OTT Review: ఓటీటీ రివ్యూ.. శృంగార పిచ్చితో ఒంటినిండా గాయాలు చేసే భర్త, మరొకరితో అఫైర్.. బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?-vivekanandan viral review in telugu streaming on aha ott malayalam bold movie vivekanandan viralanu explained telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Review: ఓటీటీ రివ్యూ.. శృంగార పిచ్చితో ఒంటినిండా గాయాలు చేసే భర్త, మరొకరితో అఫైర్.. బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?

OTT Review: ఓటీటీ రివ్యూ.. శృంగార పిచ్చితో ఒంటినిండా గాయాలు చేసే భర్త, మరొకరితో అఫైర్.. బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu

OTT Bold Movie Vivekanandan Viral Review In Telugu: ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న మలయాళ బోల్డ్ మూవీ వివేకానందన్ వైరల్. కామ కోరికలతో రగిలిపోయే భర్త, అడల్ట్ కంటెంట్ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమా ఆహాలో ఓటీటీ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి వివేకానందన్ వైరల్ రివ్యూలో తెలుసుకుందాం.

వివేకానందన్ వైరల్ మూవీ రివ్యూ

OTT Bold Movie Vivekanandan Viral Review Telugu: తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో కూడా బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ సినిమాలు ఇటీవల కాలంలో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. అలా రీసెంట్‌గా ఆహా ఓటీటీలో రిలీజ్ అయిన మలయాళ బోల్డ్ సినిమానే వివేకానందన్ వైరల్.

దసరా విలన్ షైన్ టామ్ చాకో, గ్రేసీ ఆంటోనీ, స్వాసిక, మరీనా మైఖేల్ కురిసింగల్, జానీ ఆంటోనీ, మంజు పిల్లై, పార్వతి మాల తదితరులు కీలక పాత్రలు పోషించిన వివేకానందన్ వైరల్ సినిమాకు కమలర్ దర్శకత్వం వహించారు. మలయాళంలో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 7 నుంచి ఆహాలో తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ ఓటీటీ బోల్డ్ మూవీ ఎలా ఉందో నేటి వివేకానందన్ వైరల్ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

వివేకానందన్ కేరళలోని ఓ గ్రామంలో భార్య సితార (స్వాసిక), కూతురు, తల్లి సావిత్రి టీచర్‌తో (పార్వతి మాల) కలిసి ఉంటాడు. టౌన్‌లో ఏరియా నీటి అధికారిగా పని చేస్తుంటాడు. అందుకోసం టౌన్‌లోనే ఉంటాడు. వీకెండ్స్‌లో మాత్రం భార్య, పిల్లలతో ఉంటాడు. వివేకానందన్‌కు విపరీతమైన శృంగార పిచ్చి. అందుకోసం ఆయుర్వేద గుళికలు, చూర్ణం, లేహ్యం వంటివి కూడా వాడుతుంటాడు.

శృంగారం లేనిది ఒక్కరోజు కూడా ఉండలేని వివేకానందన్ సిటీలో డయానా (గ్రేసీ ఆంటోనీ) అనే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని లివింగ్ రిలేషన్‌లో ఉంటాడు. అయితే, పడక గదిలో వివేకానందన్‌తో సితార, డయానా పడే వేదన పడుతుంటారు. ఇద్దరు వివేకానందన్ వల్ల శారీరకంగా హింసకు గురవుతుంటారు. ఈ క్రమంలోనే వివేకానందన్ మరో అమ్మాయి కోసం ట్రై చేస్తుంటాడు.

ట్విస్టులు

ఈ విషయం తెలిసి డయానా, సితార కలసి ఏం చేశారు? వారు వివేకానందన్ నుంచి కోరుకుంది ఏంటీ? సమాజానికి ఏం చెప్పాలనుకున్నారు? ఇందులో యూట్యూబర్ ఐషా (మరీనా మైఖేల్) పాత్ర ఏంటీ? వివేకానందన్ తల్లిదండ్రులు ఎందుకు మాట్లాడుకోరు? వంటి విషయాలు తెలియాలంటే వివేకానందన్ వైరల్ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

వివేకానందన్ వైరల్ సినిమా కథ దాదాపుగా సెక్సువల్ అబ్యూస్ మీద ఆధారపడి తెరకెక్కింది. భర్త అనే అధికారంతో భార్యతో ఎలా ప్రవర్తించొచ్చనే పోకడను ప్రశ్నించే సినిమా ఇది. భార్య అయినా సరే అంగీకారం లేకుండా తాకడం ఒకరకమైన లైంగిక వేధింపు అని చెప్పే సినిమా ఇది. అయితే, ఇందులో భార్యల శారీరక హింసకు సంబంధించిన పాయింట్‌ను టచ్ చేశారు. సమాజంలో కొంతమంది గృహిణులు ఇలా భర్తలు చేసే గాయాల వల్ల నలిగిపోతూ, మనో వేదనకు గురయ్యే వారికి స్ఫూర్తిగా తెరకెక్కించారు.

సినిమాలో శృంగార సమయంలో భార్యను శారీరక హింసకు గురి చేసే భర్త, అతన్ని ఎదుర్కొనేందుకు తన భర్తతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో భార్య చేసే పోరాటం సన్నివేశాలతో చిత్రీకరించారు. ఇంటర్వెల్ వరకు వివేకానందన్ తీరు, సెక్స్ పట్ల్ అతనికున్న పిచ్చి, భార్యను శారీరకంగా హింసింస్తేనే తృప్తి చెందడం, అక్రమ సంబంధం వంటి సీన్లతో సాగుతుంది.

అడల్ట్ కంటెంట్ సీన్స్

ఇంటర్వెల్ తర్వాత వివేకానందన్‌ క్యారెక్టర్ ఏంటీ అనేది సమాజానికి ఎలా చూపించారనే కథాంశంతో సాగుతుంది. అయితే, తీసుకున్న పాయింట్ సీరియస్‌ది అయినా టేకింగ్‌లో అంతగా బలం లేకపోయింది. ఇంటర్వెల్ వరకు బాగానే ఉన్న వివేకానందన్‌ను ఎక్స్‌పోజ్ చేసే సీన్స్ అంతగా వర్కౌట్ కాలేదు. తమ శరీరం, తమ ఇష్టం అని చెప్పే పాయింట్‌ను చాలా సాగదీసినట్లు అయింది. చివరిలో ఏ మేసెజ్ ఇచ్చి ముగించారు.

క్లైమాక్స్ పర్వాలేదు. సంగీతం ఓకే. నటీనటుల యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. కొన్ని సీన్స్, పాత్రలు చెప్పే విషయాలు లాజిక్స్ లేకుండా ఉంటాయి. సెక్స్ కోసం పరితపించే పాత్రలో షైన్ టామ్ చాకో బాగా చేశాడు. దాంతోనే ఎంగేజ్ అవ్వగలం. చాలా వరకు అడల్ట్ కంటెంట్ సీన్స్ ఉన్నాయి. కాబట్టి, ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడలేం.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం