Vishwaksen lungi dance: లుంగీ కట్టుకొని ఆలియా హిట్ పాటకు విశ్వక్‌సేన్ స్టెప్పులు.. వీడియో వైరల్
Vishwaksen lungi dance: లుంగీ కట్టుకొని ఆలియా భట్ హిట్ పాటకు విశ్వక్‌సేన్ స్టెప్పులు వేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. తన తొలి రీల్ ఇదే అని అతడు చెప్పాడు.
Vishwaksen lungi dance: టాలీవుడ్ యువ నటుడు విశ్వక్‌సేన్ తన నెక్ట్స్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నేహా శెట్టి ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. అయితే తాజాగా బుధవారం (ఆగస్ట్ 2) విశ్వక్ తన ఇన్‌స్టాగ్రామ్ లో తాను చేసిన తొలి రీల్ పోస్ట్ చేశాడు. ఇందులో అతడు లుంగీ కట్టుకొని డ్యాన్స్ చేయడం విశేషం.
అది కూడా బాలీవుడ్ నటి ఆలియా భట్ సూపర్ హిట్ సాంగ్ వాట్ ఝుంకాపై విశ్వక్ స్టెప్పులేశాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సెట్స్ లోనే విశ్వక్ రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ మూవీలోని ఈ పాటపై డ్యాన్స్ చేశాడు. అతనితోపాటు సింగర్లు సాకేత్, పర్ణిక, శృతి రంజని, పృథ్వీ చంద్ర, దామినీ భాటియాలు కూడా ఈ పాటకు స్టెప్పులేశారు. ఈ వీడియోను విశ్వక్ ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నంబర్ వన్ ట్రెండింగ్ లో ఉన్న సందర్భంగా టాలీవుడ్ కు చెందిన సెన్సేషనల్ సింగర్లతో కలిసి నా తొలి రీల్ చేశాను" అనే క్యాప్షన్ తో విశ్వక్ ఈ వీడియో షేర్ చేశాడు. ఇది వెంటనే వైరల్ గా మారిపోయింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతోపాటు విశ్వక్.. రవితేజ ముల్లపూడి డైరెక్షన్ లోనూ మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ను ఆగస్ట్ 6న రివీల్ చేయనున్నారు.
మరోవైపు బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ తో విశ్వక్ విభేదాలపై ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఓ సినిమా వేడుకలో విశ్వక్ మాట్లాడుతూ అందరినీ ఆనందంగా ఉంచేందుకు తానేమీ బిర్యానీని కాదంటూ దర్శకుడు సాయిరాజేష్‌పై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్స్ వేశాడు విశ్వక్‌సేన్.
తాజాగా ఈ గొడవపై దర్శకుడు సాయిరాజేష్ కూడా స్పందించాడు. విశ్వక్‌సేన్‌కు కథ వినిపించాలని అనుకున్నది నిజమేనని, కానీ అతడు వినలేదని చెప్పాడు. విశ్వక్‌సేన్ తన కథను వినకపోవడానికి కారణం ఏమిటో కూడా తనకు తెలియదని సాయిరాజేష్ అన్నాడు. విశ్వక్‌సేన్ ప్రయారిటీ లిస్ట్ డైరెక్టర్స్‌లో తాను లేకపోయుండకపోవచ్చునని తెలిపాడు.
విశ్వక్‌సేన్ బేబీ సినిమాకు నో చెప్పిన విధానం తనకు నచ్చలేదని పేర్కొన్నాడు. తాను నో చెప్పిన సినిమా హిట్టయింది. ఆ హిట్టును ఎంజాయ్ చేయాలి కానీ ఎదుటివారిని ఇన్‌సల్ట్ చేయొద్దని విశ్వక్‌సేన్ అన్న మాటలు తనను బాధించాయని సాయిరాజేష్ పేర్కొన్నాడు.
సంబంధిత కథనం