Weekend OTT releases: ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడాల్సిన సినిమాలు ఇవే.. మూడు థ్రిల్లర్స్, ఒక కామెడీ మూవీ
Weekend OTT releases: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు చాలానే వస్తున్నాయి. అందులో అన్ని జానర్ల సినిమాలు ఉన్నా మూడు థ్రిల్లర్స్, ఒక కామెడీ మూవీ ఆసక్తి రేపుతున్నాయి.
Weekend OTT releases: ఓటీటీలు వచ్చిన తర్వాత వీకెండ్స్ టైంపాస్ చేయడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం రావడం లేదు. ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ తో అలరిస్తూనే ఉన్నాయి. ఈ వీకెండ్ కూడా వివిధ ఓటీటీల్లో ఇంట్రెస్టింగ్ సినిమాలు చాలానే వస్తున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? ఏ ఓటీటీల్లో చూడాలో ఇక్కడ చూడండి.
వీకెండ్ ఓటీటీ రిలీజెస్
ఈ వీకెండ్ తెలుగుతోపాటు తమిళం, హిందీ, ఇంగ్లిష్ భాషలకు చెందిన సినిమాలు ఓటీటీల్లోకి వస్తున్నాయి. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, ఆహా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లో ఇవి అందుబాటులో ఉండనున్నాయి.
మై డియర్ దొంగ - ఆహా ఓటీటీ
అభినవ్ గోమటం నటించిన మూవీ మై డియర్ దొంగ. ఈ కామెడీ మూవీ ఆహా ఓటీటీలోకి వస్తోంది. శుక్రవారం (ఏప్రిల్ 19) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఓ దొంగగా ఇంట్లోకి చొరబడి లవర్ గా మారిన వ్యక్తి కథే ఈ మై డియర్ దొంగ.
సైరెన్ - హాట్‌స్టార్
జయం రవి, కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మొత్తానికి పలు వాయిదాల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోంది. శుక్రవారం (ఏప్రిల్ 19) నుంచి తమిళంతోపాటు తెలుగులోనూ సైరెన్ సినిమా హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. చేయని నేరానికి 14 ఏళ్ల జైలు జీవితం అనుభవించిన ఓ అంబులెన్స్ డ్రైవర్ చుట్టూ తిరిగే కథే ఈ సైరెన్.
రణం - ప్రైమ్ వీడియో
రణం ఓ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఓ నర్స్ హత్య చుట్టూ తిరిగే కథే ఈ రణం సినిమా. షరీఫ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నందితా శ్వేత, వైభవ్ రెడ్డి లాంటి వాళ్లు నటించారు. ఈ ఏడాది వచ్చిన బెస్ట్ థ్రిల్లర్స్ లో ఒకటిగా రివ్యూలు అందుకున్న ఈ రణం మూవీ శుక్రవారం (ఏప్రిల్ 19) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
ఆర్టికల్ 370 - జియో సినిమా
జమ్ము కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కలిపించే ఆర్టికల్ 370, దానిని తొలగించిన ఘటనల చుట్టూ తిరిగే కథే ఈ ఆర్టికల్ 370. థియేటర్లలో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. యామీ గౌతమ్, ప్రియమణిలాంటి వాళ్లు ఇందులో నటించారు. ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 19) నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది.
సైలెన్స్ 2 - జీ5 ఓటీటీ
మనోజ్ బాజ్‌పాయీ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ సైలెన్స్ 2 మంగళవారం (ఏప్రిల్ 16) నుంచే జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వీకెండ్ లో ఈ మూవీని కూడా చూడొచ్చు.
ఇవే కాకుండా నెట్‌ఫ్లిక్స్ లో రెబల్ మూన్ 2, డ్యూన్ 2లాంటి సినిమాలు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక గత వారం ఓటీటీల్లోకి వచ్చిన ప్రేమలు, గామి, ఓం భీమ్ బుష్, తంత్ర, అమర్ సింగ్ చమ్కీలాలాంటి సినిమాలు చూడకపోయిన ఉంటే వాటిని కూడా ఈ వీకెండ్ ప్లాన్ చేసేయండి.