Third Single From Dhamaka: మాస్ మహారాజా రవితేజ వరుస చిత్రాలతో దూకుడు మీదున్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఖిలాడి, రామారావ్ ఆన్ డ్యూటీ చిత్రాలతో సందడి చేసిన ఈ హీరో.. ప్రస్తుతం మరో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. అదే ధమాకా. ఇందులో రవితేజ సరసన పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ధమాకా సాంగ్ ఆడియెన్స్‌ను అలరించి సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా మరో అప్డేట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది చిత్రబృందం. ధమాకా సినిమా నుంచి మరో పాట విడుదల చేసింది.,వాట్స్ హ్యాపనింగ్ అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. మెలోడీగా సాగే ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. శ్రీలీల డ్యాన్స్, పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. రవితేజతో ఆమె కెమస్ట్రీ బాగుంది. ఆద్యంతం వినసొంపుగా, అలాగే ట్రెండీగానూ ఉన్న ఈ పాటకు నెట్టింట హల్చల్ చేస్తోందిది.,ఈ ట్రెండీ సాంగ్‌ను ప్రముఖ గాయకులు రమ్యా బెహ్రా, భార్గవి పిళ్లై ఆలపించారు. భీమ్స్ సెసిరొలియో స్వరాలను సమకూర్చారు. ఈ పాటను రామ జోగయ్య శాస్త్రీ రాశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా మాస్ రాజా అంటూ సాగే సాంగ్ ప్రేక్షకులను ఉర్రూత లూగించింది.,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ధమాకా సినిమాకు నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరించారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. భీమ్స్ సెసిరొలియో సంగీతాన్ని సమకూర్చగా.. కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా పనిచేశాడు.,,