Warner In Rabinhood: బౌండరీ నుంచి బాక్సాఫీస్.. తెలుగు మూవీలో వార్నర్.. ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా? అదుర్స్ అంతే-wanrner first look poster from rabinhood movie released cricketers debut movie tollywood nithin sreeleela ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Warner In Rabinhood: బౌండరీ నుంచి బాక్సాఫీస్.. తెలుగు మూవీలో వార్నర్.. ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా? అదుర్స్ అంతే

Warner In Rabinhood: బౌండరీ నుంచి బాక్సాఫీస్.. తెలుగు మూవీలో వార్నర్.. ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా? అదుర్స్ అంతే

Warner In Rabinhood: గ్రౌండ్ లో బ్యాటింగ్ విన్యాసాలతో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించే డేవిడ్ వార్నర్ ఇప్పుడు యాక్టింగ్ తో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. తెలుగు మూవీ రాబిన్ హుడ్ లో అతను ఓ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ చేసిన వార్నర్ ఫస్ట్ లుక్ వైరల్ గా మారింది.

రాబిన్ హుడ్ సినిమాలో యాక్ట్ చేసిన వార్నర్ ఫస్ట్ లుక్ (x/davidwarner31)

క్రికెట్ గ్రౌండ్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో బౌలర్లను చెండాడే ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. ఇప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి వస్తున్నాడు. ఇన్ని రోజులూ ఆటతో అలరించిన వార్నర్.. ఇప్పుడు యాక్టింగ్ తో అదరగొట్టబోతున్నాడు. తెలుగు సినిమా ‘రాబిన్ హుడ్’తో ఇండియన్ సినిమాలో అడుగుపెట్టబోతున్నాడు. ఈ మూవీ నుంచి వార్నర్ ఫస్ట్ లుక్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు.

కూల్ లుక్

గ్రౌండ్ లో అగ్రెసివ్ బ్యాటింగ్ తో ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడే వార్నర్.. యాక్టర్ గా డెబ్యూ చేస్తున్నాడు. ఇండియన్ సినిమాలో అడుగుపెడుతున్నాడు. నితిన్-శ్రీలీల జంటగా నటించిన ‘రాబిన్ హుడ్’ మూవీలో వార్నర్ స్పెషల్ కామియో ప్లే చేశాడు. మైత్రి మూవీస్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫస్ట్ లుక్ లో వార్నర్ కూల్ గా కనిపిస్తున్నాడు. కిందకు చూస్తూ ఓ రకమైన నవ్వు విసురుతున్నాడు. స్పాట్ లైట్ తో అతని ముఖం వెలుగుతోంది.

వైరల్ గా వార్నర్

‘రాబిన్ హుడ్’ నుంచి రిలీజైన్ వార్నర్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు క్రికెట్ ఫ్యాన్స్.. ఇటు మూవీ లవర్స్ ఈ పోస్టును తెగ షేర్ చేస్తున్నారు. లైక్ చేస్తున్నారు. వార్నర్ మామ సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘బౌండరీ నుంచి బాక్సాఫీస్ కు వస్తున్నా డేవిడ్ వార్నర్ కు ఇండియన్ సినిమాలోకి స్వాగతం’’ అని ఆ పోస్టర్ పై మెన్షన్ చేశారు.

సన్ రైజర్స్ తో

ఐపీఎల్ లో 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఛాంపియన్ గా నిలిపిన వార్నర్.. తెలుగు ఫ్యాన్స్ కు దగ్గరయ్యాడు. ఈ లీగ్ లో హైదరాబాద్ కు ఆడిన టైంలో వార్నర్ ను మన ఫ్యాన్స్ తెగ ఆరాధించారు. వార్నర్ మామ అంటూ ప్రేమ కురిపించారు. మరోవైపు వార్నర్ కూడా ఫ్యాన్స్ ను ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. అటు ఆటతో.. ఇటు డైలాగ్ లు, స్టెప్పులతో అలరిస్తూనే వచ్చాడు.

వీడియోలతో

టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో తెలుగు సినిమా డైలాగ్ లు చెప్తూ వార్నర్ మన ఫ్యాన్స్ కు ఇంకా చేరువయ్యాడు. తెలుగు సాంగ్స్ కు స్టెప్పులు వేస్తూ పోస్టు చేసిన వీడియోలు తెగ వైరల్ గా మారాయి. ముఖ్యంగా పుష్ప మేనియాలో వార్నర్ కూడా తన వీడియోలతో భాగమయ్యాడు. మరోవైపు ఈ సీజన్ ఐపీఎల్ లో వార్నర్ కనిపించడు. నవంబర్ లో జరిగిన మెగా వేలంలో అతణ్ని ఎవరూ కొనుగోలు చేయలేదు.

ఇండియన్ సినిమా

‘ఇండియన్ సినిమా.. ఇదిగో నేను వస్తున్నా’ అంటూ మైత్రి మూవీ మేకర్స్ పోస్టు చేసిన ఫస్ట్ లుక్ కు వార్నర్ రిప్లే ఇచ్చాడు. రాబిన్ హుడ్ లో భాగమైనందుకు ఎంతో ఎక్సైటింగ్ గా ఉందని, ఈ మూవీ షూటింగ్ ను ఎంతో ఎంజాయ్ చేశానని వార్నర్ పేర్కొన్నాడు. నితిన్-శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్ మూవీ మార్చి 28న రిలీజ్ కాబోతోంది. వెంకీ కుడుముల ఈ మూవీకి డైరెక్టర్.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం