Vishwak Sen on Aha OTT: త్వరలో విశ్వక్‍సేన్ కొత్త అవతారం! ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో..-vishwak sen set to host new show on aha ott platform check details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwak Sen On Aha Ott: త్వరలో విశ్వక్‍సేన్ కొత్త అవతారం! ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో..

Vishwak Sen on Aha OTT: త్వరలో విశ్వక్‍సేన్ కొత్త అవతారం! ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో..

Chatakonda Krishna Prakash HT Telugu
Published Jul 14, 2023 11:53 PM IST

Vishwak Sen ot Aha OTT: హీరో విశ్వక్ సేన్.. ఆహా ఓటీటీలో ఓ షో చేసేందుకు రెడీ అయ్యాడని తెలుస్తోంది. అయితే, ఏ రకమైన షో చేయనున్నాడన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా ఉంది.

విశ్వక్‍సేన్
విశ్వక్‍సేన్

Vishwak Sen ot Aha OTT: యంగ్ డైనమిక్ హీరో, మాస్‍ కా దాస్ ‘విశ్వక్ సేన్’ త్వరలో కొత్త అవతారం ఎత్తబోతున్నాడని తెలుస్తోంది. హీరోగా, కథకుడిగా, డైరెక్టర్‌గా అతడు ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఈ ఏడాది విడుదలైన దాస్ కా దమ్కీ చిత్రానికి కూడా తానే దర్శకత్వం వహించి.. హీరోగా నటించాడు. కాగా, విశ్వక్‍సేన్ త్వరలోనే మరో కొత్త అవతారం ఎత్తనున్నాడని తెలుస్తోంది. ఓటీటీ ప్లాట్‍ఫామ్‍‍లో ఓ షోకు హోస్ట్‌గా వ్యవహించనున్నాడని సమాచారం. ఆహా ఓటీటీలో విశ్వక్ ఓ షో చేయనున్నాడన్న సమాచారం బయటికి వచ్చింది.

ఆహా ఓటీటీలో ఓ షోను విశ్వక్‍సేన్ త్వరలోనే చేయనున్నాడని టాక్. మొత్తంగా ఈ షో 15 ఎపిసోడ్లు ఉంటుందని సమాచారం. అయితే, ఇది టాక్ షోగా ఉంటుందా.. లేక రియాల్టీ షోనా.. గేమ్ షోనా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే, ఇది టాక్ షో అనే వాదన ఎక్కువగా వినిపిస్తుంది. ఈ విషయంపై ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ త్వరలోనే ప్రకటించే ఛాన్స్ ఉంది. బాలకృష్ణ ‘అన్‍స్టాపబుల్‍’లా విశ్వక్ షో ఉంటుందంటూ కొందరు అంచనా వేస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే ఆహా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

ఆహాలో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన అన్‍స్టాపబుల్ టాక్ షో రెండు సీజన్లు బంపర్ హిట్ అయ్యాయి. ఈ షో వల్ల ఆహాకు వ్యూవర్‌షిప్ గణనీయంగా పెరిగింది. అలాగే, కొత్త షోలు, సినిమాలతో ఆహా ఇటీవల వేగంగా వృద్ధి చెందుతోంది. సబ్‍స్రైబర్లను పెంచుకుంటోంది.

ఈ ఏడాది దాస్‍ కా ధమ్కీ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‍లో విశ్వక్ సేన్ విడుదల చేశాడు. అయితే, ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. గతేడాది అశోక వనంలో అర్జున కల్యాణం, ఓరి దేవుడా చిత్రాలతో జోరు చూపించిన విశ్వక్‍కు దాస్ కా ధమ్కీతో కాస్త నిరాశ ఎదురైంది. కాగా, ప్రస్తుతం విశ్వక్‍సేన్ రెండు సినిమాలు (VS10, VS11) చేస్తున్నాడు. రవితేజ ముళ్లపూడి, కృష్ణ చైతన్య డైరెక్షన్‍లో మూవీలు చేస్తున్నాడు విశ్వక్.

వెళ్లిపోమాకే, ఈ నగరానికి ఏమైంది తర్వాత.. 2019లో ఫలక్‍నుమా దాస్ సినిమాతో ఫుల్ లెంగ్త్ హీరో అయ్యాడు విశ్వక్. ఈ మూవీకి రచన, దర్శకత్వం చేశాడు. సహ నిర్మాతగానూ వ్యవహరించాడు. ఆ తర్వాత అతడు నటించిన ‘హిట్’ మూవీ మంచి విజయం సాధించింది. పాగల్, అశోక వనంలో అర్జున కల్యాణం, ఓరి దేవుడా చిత్రాలు కూడా మోస్తరు విజయాలు సాధించాయి. దాస్ కా దమ్కీ చిత్రంలో హీరోగా నటించటంతో పాటు డైరెక్షన్ కూడా చేశాడు. ఆ చిత్రానికి నిర్మాత కూడా అతడే.

Whats_app_banner