Pushpa 2: ‘పుష్ప మూవీ టీమ్ మేలుకో’: ట్విట్టర్‌లో మోత మోగిస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్
Pushpa 2 - The Rule: ‘పుష్ప 2: ది రూల్’ సినిమా గురించి అప్‍డేట్స్ కావాలంటూ స్టార్ హీరో అల్లు అర్జున్ అభిమానులు మరోసారి డిమాండ్స్ పెంచారు. ట్విట్టర్‌లో మోత మెగిస్తున్నారు.
Pushpa 2 - The Rule: 2021లో విడుదలైన ‘పుష్ప 1: ది రైజ్’ సినిమా బంపర్ హిట్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆ చిత్రం తెలుగుతో పాటు హిందీలోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇతర భాషల్లోనూ అదరగొట్టింది. దీంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. దర్శకుడు సుకుమార్ టేకింగ్, సినిమాను తెరకెక్కించిన విధానం అందరినీ మెప్పించింది. పుష్ప మూవీ ఫీవర్ సాధారణ ప్రేక్షకులకే కాకుండా సెలెబ్రిటీలకు కూడా పట్టింది. అల్లు అర్జున్ యాక్టింగ్, మాస్ మేనరిజమ్స్ అందరికీ తెగ నచ్చేశాయి. దీంతో పుష్ప 1కు సీక్వెల్‍గా రూపొందుతున్న ‘పుష్ప 2: ది రూల్’ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
పుష్ప 1 సూపర్ హిట్ అవడంతో ‘పుష్ప 2: ది రైజ్’ చిత్రాన్ని భారీ బడ్జెట్‍తో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అన్ని విషయాల్లో అత్యంత జాగ్రత్త తీసుకుంటున్నాడు దర్శకుడు సుకుమార్. మొదటి భాగం కంటే రెండో పార్ట్ మరింత ఆసక్తికరంగా ఉండేలా మలుస్తున్నాడు. ముందు అనుకున్న ప్లాన్లకు కొన్ని మార్పులు చేస్తున్నాడు. షూటింగ్ కూడా జోరుగా సాగుతోంది. అయితే, పుష్ప టీమ్ నుంచి అప్‍డేట్లు రాకపోతుండటంతో అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు హీరో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్, ‘వేర్ ఈజ్ పుష్ప’ వీడియో గ్లింప్స్ మినహా మరే అప్‍డేట్స్ ‘పుష్ప 2: ది రూల్’ నుంచి రాలేదు. గ్లింప్స్ వచ్చి సుమారు మూడు నెలలు అవుతోంది. దీంతో అభిమానులు మరోసారి ట్విట్టర్‌లో మోత మోగిస్తున్నారు.
“పుష్ప టీమ్ మేలుకోవాలి” అంటూ ‘#WakeUpTeamPushpa’ హ్యాష్ ట్యాగ్‍తో ట్వీట్లు చేస్తున్నారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్. నేడు వేలాది మంది పోస్టులు చేస్తున్నారు. దీంతో ఈ హ్యాష్ ట్యాగ్ మళ్లీ ట్రెండింగ్‍లోకి వచ్చింది. ‘పుష్ప 2: ది రూల్’ అప్‍డేట్స్ కావాల్సిందేనని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇతర చాలా సినిమాల అప్‍డేట్స్ వస్తూనే ఉన్నాయని, కానీ పుష్ప టీమ్ నుంచి ఏం రావడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థను హ్యాష్‍ట్యాగ్‍లను కూడా జోడించి కొందరు ట్వీట్స్ చేస్తున్నారు. కొందరు మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.
పుష్ప మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తోంది. ఐపీఎస్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రను వైవిధ్య నటుడు ఫాహద్ ఫాజిల్ పోషించాడు. జగదీశ్ ప్రతాప్ బండారీ, రావు రమేశ్, జగపతిబాబు, అనసూయ, సునీల్ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ, వై రవిశంకర్.. నిర్మిస్తున్నారు.
పుష్ప-2 చిత్రంలో యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. అయితే, ఈ విషయంపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు.