టాలీవుడ్‍, కోలీవుడ్‍లో సెన్సేషన్‍గా మారిన రెండు క్రేజీ రూమర్లు.. నిజమవుతాయా?-vivek athreya with rajinikanth with mani ratnam and naveen polishetty these two crazy rumors in tollywood kollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  టాలీవుడ్‍, కోలీవుడ్‍లో సెన్సేషన్‍గా మారిన రెండు క్రేజీ రూమర్లు.. నిజమవుతాయా?

టాలీవుడ్‍, కోలీవుడ్‍లో సెన్సేషన్‍గా మారిన రెండు క్రేజీ రూమర్లు.. నిజమవుతాయా?

రెండు క్రేజీ కాంబినేషన్లపై రూమర్లు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్‍లో ఇవి సెన్సేషన్‍గా మారాయి. ఈ ప్రాజెక్టులపై సోషల్ మీడియాలో ఫుల్ బజ్ నెలకొంది. ఆ రెండు ఏవంటే..

టాలీవుడ్‍, కోలీవుడ్‍లో సెన్సేషన్‍గా మారిన రెండు క్రేజీ రూమర్లు.. నిజమవుతాయా?

తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో రెండు రీసెంట్ రూమర్లు సంచలనంగా మారాయి. ఎవరూ ఇప్పటి వరకు ఊహించని రెండు కాంబినేషన్లతో ఈ పుకార్లు వస్తున్నాయి. ఈ రూమర్లు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. కొలీవుడ్ సూపర్ రజినీకాంత్‍తో తెలుగు యంగ్ డైరెక్టర్ మూవీ బజ్ వస్తోంది. మరో ప్రాజెక్ట్ కూడా క్రేజీ పుకారు బయటికి వచ్చింది. ఆ వివరాలు ఇవే..

రజినీకాంత్‍తో వివేక్ ఆత్రేయ అంటూ..

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఇప్పటి వరకు తన మార్క్ చూపించారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి, సరిపోదా శనివారం చిత్రాలతో టాలెంటెడ్ న్యూఏజ్ ఫిల్మ్ మేకర్‌గా పేరు తెచ్చుకున్నారు. సరిపోదా శనివారం మినహా మిగిలిన కామెడీ జానర్లో డిఫరెంట్ స్కీన్ ప్లేతో ఉంటాయి. అయితే, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్‍తో వివేక్ ఆత్రేయ సినిమా చేయనున్నారంటూ ఓ రూమర్ తాజాగా చక్కర్లు కొడుతోంది.

రజినీకాంత్, వివేక్ ఆత్రేయ కాంబోనూ ఇప్పటి వరకు ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. అలాంటిది ఇప్పుడు వీరిద్దరు కలిసి ఓ మూవీ చేయనున్నారంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్ సెన్సేషన్‍గా మారింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూజ్ చేయనుందనే సమాచారం కూడా బయటికి వచ్చింది. వివేక్ ఆత్రేయ స్టోరీలైన్ నచ్చి రజినీ ఓకే చెప్పారని తెలుస్తోంది. పూర్తిస్థాయి నరేషన్‍తో రావాలని అడిగారట.

ఒకవేళ వివేక్ ఆత్రేయ చెప్పిన ఫుల్ నరేషన్ నచ్చితే రజినీకాంత్ ఈ ప్రాజెక్ట్ చేస్తారని టాక్. రజినీ ప్రస్తుతం కూలీ, జైలర్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు. వివేక్‍తో అంతా ఓకే అనుకుంటే వారి తర్వాత ఈ ప్రాజెక్టే ఉండనుందని తెలుస్తోంది. ఈ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతా సెట్ అయి ఇది ప్రాజెక్ట్ నిజమైతే క్రేజీ కాంబినేషన్ కానుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మణిరత్నం దర్శకత్వంలో నవీన్!

తమిళ లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెలుగు టాలెంటెడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించనున్నారని ఓ రూమర్ బయటికి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ లాక్ అయిందని, త్వరలో షూటింగ్ కూడా మొదలవుతుందని సమాచారం చక్కర్లు కొడుతోంది. తమిళం, తెలుగులో ద్విభాషా చిత్రంగా రొమాంటిక్ కామెడీ జానర్లో తెరకెక్కుతుందని తెలుస్తోంది.

మణిరత్నం - నవీన్ పోలిశెట్టి మూవీ ఉంటుందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మొత్తంగా ఈ రెండు క్రేజీ రూమర్లు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇవి నిజమవుతాయా.. ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులు కార్యరూపం దాలుస్తాయా అనేది చూడాలి. ప్రస్తుతం రెండు సినీ ఇండస్ట్రీల్లో ఇవి సెన్సేషన్‍గా మారాయి.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం