Vishwak Sen: ‘గాడిద గుడ్డు’ అంటూ విశ్వక్‍సేన్ ట్వీట్.. నెక్స్ట్ మూవీపై వివాదం రేగనుందా?-vishwak sen responds on his movie mechanic rocky theatrical rights says not sold ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwak Sen: ‘గాడిద గుడ్డు’ అంటూ విశ్వక్‍సేన్ ట్వీట్.. నెక్స్ట్ మూవీపై వివాదం రేగనుందా?

Vishwak Sen: ‘గాడిద గుడ్డు’ అంటూ విశ్వక్‍సేన్ ట్వీట్.. నెక్స్ట్ మూవీపై వివాదం రేగనుందా?

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 12, 2024 09:26 PM IST

Vishwak Sen - Mechanic Rocky: విశ్వక్‍సేన్ హీరోగా నటిస్తున్న తదుపరి మూవీ ‘మెకానిక్ రాకీ’ థియేట్రికల్ హక్కుల డీల్ జరిగిందంటూ అధికారికంగా అప్‍డేట్ వచ్చింది. అయితే, హక్కులను అమ్మలేదంటూ విశ్వక్ నేడు ఓ ట్వీట్ చేశారు.

Vishwak Sen: ‘గాడిద గుడ్డు’ అంటూ విశ్వక్‍సేన్ ట్వీట్.. నెక్స్ట్ మూవీపై వివాదం రేగనుందా?
Vishwak Sen: ‘గాడిద గుడ్డు’ అంటూ విశ్వక్‍సేన్ ట్వీట్.. నెక్స్ట్ మూవీపై వివాదం రేగనుందా?

Vishwak Sen - Mechanic Rocky: మాస్ కా దాస్ విశ్వక్‍ సేన్ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మే 31న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో యాక్టింగ్‍తో అతడు మెప్పించారు. యాక్షన్ మోడ్‍లో దుమ్మురేపారు. బాక్సాఫీస్ వద్ద కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పర్వాలేదనిపించింది. ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు విశ్వక్‍సేన్. అయితే, ఈ మూవీ థియేట్రికల్ హక్కుల గురించి విశ్వక్ చేసిన ట్వీట్‍తో వివాదం రేగేలా కనిపిస్తోంది.

yearly horoscope entry point

ఏం జరిగిందంటే..

‘మెకానిక్ రాకీ’ సినిమా ఆల్ ఇండియా థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకున్నట్టు సురేశ్ ఆసియన్ ఎంటర్‌టైన్‍మెంట్ వెల్లడించింది. ఈ విషయంపై మంగళవారం (జూన్ 11) అధికారికంగా ప్రకటన చేసింది. అయితే, ఈ విషయంపై వచ్చిన ఓ ట్వీట్‍కు విశ్వక్‍సేన్ నేడు (జూన్ 12) రిప్లే ఇచ్చారు. అసలు ఈ మూవీ హక్కులను ఇంకా విక్రయించలేదని ట్వీట్ చేశారు. దీంతో ఈ అంశం వివాదం రేగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

‘గాడిద గుడ్డేం కాదు’

మెకానిక్ రాకీ సినిమా హక్కుల విషయంలో పోస్ట్ అయిన ఓ ట్వీట్‍కు విశ్వక్‍సేన్ కామెంట్ చేశారు. తమ మూవీ హక్కులను విక్రయించామన్న విషయంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. “డాంకీ ఎగ్ (గాడిద గుడ్డు) ఏం కాదు. జీఎస్టీతో అంట. టీ షాప్ ముచ్చట్లు తీసుకొచ్చి ట్విట్టర్‌లో పెడుతున్నారు. మెకానిక్ రాకీని ఇంకా అమ్మలేదు. నిజాలను సరిగ్గా చెప్పండి. ఇది టీమ్ కెరీర్” అని విశ్వక్ కామెంట్ ట్వీట్ చేశారు.

వివాదంగా మారనుందా?

ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసుకున్నామని ఆసియన్ సురేశ్ ప్రొడక్షన్ అధికారికంగా వెల్లడించగా.. అలాంటిదేమీ లేదని విశ్వక్ ఇప్పుడు స్పందించారు. అయితే, హీరోకు తెలియకుండా ఈ డీల్ జరిగి ఉంటుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ అంశం చిన్నపాటి వివాదం అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, హక్కుల విషయం విశ్వక్‍సేన్‍కు నిజంగా తెలియదా.. లేకపోతే మెకానిక్ రాకీ మూవీకి బజ్ కోసం ఇలా చెప్పారా అని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ అంశం అలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.

మెకానిక్ రాకీ చిత్రానికి తేజ ముల్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వక్‍సేన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేక్స్ బెజోయ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీ రిలీజ్

విశ్వక్‍సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. ఈ మూవీ జూన్ 14వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. మే 31న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా 15 రోజులు గడవకుండానే ఓటీటీలో అడుగుపెడుతోంది. మంచి బజ్‍తో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి పర్ఫార్మెన్స్ చేసింది. ఈ రూరల్ మాస్ యాక్షన్ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. నేహా శెట్టి హీరోయిన్‍గా నటించగా.. అంజలి కీలకపాత్ర చేశారు. జూన్ 14 నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని చూడొచ్చు.

Whats_app_banner