Gangs of Godavari OTT: మరో ఓటీటీలోకి వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-vishwak sen neha shetty gangs of godavari hindi version ott streaming on jiocinema platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gangs Of Godavari Ott: మరో ఓటీటీలోకి వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Gangs of Godavari OTT: మరో ఓటీటీలోకి వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Gangs of Godavari OTT: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా హిందీ వెర్షన్ వస్తోంది. ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్‌లో ఇప్పటికే ఉండగా.. హిందీలో మరో ఓటీటీలో అడుగుపెట్టనుంది. హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.

Gangs of Godavari OTT: మరో ఓటీటీలోకి వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

విశ్వక్‍సేన్ హీరోగా నటించిన రూరల్ యాక్షన్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సక్సెస్ సాధించింది. ఈ సినిమా మే 31వ తేదీన థియేటర్లలో విడుదలైంది. రిలీజ్‍కు ముందు ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్, ప్రమోషన్లతో బజ్ వచ్చింది. ఈ సినిమాకు రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ అంచనాలకు తగట్టే వసూళ్లు వచ్చాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం ఇప్పటికే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ఈ చిత్రం హిందీ వెర్షన్ కూడా రానుంది. అయితే, ఈ వెర్షన్ వేరే ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టనుంది.

జియోసినిమాలో..

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా హిందీ వెర్షన్ జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. జూలై 5వ తేదీన స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని జియో సినిమా అధికారికంగా వెల్లడించింది. జూలై 5 నుంచి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హిందీ వెర్షన్‍ను జియోసినిమా ప్రీమియమ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా నేడు (జూలై 2) ప్రకటించింది.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళంలో అందుబాటులో ఉండగా.. హిందీ వెర్షన్ ఇటీవలే జూన్ 28వ తేదీన జియోసినిమాలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇప్పుడు జూలై 5న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హిందీ వెర్షన్‍ను ఆ ఓటీటీ తీసుకొస్తోంది.

నెట్‍ఫ్లిక్స్‌లో నాలుగు భాషల్లో..

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జూన్ 14వ తేదీనే స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమ్ అవుతోంది. మే 31వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ సినిమా రెండు వారాల్లోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చి ఆశ్చర్యపరిచింది. ఈ మూవీకి ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. హిందీ వెర్షన్ జియో సినిమాలో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. ఈ మూవీలో లంకల రత్నాకర్ అనే యాక్షన్ రోల్ చేశారు విశ్వక్‍సేన్. నేహా శెట్టి హీరోయిన్‍గా నటించారు. అంజలి ఓ మెయిన్ రోల్ చేయగా.. నాజర్, సాయికుమార్, గోపరాజు రమణ, హైపర్ ఆది, పృథ్విరాజ్, మధుసూధన్ కీలకపాత్రల్లో కనిపించారు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు.ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ మూవీలో చుట్టంలా సూసి సాంగ్ చార్ట్ బస్టర్ అయింది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా దాదాపు రూ.25కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీకి భారీ ఓపెనింగ్ దక్కింది. తొలి రోజు ఏకంగా సుమారు రూ.8కోట్ల వసూళ్లు వచ్చాయి. అయితే, మిక్స్డ్ టాక్ రావటంతో ఆ తర్వాత కాస్త జోరు తగ్గింది.

విశ్వక్‍సేన్ తర్వాతి సినిమా ‘మెకానిక్ రాకీ’ అనే క్రేజీ టైటిల్‍తో వస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి తేజ ముల్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా చేస్తున్నారు. ఈ మూవీకి జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నారు.