంట్స్
Karan Johar: లాజిక్‍లు లేకున్నా.. సక్సెస్: రాజమౌళిపై బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కామెంట్స్

దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. బాహుబలి 1,2, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఇండియన్ సినిమాను గ్లోబల్ రేంజ్‍కు తీసుకెళ్లారు. ప్రపంచమంతా తెలుగుతో పాటు భారత సినీ ఇండస్ట్రీ వైపు తిరిగిచూసేలా చేశారు. అయితే, రాజమౌళి చిత్రాల్లో లాజిక్‍లు ఉండవని బాలీవుడ్ స్టార్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ అన్నారు. స్టోరీటెల్లింగ్ గురించి చెబుతూ ఈ కామెంట్ చేశారు. లాజిక్ లేకున్నా రాజమౌళి సినిమాలు అంతలా ఎందుకు సక్సెస్ అవుతున్నాయో వివరించారు.

నమ్మకం ముఖ్యం

రాజమౌళి చిత్రాల్లో లాజిక్‍లు ఎక్కడ ఉంటాయని కరణ్ జోహార్ అన్నారు. యాట్యూబ్ ఛానెల్ కోమల్ నథాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్ ఈ కామెంట్లు చేశారు. చిత్రాల్లో లాజిక్‍ల గురించి వచ్చిన ప్రశ్నకు స్పందించారు. సినిమాల్లో లాజిక్‍లు అవసరం లేదని, ప్రేక్షకులను నమ్మించడమే ముఖ్యమని కరణ్ అన్నారు. ముందు తాము తెరకెక్కిస్తున్న దానిపై దర్శకులు విశ్వాసంతో ఉండాలని తెలిపారు. ఇందుకు దర్శక ధీరుడు రాజమౌళిని ఉదాహరణగా చెప్పారు కరణ్ జోహార్.

లాజిక్ లేని చిత్రాలు బిగ్గెస్ట్ హిట్స్ అయ్యాయని కరణ్ చెప్పారు. “నమ్మిస్తాం అని అనుకునే భావన చాలా ముఖ్యం. బెస్ట్ ఫిల్మ్ మేకర్స్ జర్నీని గమనిస్తే.. భారీ హిట్స్ వచ్చిన సినిమాలు నమ్మకం ఆధారంగానే రూపొందించారు. సినిమాల్లో లాజిక్ అనేది ముఖ్యం కాదు. ఉదాహరణకు రాజమౌళి తీసిన ఏ చిత్రాన్నైనా చూసుకోండి.. మీకు లాజిక్ ఎక్కడ కనిపిస్తుంది?. నమ్మకం మాత్రమే మీరు చూడగలరు. ఫిల్మ్ మేకర్లకు నమ్మకం కలిగితే.. ప్రేక్షకులు కూడా దాన్ని నమ్ముతారు” అని కరణ్ చెప్పారు. లాజిక్ లేకపోయినా ప్రేక్షకులు నమ్మేలా సినిమాను తెరకెక్కించడం ముఖ్యమనేలా కరణ్ మాట్లాడారు.

ఆ బ్లాక్‍బస్టర్లలో లాజిక్ ఎక్కడిది!

బ్లాక్‍బస్టర్ హిట్స్ అయిన యానిమల్, ఆర్ఆర్ఆర్, గదర్ లాంటి చిత్రాల్లో లాజిక్స్ లేవని కరణ్ చెప్పారు. నమ్మకం ఆధారంగా ఆ చిత్రాలను తెరకెక్కించారని అన్నారు. “ఒక్క చేతితో వేయి మందిని ఒకవేళ ఓడించగలగడం అనేది.. అది నమ్మించేలా చేయడమే కదా?. సన్నీ డియోల్ ఇది చేయగలరని అనిల్ శర్మ నమ్మారు. ప్రతీ ఫిల్మ్ మేకర్ డీఎన్‍ఏలో ఇలాంటిది ఉండాలని నేను అనుకుంటా. ఇలా చేస్తే చాలా బ్లాక్‍బస్టర్లు వస్తాయని నేను నమ్ముతా. లాజిక్‍లను ఆలోచిస్తూ మీపై మీరు సందేహంగా ఉంటేనే సమస్యలు తలెత్తుతాయి” అని కరణ్ చెప్పారు.

కరణ్ జోహార్ నిర్మాణంలో ప్రస్తుతం సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, సన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 18న విడుదల కానుంది. కార్తిక్ ఆర్యన్‍తో తూ మేరీ మే తేరాతో పాటు మరో చిత్రాన్ని కూడా కరణ్ నిర్మించనున్నారు. అక్షయ్ కుమార్, మాధవన్ కాంబినేషన్‍లో కేసరి చాప్టర్ 2ను ప్రొడ్యూజ్ చేస్తున్నారు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం