Vishwak Sen Laila: లేడి గెటప్‌తో విశ్వక్ సేన్ న్యూ మూవీ.. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా లైలా.. ఆ హిందీ మూవీకి కాపీనా?-vishwak sen new movie with lady role laila first look released and akanksha sharma debut entry as heroine ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwak Sen Laila: లేడి గెటప్‌తో విశ్వక్ సేన్ న్యూ మూవీ.. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా లైలా.. ఆ హిందీ మూవీకి కాపీనా?

Vishwak Sen Laila: లేడి గెటప్‌తో విశ్వక్ సేన్ న్యూ మూవీ.. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా లైలా.. ఆ హిందీ మూవీకి కాపీనా?

Sanjiv Kumar HT Telugu
Dec 26, 2024 11:08 AM IST

Vishwak Sen Laila Movie First Look Release: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేడి గెటప్పులో కనిపించనున్నాడు. అబ్బాయితోపాటు అమ్మాయి పాత్రలో విశ్వక్ సేన్ నటించనున్న సినిమా లైలా. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ లైలా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అయితే, ఓ హిందీ సినిమాకు రీమేక్ లేదా కాపీలా అనిపిస్తోంది.

లేడి గెటప్‌తో విశ్వక్ సేన్ న్యూ మూవీ.. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా లైలా.. ఆ హిందీ మూవీకి కాపీనా?
లేడి గెటప్‌తో విశ్వక్ సేన్ న్యూ మూవీ.. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా లైలా.. ఆ హిందీ మూవీకి కాపీనా?

Vishwak Sen Laila Movie First Look Release: వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన విశ్వక్ సేన్ ఇటీవలే మెకానిక్ రాకీ మూవీతో అలరించాడు. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న మెకానిక్ రాకీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి కూడా వచ్చేసింది.

yearly horoscope entry point

అబ్బాయి, అమ్మాయిగా విశ్వక్ సేన్

మెకానిక్ రాకీ సినిమా తర్వాత వెంటనే మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించేశాడు విశ్వక్ సేన్. లైలా అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న సినిమాతో మాస్ కా దాస్ విశ్వక్సేన్ అందరినీ ఆశ్చర్యపరుచనున్నాడు. ఈ సినిమాలో అబ్బాయి, అమ్మాయిగా రెండింటినీ పోషించి తన వెర్సటాలిటీ చూపించనున్నాడు విశ్వక్ సేన్.

లైలా ఫస్ట్ లుక్ రిలీజ్

యూనిక్ క్యారెక్టర్‌తో విశ్వక్ సేన్ నటిస్తోన్న లైలా సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న లైలా మూవీని షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇది వరకు విడుదల చేసిన లైలా ఐ లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. అయితే, తాజాగా లైలా ఫస్టు లుక్‌ను రిలీజ్ చేశారు.

సోను మోడల్‌గా

క్రిస్మస్ సందర్భంగా మేకర్స్ లైలా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు, ఇందులో విశ్వక్సేన్ అద్భుతమైన స్టైలిష్, రిచ్ అవతార్‌లో కనిపించారు. మోడరన్ అవుట్ ఫిట్ లో స్పోర్టింగ్ షేడ్స్, గోల్డ్ యాక్ససరీస్ ధరించి కూల్ అండ్ కాన్ఫిడెంట్‌గా కనిపించాడు విశ్వక్ సేన్. అతని పాత్రను సోను మోడల్‌గా ప్రజెంట్ చేశారు.

బ్యూటిఫుల్ మేకోవర్

లైలా ఫస్ట్ లుక్‌లో విశ్వక్ సేన్ మెడపై పచ్చబొట్టు, చేతులపై "సోను లవర్", సోను కిల్లర్" అని రాసి ఉన్న టాటూలతో కనిపించాడు. అతని బోల్డ్ ఎక్స్‌ప్రెషన్స్ పాత్ర కాంప్లెసిటీ మల్టీ-డైమెన్షనల్ నేచర్‌ని సూచిస్తున్నాయి. పోస్టర్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. విశ్వక్సేన్ ఈ చిత్రంలో అమ్మాయి పాత్రను పోషించడానికి బ్యూటిఫుల్‌గా మేకోవర్ అయినట్లు తెలుస్తోంది.

రీమేక్ లేదా కాపీ

అయితే, లైలా సినిమాలో విశ్వక్ సేన్ చాలా వేరియేషన్స్ చూపించనున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, లైలా మూవీ బాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న డ్రీమ్ గర్ల్ మూవీకి కాపీ లేదా రీమేక్ అనే టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా అమ్మాయిగా నటిస్తూ డేటింగ్ యాప్‌లో అబ్బాయిలకు కాల్స్ చేస్తుంటాడు.

డ్రీమ్ గర్ల్ మూవీలా

ఇప్పుడు అదే స్టోరీతో విశ్వక్ సేన్ లైలా ఉంటుందా అనే అనుమానాలను సోషల్ మీడియాలో నెటిజన్స్ వ్యక్తపరుస్తున్నారు. ఇకపోతే లైలా మూవీలో విశ్వక్ సేన్‌కు జోడీగా ఆకాంక్ష శర్మ కొత్త హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తోంది. అలాగే, ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే అందించగా, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున లైలా మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Whats_app_banner