Weekend OTT Movies: ఈ వీకెండ్ ఈ ఐదు సినిమాలనూ అస్సలు మిస్ కావద్దు.. ఏ ఓటీటీల్లో చూడాలంటే..-weekend ott movies do not miss these 5 movies hanuman bramayugam murder mubarak in netflix jio cinema sonyliv zee5 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Weekend Ott Movies: ఈ వీకెండ్ ఈ ఐదు సినిమాలనూ అస్సలు మిస్ కావద్దు.. ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఈ ఐదు సినిమాలనూ అస్సలు మిస్ కావద్దు.. ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Hari Prasad S HT Telugu
Mar 14, 2024 03:40 PM IST

Weekend OTT Movies: వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఒకవేళ ఓటీటీలకు అతుక్కుపోవాలనుకుంటే మాత్రం ఈ ఐదు సినిమాలు అస్సలు మిస్ కావద్దు. హనుమాన్ హిందీ వెర్షన్ తోపాటు భ్రమయుగం, మర్డర్ ముబారక్ లాంటి సినిమాలు ఇందులో ఉన్నాయి.

ఈ వీకెండ్ ఈ ఐదు సినిమాలనూ అస్సలు మిస్ కావద్దు.. ఏ ఓటీటీల్లో చూడాలంటే..
ఈ వీకెండ్ ఈ ఐదు సినిమాలనూ అస్సలు మిస్ కావద్దు.. ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Weekend OTT Movies: ప్రతి శుక్రవారం థియేటర్లలో కొత్తగా రిలీజయ్యే సినిమాలతోపాటు ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు కూడా ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. ఈసారి కూడా అలాంటి టాప్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. అందులో ఐదు సినిమాలు మాత్రం మీరు మిస్ కావద్దు. వీటిలో హనుమాన్ హిందీ వెర్షన్ కూడా ఉంది.

వీకెండ్ మూవీస్ ఇవే

ఈ వారం ఓటీటీల్లో రిలీజైన సినిమాల్లో ఐదు మాత్రం చాలా ఆసక్తి కలిగిస్తున్నాయి. అవేంటంటే..

హనుమాన్ - జియో సినిమా

సంక్రాంతికి రిలీజై సంచలన విజయం సాధించిన హనుమాన్ మూవీ మొత్తానికి ఓటీటీలోకి వచ్చేస్తోంది. అయితే ప్రస్తుతానికి కేవలం హిందీ వెర్షన్ మాత్రం అందుబాటులోకి రానుంది. తెలుగుతోపాటు అన్ని భాషల్లోనూ మార్చి 8 నుంచి జీ5లో వస్తుందని భావించినా.. అది కుదరలేదు. అయితే శనివారం (మార్చి 16) నుంచి హనుమాన్ హిందీ వెర్షన్ జియో సినిమాలోకి రానుంది. ఇక అదే రోజు రాత్రి 8 గంటలకు ఈ సినిమాను కలర్స్ సినీప్లెక్స్ లోనూ చూడొచ్చు.

భ్రమయుగం - సోనీలివ్

మలయాళ పీరియాడిక్ హారర్ డ్రామా భ్రమయుగం ఈ శుక్రవారం (మార్చి 15) ఓటీటీలోకి వచ్చేస్తోంది. సోనీలివ్ ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమా కూడా వీకెండ్ లో చూడటానికి మంచి ఛాయిస్ అని చెప్పాలి. రాహుల్ సదాశివన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో ఓ కొత్త ఫీల్ కలిగిస్తుంది.

మర్డర్ ముబారక్ - నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తున్న సినిమా మర్డర్ ముబారక్. బాలీవుడ్ ప్రముఖ నటులు నటించిన ఈ మర్డర్ మిస్టరీ మూవీ శుక్రవారం (మార్చి 15) నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. సారా అలీ ఖాన్, విజయ్ వర్మ, డింపుల్ కపాడియా, కరిష్మా కపూర్, పంకజ్ త్రిపాఠీ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమా ఢిల్లీలోని ఓ క్లబ్ లో జరిగే హత్య, అది ఎవరు చేశారన్న ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది.

మై అటల్ హు - జీ5 ఓటీటీ

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయీ బయోపిక్ ఇది. జీ5 ఓటీటీలో గురువారం (మార్చి 14) నుంచే అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో వాజపేయీ పాత్రలో పంకజ్ త్రిపాఠీ నటించాడు. థియేటర్లలో ఈ సినిమా మిస్ అయి ఉంటే.. ఇప్పుడు ఓటీటీలో చూసేయండి.

టేలర్ స్విఫ్ట్: ది ఎరాస్ టూర్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ప్రముఖ సింగర్ టేలర్ స్విఫ్ట్ ది ఎరాస్ టూర్ ఆధారంగా రూపొందించిన మూవీ ఇది. ఆమె అన్ని కాన్సర్ట్ లను ఇందులో చూడొచ్చు. మార్చి 15 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోకి అందుబాటులోకి రానుంది.

ఈ ఐదు సినిమాలతోపాటు సేవ్ ది టైగర్స్ సీజన్ 2 వెబ్ సిరీస్, ఆహా ఓటీటీలో మిక్సప్ మూవీ కూడా వీకెండ్ చూడొచ్చు.

Whats_app_banner