Vishwak Sen Laila: పాటకు లిరిక్స్ రాసిన విశ్వక్ సేన్.. లైలా నుంచి వీడియో సాంగ్ రిలీజ్.. సోను మోడల్‌గా మాస్ కా దాస్!
Vishwak Sen As Sonu Model Laila Song Released: విశ్వక్ సేన్ నటించిన కొత్త సినిమా లైలా. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ సోను మోడల్‌గా కనిపించనున్నాడు. తాజాగా లైలా ఫస్ట్ సింగిల్ సోను మోడల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు విశ్వక్ సేన్ లిరిక్స్ రాయడం విశేషం.
Vishwak Sen As Sonu Model Laila Song Released: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అప్ కమింగ్ మూవీ లైలా. యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన లైలా మూవీని వాలంటైన్ డే కానుకగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ లైలా సినిమాలో విశ్వక్ సేన్ అబ్బాయిగా, అమ్మాయిగా రెండు క్యారెక్టర్స్ పోషించి తన వెర్సటాలిటీ చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
అబ్బాయి అమ్మాయిగా విశ్వక్ సేన్
లైలా సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి లైలా సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే స్ట్రయికింగ్ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్‌తో లైలా మూవీ అందరి దృష్టిని ఆకర్షించింది. విభిన్నంగా ఉన్న ఆ పోస్టర్‌తో లైలా మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. ఇంకా ఇందులో విశ్వక్ సేన్ అబ్బాయి, అమ్మాయిగా నటించనున్నాడనడంతో మరింత క్యూరియాసిటీ నెలకొంది.
అమ్మాయిల మనసు గెలుచుకోవడంపై
ఈ క్రమంలోనే మ్యూజిక్ ప్రమోషన్స్‌ని కిక్‌స్టార్ట్ చేస్తూ మేకర్స్ లైలా మూవీలోని ఫస్ట్ సింగిల్ సోను మోడల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాట విశ్వక్ సేన్ పాత్ర సోను మోడల్‌ను పరిచయం చేస్తుంది. అతని పర్సనాలిటీపై ఒక గ్లింప్స్ అందిస్తుంది. ఇది సోను చార్మ్, తన ప్రత్యేక స్కిల్స్‌తో అమ్మాయిల మనసులని ఎలా గెలుచుకుంటాడో చూపిస్తూ పాటలో హైలెట్ చేశారు.
విశ్వక్ సేన్ లిరిక్స్
లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ట్యూన్ ఆకట్టుకునే బీట్‌లతో మెస్మరైజ్ చేసేలా ఉంది. ఈ వైబ్ ఏంథమ్‌కి విశ్వక్ సేన్ స్వయంగా లిరిక్స్ రాస్తూ ఫన్ నంబర్‌కు పర్సనల్ టచ్ జోడించాడు. హీరోగా, డైరెక్టర్‌గా మెప్పించిన విశ్వక్ సేన్ తాజాగా పాటకు లిరిక్స్ అందించడం విశేషంగా మారింది. ఇక ఈ పాటను సింగర్స్ నారాయణ్ రవిశంకర్, రేష్మా శ్యామ్ ఎనర్జిటిక్‌గా పాడారు.
మంచి బిగినింగ్
విశ్వక్ సేన్ ఎనర్జీతో నిండి తన డైనమిక్ డ్యాన్స్ మూమెంట్స్‌ని ప్రజెంట్ చేశారు. లావిష్‌గా చిత్రీకరించిన ఈ పాట విజువల్ ఫీస్ట్‌ను అందించేలా ఉంది. ఈ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలుస్తుందని, మంచి హిట్ పాటతో మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
హీరోయిన్‌గా డెబ్యూ
కాగా లైలా సినిమాలో హీరోయిన్‌గా ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీతోనే ఆకాంక్ష శర్మ కథానాయికగా అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే అందించగా, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.