Vishwak Sen: నటి వల్లే ఇన్‍స్టాగ్రామ్ డీయాక్టివేట్ చేసుకున్నారా? తన మార్క్ ఆన్సర్ ఇచ్చిన విశ్వక్‍సేన్-vishwak sen gave clarity about his instagram accout deativation at mechanic rocky glimpse launch event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwak Sen: నటి వల్లే ఇన్‍స్టాగ్రామ్ డీయాక్టివేట్ చేసుకున్నారా? తన మార్క్ ఆన్సర్ ఇచ్చిన విశ్వక్‍సేన్

Vishwak Sen: నటి వల్లే ఇన్‍స్టాగ్రామ్ డీయాక్టివేట్ చేసుకున్నారా? తన మార్క్ ఆన్సర్ ఇచ్చిన విశ్వక్‍సేన్

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 28, 2024 05:47 PM IST

Vishwak Sen: హీరో విశ్వక్ సేన్ ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్ డీయాక్టివేట్ చేయడం ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనిపై రూమర్లు వచ్చాయి. మెకానిక్ రాకీ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‍లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు విశ్వక్.

Vishwak Sen: నటి వల్లే ఇన్‍స్టాగ్రామ్ డియాక్టివేట్ చేసుకున్నారా? తన మార్క్ ఆన్సర్ ఇచ్చిన విశ్వక్‍సేన్
Vishwak Sen: నటి వల్లే ఇన్‍స్టాగ్రామ్ డియాక్టివేట్ చేసుకున్నారా? తన మార్క్ ఆన్సర్ ఇచ్చిన విశ్వక్‍సేన్

మాస్ కా దాస్, టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‍సేన్ ఈ ఏడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో డీసెంట్ హిట్స్ సాధించారు. మంచి జోష్‍లో ఉన్నారు. విశ్వక్ ప్రస్తుతం మెకానిక్ రాకీ సినిమా చేస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ తేజ ముల్లపూడి. మెకానిక్ రాకీ సినిమా గ్లింప్స్ నేడు (జూలై 28) రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్ కోసం లాంచ్ ఈవెంట్‍ను మూవీ టీమ్ నిర్వహించింది.

విశ్వక్‍సేన్ కొన్ని వారాల క్రితం తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్ డీయాక్టివేట్ చేసుకున్నారు. అయితే, ఓ నటి వల్లే తాను ఇలా చేశారని రూమర్లు విపరీతంగా వచ్చాయి. మరిన్ని పుకార్లు కూడా చక్కర్లు కొట్టాయి. ఈ విషయంపై నేటి ఈవెంట్‍లో విశ్వక్‍సేన్‍కు ప్రశ్న ఎదురైంది. దీనికి తన స్టైల్‍లో ఆన్సర్ చెప్పాడు మాస్ దా దాస్.

నేను వాళ్ల కోసం ఇన్‍స్టాలో ఉంటా

ఏ నటి వల్ల ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍ను డీయాక్టివేట్ చేశారని, సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్‍గా ఉండడం లేదని విశ్వక్‍సేన్‍ను ఓ వ్యక్తి అడిగారు. దీంతో విశ్వక్ స్పందించారు. “నువ్వు అమ్మాయి కోసం ఇన్‍స్టాగ్రామ్‍లో ఉంటావు. నేను వాళ్ల (అభిమానుల) కోసం ఇన్‍స్టాగ్రామ్‍లో ఉంటా. కొందరు వేరే పనులు చేసేందుకు ఇన్‍స్టాగ్రామ్‍లో ఉంటారు. నేను ఫ్యాన్స్ కోసమే ఉంటా” అని విశ్వక్‍సేన్ తెలిపారు.

నటి వల్లే ఇన్‍స్టాగ్రామ్ డీయాక్టివేట్ చేశానని ఎందుకు అనిపించిందని ఆ వ్యక్తిని విశ్వక్ ఎదురు ప్రశ్న వేశారు. గ్లామర్ హీరో కావడం వల్ల ఒత్తిడి వస్తుందేమోనని అనుకున్నానని ఆ వ్యక్తి.. అంటే ఆ ప్రెజర్ ఎవడైనా వద్దనుకుంటాడా అని విశ్వక్ పంచ్ వేశారు. హీరోయిన్ వల్లనో, ఒత్తిడి వల్లనో తాను ఇన్‍స్టా డీయాక్టివేట్ చేయలేదని స్పష్టంగా చెప్పేశారు.

కారణమిదే.. మళ్లీ వస్తా

తనకు 30 సంవత్సరాల వయస్సు వచ్చిందని తనకు అర్థమైందని, ఫోన్ పక్కన పెట్టి పని ఎక్కువ సేపు చేయాలనే ఉద్దేశంతోనే తాను ఇన్‍స్టాగ్రామ్ డీయాక్టివేట్ చేశానని విశ్వక్‍సేన్ చెప్పారు. సినిమా రిలీజ్ అయ్యే వారం ముందు మళ్లీ ఇన్‍స్టాగ్రామ్‍లోకి వస్తానని.. రిలీజ్ అయిన వారం తర్వాత మళ్లీ డీయాక్టివేట్ చేస్తానని విశ్వక్ అన్నారు.

మెకానిక్ రాకీ గురించి..

మెకానిక్ రాకీ సినిమా అక్టోబర్ 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా నటిస్తున్నారు. శ్రద్ద శ్రీనాథ్, సునీల్, నరేశ్, హైపర్ ఆది, హర్షవర్దన్, వైవా హర్ష కీలకపాత్రలు పోషిస్తున్నారు. జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ఆర్‌టీ ఎంటర్‌టై‍న్‍మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విశ్వక్‍సేన్.. ‘లైలా’ అనే సినిమా కూడా ఓకే చెప్పారు. ఈ మూవీలో లేడీ గెటప్‍లో కనిపించనున్నారు. ఈ చిత్రం నుంచి ఓ ప్రీ-లుక్ కూడా రివీల్ అయింది. లేడీ గెటప్‍లో విశ్వక్‍ ముఖాన్ని కాస్త చూపించారు మేకర్స్. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీతోనూ ఓ మూవీకి విశ్వక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. స్క్రిప్ట్ విన్న విశ్వక్ ఓకే చేశారని సమాచారం బయటికి వచ్చింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Whats_app_banner