Pushpa 2 OTT: ‘మార్వెల్‍ నేర్చుకోవాలి’: పుష్ప 2పై హాలీవుడ్ ఆడియన్స్ ప్రశంసలు-western hollywood audience praising allu arjun pushpa 2 movie after netflix ott streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Ott: ‘మార్వెల్‍ నేర్చుకోవాలి’: పుష్ప 2పై హాలీవుడ్ ఆడియన్స్ ప్రశంసలు

Pushpa 2 OTT: ‘మార్వెల్‍ నేర్చుకోవాలి’: పుష్ప 2పై హాలీవుడ్ ఆడియన్స్ ప్రశంసలు

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 05, 2025 11:52 AM IST

Pushpa 2 OTT: పుష్ప 2 సినిమా వెస్ట్రన్ ప్రేక్షకులకు కూడా విపరీతంగా నచ్చేస్తోంది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీని చూసిన చాలా మంది హాలీవుడ్ ప్రేక్షకులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ప్రశంసలు కురిపిస్తున్నారు.

Pushpa 2 OTT: ‘మార్వెల్‍ నేర్చుకోవాలి’: పుష్ప 2పై హాలీవుడ్ ఆడియన్స్ ప్రశంసలు
Pushpa 2 OTT: ‘మార్వెల్‍ నేర్చుకోవాలి’: పుష్ప 2పై హాలీవుడ్ ఆడియన్స్ ప్రశంసలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించగా.. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపేస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ యాక్షన్ మూవీ భారీ హైప్ మధ్య గత డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్‍తో బాక్సాఫీస్ వద్ద అదరగొట్టి.. అనేక రికార్డులను చెరిపేసింది. ఇప్పుడు ఓటీటీలోనూ పుష్ప 2 హవా చూపిస్తోంది. హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

yearly horoscope entry point

వెస్ట్రన్ ఆడియన్స్ ఫిదా

పుష్ప 2 సినిమా జనవరి 30వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇండియాలో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో టాప్‍లో ఉన్న ఈ చిత్రం గ్లోబల్ రేంజ్‍లోనూ టాప్-10లో ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ పెట్టుకొని మరీ ఈ చిత్రాన్ని చాలా మంది హాలీవుడ్ ప్రేక్షకులు చూస్తున్నారు. ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

పుష్ప 2 మూవీని చూసి అవెంజర్స్ లాంటి సూపర్ హీరో చిత్రాలు చేసే మార్వెల్‍ను చాలా మంది విమర్శిస్తున్నారు. మార్వెల్ చిత్రాల్లో ఇటీవల క్రియేటివిటీ లోపిస్తోందని, ఇలాంటి సినిమాలు చూసైనా నేర్చుకోవాలని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 20వ సారి అదే సూపర్ హీరో చిత్రాన్ని రూపొందించే బదులు పుష్ప 2 మూవీని చూసి హాలీవుడ్ నోట్స్ తీసుకోవాలని ఓ యూజర్ ట్వీట్ చేశారు.

బాగుంటే ఫిజిక్స్ పట్టించుకోం

పుష్ప 2 చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు ఫిజిక్స్‌కు అందని విధంగా ఉన్నాయంటూ కొందరు అభిప్రాయపడ్డారు. అయితే, సినిమా చూసేందుకు బాగుంటే ఫిజిక్స్ అంశం పట్టించుకోనని ఓ వెస్ట్రన్ యూజర్ కామెంట్ చేశారు. “ఒకవేళ చూసేందుకు బాగుంటే ఫిజిక్స్ గురించి పట్టించుకోను. గ్రేట్ సీన్” అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. మార్వెల్ దగ్గర ఇలాంటి క్రియేటివిటీ లేకున్నా.. బడ్జెట్ మాత్రం ఎక్కువుందని మరో యూజర్ పోస్ట్ చేశారు.

కొన్ని మోడ్రన్ అమెరికన్ చిత్రాల కంటే పుష్ప 2 చాలా మెరుగ్గా ఉందని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. “సినిమా అంటే ఇలాగే ఉండాలని నేను అనుకుంటా. నమ్మశక్యం కాకుండానే చిత్రం ఉండాలి. నేను భారతీయ సినిమాలను ప్రేమిస్తా. రియలస్టిల్ లాంటి వాటిని నేను పట్టించుకోను” అని ఓ వెస్ట్రన్ యూజర్ ట్వీట్ చేశారు. మొత్తంగా పుష్ప 2 సినిమాకు హాలీవుడ్ జనాల నుంచి ఎక్కువ శాతం పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

పుష్ప 2 చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో 20కు పైగా దేశాల్లో ప్రస్తుతం టాప్-10లో ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ రీలోడెడ్ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియా ట్రెండింగ్‍లో టాప్‍లో సత్తాచాటుతోంది.

పుష్ప 2 చిత్రం రూ.1,850కోట్లకు పైగా కలెక్షన్లతో అనేక రికార్డును బద్దలుకొట్టింది. ఈ మూవీలో అల్లు అర్జున్‍కు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేశ్, జగదీశ్ కీరోల్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూజ్ చేసిన ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు.

Whats_app_banner

సంబంధిత కథనం