టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన వార్ 2 సినిమా టీజర్ నేడు (మే 20) వచ్చేసింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీమ్ ఈ టీజర్ తీసుకొచ్చింది. ఈ చిత్రంతోనే బాలీవుడ్‍లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నారు. హృతిక్ రోషన్‍తో కలిసి ప్రధాన పాత్ర పోషించారు. వార్ 2 టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్, హృతిక్ లుక్స్, యాక్షన్ అదిరిపోయిందనే కామెంట్లు వస్తున్నాయి. ఈ టీజర్లో హీరోయిన్ కియారా అడ్వానీ సర్‌ప్రైజ్ చేశారు.
వార్ 2 టీజర్లో ఎక్కువగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కనిపించారు. హీరోయిన్ కియారా అడ్వానీ కొన్ని సెకెన్లే అలా తళుక్కుమన్నారు. అయితే, ఎల్లో బికినీలో హాట్ లుక్‍తో కియారా కనిపించారు. ప్రేక్షకులను ఇది సర్‌ప్రైజ్ చేసింది. కియారా సినిమాల్లో బికినీలో కనిపించడం ఇదే ఫస్ట్ టైమ్.
వార్ 2 టీజర్‌లో కియారా అడ్వానీ బికినీ లుక్ సోషల్ మీడియాను హోరెత్తిచ్చేస్తోంది. ఈ బికినీ ఫొటోలు, వీడియోలు నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొంతసేపే కనిపించినా ఇద్దరు హీరోలను కియారా డామినేట్ చేసేశారని కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్లు చేసేస్తున్నారు. ఇది తాము ఊహించలేదని, కియారా బికినీలో అదిరిపోయారని మరికొందరు రాసుకొస్తున్నారు.
మొత్తంగా కియారా అడ్వానీ బికినీ లుక్ బజ్ విపరీతంగా నడుస్తోంది. సోషల్ మీడియా ఎన్టీఆర్, హృతిక్‍ను డామినేట్ చేసేలా ఈ బికినీ బబ్ సాగుతోంది. అయితే, హీరోయిన్‍తో బికినీ వేయించకుండా బాలీవుడ్‍లో స్పై థ్రిల్లర్ సినిమా తీయలేరా అంటూ కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు.
వార్ 2 టీజర్ గురించి ఇన్‍స్టాగ్రామ్‍లో స్టోరీ పోస్ట్ చేశారు కియారా. చాలా ఫస్ట్‌లు ఉన్నాయంటూ రాసుకొచ్చారు. తనకు ఇదే ఫస్ట్ యాక్షన్ మూవీ, ఫస్ట్ బికినీ షాట్ అంటూ తెలిపారు. “దీంట్లో చాలా ఫస్ట్‌లు ఉన్నాయి. ఫస్ట్ యశ్ రాజ్ ఫిల్మ్స్. ఫస్ట్ యాక్షన్ ఫిల్మ్. ఈ ఇద్దరు అద్భుతమైన హీరోలతో ఫస్ట్. అయాన్‍తో పని చేయడం ఫస్ట్. బికినీ షాట్ చేయడం కూడా ఫస్ట్” అని రాశారు కియారా.
వార్ 2 సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ టీజర్లో ఎన్టీఆర్, హృతిక్ యాక్షన్ దుమ్ములేచిపోయింది. ఇద్దరి లుక్ కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఇద్దరి మధ్య టీజర్లో వచ్చే ఫైనల్ ఫైట్ సినిమాపై హైప్‍ను అమాంతం పెంచేసింది. ఇద్దరి మధ్య చిత్రంలో ఇంటెన్స్ వార్ నడుస్తుందని మేకర్స్ హింట్ ఇచ్చేశారు. అయితే, టీజర్లో వీఎఫ్‍ఎక్స్ గురించి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.
వార్ 2 సినిమా ఆగస్టు 14వ తేదీన విడుదల కానుంది. హిందీ, తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ కానుంది. 2019లో వచ్చి సూపర్ హిట్ అయిన వార్‌కు సీక్వెల్‍గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. వార్ 2 మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.
సంబంధిత కథనం