Telugu News  /  Entertainment  /  Vishwak Sen Nivetha Pethuraj Second Single Promo Released
దాస్ కా ధమ్కీ సాంగ్ ప్రోమో
దాస్ కా ధమ్కీ సాంగ్ ప్రోమో

Das Ka Dhamki Second Single: దాస్ కా ధమ్కీ నుంచి రెండో పాటకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

19 January 2023, 19:26 ISTMaragani Govardhan
19 January 2023, 19:26 IST

Das Ka Dhamki Second Single: విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దాస్ కా ధమ్కీ. ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై మూవీపై అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటకు ముహూర్తం ఫిక్స్ చేసింది.

Das Ka Dhamki Second Single: గతేడాది విశ్వక్ సేన్ రెండు విజయాలతో అదరగొట్టాడు. తొలుత అశోక వనంలో అర్జున కల్యాణంతో పాటు ఓరీ దేవుడా అనే సినిమాతో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం దాస్ కా ధమ్కీ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాలో తను నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ఓ సాంగ్ విడుదలై సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

దాస్ కా ధమ్కీ చిత్రం నుంచి రెండో పాట ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. మావా బ్రో అంటూ సాగే ఈ పాట ప్రోమోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో విశ్వక్ సేన్ పోస్టు పెట్టాడు. మావా బ్రో ఇది మీ కోసమే అంటూ ట్వీట్ చేశాడు. జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తున్నాడు బ్రో అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా పూర్తి పాటను శుక్రవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.

ఈ చిత్రంలో రోహిణి, రావు రమేశ్, పృథ్వీరాజ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లోనూ విడుదల చేయనుంది. ఇది విశ్వక్ మొదటి పాన్ ఇండియా చిత్రం. వన్యమే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ పతాకాలపై కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెజవాడ ప్రసన్నకుమార్ ఈ సినిమాకు డైలాగ్స్ అందించారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా.. దినేష్ కే బాబు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

టాపిక్