Gangs of Godavari Day 1 Collections: విశ్వక్ మూవీకి సూపర్ ఓపెనింగ్.. కానీ గామి కంటే తక్కువే: ఫస్ట్ డే కలెక్షన్లు ఇలా..
Gangs of Godavari Day 1 Box office Collections: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి అంచనాలకు తగ్గట్టే మంచి ఓపెనింగ్ దక్కింది. తొలి రోజే వసూళ్లు సూపర్‌గా వచ్చాయి. అయితే, గామిని మాత్రం బీట్ చేయలేకపోయింది.
Gangs of Godavari Day 1 Box office Collections: మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం ఫుల్ హైప్ మధ్య థియేటర్లలోకి వచ్చింది. మాస్ యాక్షన్‍తో ట్రైలర్ అదిరిపోవడంతో అంచనాలు పెరిగాయి. ఈ మాస్ యాక్షన్ మూవీ శుక్రవారం (మే 31) విడుదలైంది. క్రేజ్ ఉండటంతో బుకింగ్స్ కూడా జోరుగా జరిగాయి. దీంతో మిక్స్డ్ టాక్ వచ్చినా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తొలి రోజు అదిరిపోయే కలెక్షన్లు దక్కించుకుంది. సూపర్ ఓపెనింగ్ సొంతం చేసుకుంది.

తొలి రోజు కలెక్షన్లు ఇవే
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.8.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. దుమ్మురేపేలా ఓపెనింగ్ సొంతం చేసుకుంది. సుమారు 40 శాతం పెట్టుబడి తొలి రోజు రికవరీ అయినట్టు తెలుస్తోంది. తొలి రోజు కలెక్షన్ల వివరాలను మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.
బాక్సాఫీస్ నంబర్లే మాట్లాడుతున్నాయంటూ సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ నేడు (జూన్ 1) ట్వీట్ చేసింది. “మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.8.2 కోట్ల గ్రాస్‍తో అదిరిపోయేలా ఓపెనింగ్ దక్కింది. బాక్సాఫీస్ వద్ద నంబర్లే ముఖ్యం. అవే గట్టిగా మాట్లాడతాయి” అని పోస్ట్ చేసింది.
గామి కంటే తక్కువే..
విశ్వక్‍సేన్ హీరోగా నటించిన అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ గామి ఈ ఏడాది మార్చిలో రిలీజైంది. ఆ చిత్రానికి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.9కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. విశ్వక్ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్‍గా గామి నిలిచింది. అయితే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మంచి ఓపెనింగ్ తెచ్చుకున్నా తొలి రోజు వసూళ్ల విషయంలో గామిని దాటలేకపోయింది. ఫస్ట్ డే రూ.8.2కోట్లను దక్కించుకుంది ఈ యాక్షన్ మూవీ.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో లంకల రత్నాకర్ పాత్రలో విశ్వక్‍సేన్ నటనపై ప్రశంసలు దక్కుతున్నాయి. ఇంటెన్స్ పాత్రలో మాస్ కా దాస్ యాక్షన్, డైలాగ్ డెలివరీ మెప్పిస్తున్నాయి. ఈ చిత్రంలో విశ్వక్‍కు జోడీగా నేహా శెట్టి నటించారు. అంజలి కూడా ఓ ప్రధాన పాత్రలో నటించారు. గోపరాజు రమణ, నాజర్, మధునందన్, హైపర్ ఆది, సాయికుమార్, ఆయేషా ఖాన్ కీరోల్స్ చేశారు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. పొలిటికల్ టచ్‍తో రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌లా తెరెకెక్కించారు. యువన్ శంకర్ రాజా ఈ మూవీకి సంగీతం అందించారు. పాటలతో పాటు బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ మూవీకి ప్లస్ అయింది. ఈ మూవీకి అనిల్ మాదాడి సినిమాటోగ్రఫీ చేయగా.. నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మిక్స్డ్ టాక్ వచ్చినా తొలి రోజు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బాగా పర్ఫార్మ్ చేసింది. భజే వాయివేగం, గం గం గణేషా చిత్రాలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి పోటీగా వచ్చాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఇదే జోరును విశ్వక్ మూవీ కొనసాగిస్తుందేమో చూడాలి.