Laila Twitter Review: లైలా ట్విట్టర్ రివ్యూ - విశ్వక్ సేన్ మూవీకి ఊహించని టాక్
Laila Twitter Review: విశ్వక్‌సేన్ హీరోగా నటించిన లైలా మూవీ లవర్స్ డే సందర్భంగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. విశ్వక్‌సేన్ లేడీ గెటప్‌లో కనిపించిన ఈ మూవీ టాక్ ఎలా ఉందంటే?

Laila Twitter Review: విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా మూవీ ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించాడు. టీజర్, ట్రైలర్‌లలో విశ్వక్‌సేన్ లేడీ గెటప్‌లో కనిపించడం, వివాదాలతో కొన్నాళ్లుగా తెలుగు ఆడియెన్స్‌లో ఆసక్తిని రేకెత్తించిన ఈ మూవీ ఎలా ఉంది? ఓవర్‌సీస్ ప్రీమియర్స్ టాక్ ఏంటంటే?
మిక్స్‌డ్ టాక్...
లైలాకు ఓవర్‌సీస్ ప్రీమియర్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ లభిస్తోంది. కొందరు సినిమా బాగుందని చెబుతోండగా....మరికొంత మంది నెటిజన్లు మాత్రం అర్థపర్థం లేకుండా మూవీ సాగుతుందని అంటున్నారు.
విశ్వక్‌సేన్ విశ్వరూపం...
విశ్వక్‌సేన్ లేడీ గెటప్‌లో అదరగొట్టాడని నెటిజన్లు చెబుతోన్నారు. ఈ క్యారెక్టర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్ హిలేరియస్‌గా నవ్విస్తాయని అంటున్నారు. ఈ లేడీ గెటప్ సన్నివేశాల్లో విశ్వక్‌సేన్ నటవిశ్వరూపం చూపించాడట. మరోసారి తన మాస్ ఆటిట్యూడ్, ఎనర్జీతో మెప్పించాడని ట్వీట్స్ చేస్తున్నారు. యాక్టింగ్ పరంగా విశ్వక్ కెరీర్‌లో డిఫరెంట్ మూవీగా లైలా నిలుస్తుందని కామెంట్స్ చేస్తోన్నారు.
కామెడీ వర్కవుట్...
బ్యూటీ పార్లర్ సెటప్ సీన్స్‌తో పాటు కామెడీ కొన్ని చోట్ల ఫుల్‌గా వర్కవుట్ అయ్యిందని అంటున్నారు. గబ్బర్‌సింగ్ ఫేమ్ అభిమన్యు కనిపించే సన్నివేశాల్లో కడుపుబ్బా నవ్విస్తాయని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. మెగాస్టార్ చిరంజీవి రిఫరెన్స్‌లను ఈ మూవీలో చాలానే వాడారట. ఆ సీన్స్ మెగా ఫ్యాన్స్‌ను మెప్పిస్తాయని చెబుతోన్నారు.
ఔట్‌డేటెడ్...
లైలా కథ ఔట్‌డేటెడ్ అని ఓ నెటిజన్ అన్నాడు.విలన్‌తో పాటు మిగిలిన క్యారెక్టర్స్‌ను డైరెక్టర్ సరిగ్గా రాసుకోలేకపోయాడని, కామెడీ కూడా సెన్స్‌లెస్‌గా ఉంటూ చిరాకు తెప్పిస్తోందని ట్వీట్ చేశాడు. తన యాక్టింగ్‌తో సినిమాను నిలబెట్టడానికి విశ్వక్‌సేన్ కష్టపడ్డాడని, కానీ కథ నుంచి డైరెక్షన్ వరకు ఎందులోనూ కొత్తదనం కనిపించకపోవడంతో అతడి శ్రమ వృథాగా మారిందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. సినిమాలో హై ఇచ్చే మూవ్‌మెంట్ ఫస్ట్ హాఫ్‌తో పాటు సెకండ్ హాఫ్‌లో ఒక్కటి కనిపించదని అంటున్నారు. లియోన్ జేమ్స్ పాటలు, బీజీఎమ్ మాత్రం బాగున్నాయని చెబుతున్నారు.
షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి లైలా మూవీని ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల, వెన్నెల కిషోర్, 30 ఇయర్స్ పృథ్వీ, బ్రహ్మాజీ ప్రధాన పాత్రలు పోషించారు.
సంబంధిత కథనం