OTT Release: ఓటీటీలోకి నిన్న రిలీజైన రష్మిక మందన్నా ఛావా, విశ్వక్ సేన్ లైలా.. ప్లాట్‌ఫామ్స్ ఇవేనని టాక్!
Rashmika Mandanna Chhaava Vishwak Sen Laila OTT Streaming: ఓటీటీలోకి రష్మిక మందన్నా ఛావా, విశ్వక్ సేన్ లైలా మూవీలు స్ట్రీమింగ్కు రానున్నాయి. నిన్న (ఫిబ్రవరి 14) థియేటర్లలో రిలీజ్ అయిన ఛావా, లైలా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, స్ట్రీమింగ్ డేట్స్ ఇవేనంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

Rashmika Mandanna Chhaava Vishwak Sen Laila OTT Release: ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హిందీ చిత్రం ఛావా, విశ్వక్ సేన్ తెలుగు సినిమా లైలా ఆసక్తిగా మారాయి. ఇప్పుడు ఛావా, లైలా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటనే విషయం ఆసక్తికరంగా మారింది.
ఛత్రపతి శంభాజీ కథ ఆధారంగా
రష్మిక మందన్నా నటించిన బాలీవుడ్ హిస్టారికల్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఛావా. ఇందులో రష్మిక మందన్నాకు జోడీగా బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించాడు. ఛావా చిత్రాన్ని మరాఠా ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఛావా సినిమాలో రష్మిక మందన్నా యేసు బాయి పాత్రలో నటించింది.
ఛావాకు అదిరిపోయే రెస్పాన్స్
శంభాజీగా విక్కీ కౌశల్ యాక్ట్ చేశాడు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్యా దత్తా, ప్రదీప్ రావత్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఛావా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఛావా మూవీకి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందనతోపాటు విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు.
ఛావా బడ్జెట్-కలెక్షన్స్
రూ. 130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఛావా సినిమాకు మొదటి రోజు కలెక్షన్స్ అదిరిపోయాయి. ఛావాకు ఇండియాలో తొలి రోజు రూ. 31 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్ల సమాచారం. ఇలా మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోన్న రష్మిక మందన్నా ఛావా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆసక్తికరంగా మారింది. ఛావా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిందని సమాచారం.
ఛావా ఓటీటీ స్ట్రీమింగ్
నెట్‌ఫ్లిక్స్‌లో ఛావా ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అంతేకాకుండా థియేట్రికల్ రిలీజ్‌కు నెల రోజుల తర్వాత అంటే, ఏప్రిల్ 11 తేది తర్వాత ఛావా ఓటీటీ రిలీజ్ కానుందని సమాచారం.
విశ్వక్ సేన్ లైలా
ఇక ఫిబ్రవరి 14న టాలీవుడ్ నుంచి విడుదలైన సినిమాల్లో విశ్వక్ సేన్ లైలా మూవీ ఒకటి. రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన లైలా సినిమాలో మొదటిసారిగా విశ్వక్ సేన్ లేడి గెటప్ వేశాడు. సినిమా విడుదలకు ముందు లైలాకు బాయ్ కాట్ సెగ అంటుకుంది. దాని నుంచి కోలుకుని నిన్న థియేటర్లలో విడుదలైన లైలాకు అంతగా పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదు.
ఆకట్టుకున్న విశ్వక్ లేడి గెటప్
వాసుదేవ మూర్తి అందించిన కథ, రామ్ నారాయణ్ దర్శకత్వం రొటీన్‌గా ఉన్నాయని, ఆకట్టుకునే సన్నివేశాలు ఏం లేవని తెలుగు ఆడియెన్స్ పెదవి విరుస్తున్నారని టాక్. అయితే, విశ్వక్ సేన్ నటన మాత్రం చాలా బాగుందని, లేడి గెటప్పులో ఆకట్టుకున్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో లైలా ఓటీటీ ప్లాట్‌ఫామ్, స్ట్రీమింగ్ డేట్ వివరాలు ఆసక్తిగా మారాయి.
లైలా ఓటీటీ రిలీజ్
లైలా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని సమాచారం. థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెల రోజులకు అమెజాన్ ప్రైమ్‌లో లైలా ఓటీటీ రిలీజ్ కానుందని సమాచారం. బాక్సాఫీస్ కలెక్షన్స్, ఆడియెన్స్ టాక్ దృష్ట్యా నెల రోజుల కంటే ముందుగానే అంటే ఫిబ్రవరి చివరి వారంలోనే లైలా ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సంబంధిత కథనం