Gangs Of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు టైమ్, వేదిక ఖరారు.. చీఫ్ గెస్ట్‌గా బాలయ్య
Gangs Of Godavari Pre-Release event: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు టైమ్, వెన్యూ ఫిక్స్ అయ్యాయి. ఈ ఈవెంట్‍కు గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హాజరుకానుండటంతో మరింత ఆసక్తి నెలకొని ఉంది.
Gangs Of Godavari Pre-Release: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై ట్రైలర్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. మాస్ కా దాస్ విశ్వక్‍సేన్.. తన ట్యాగ్‍లైన్‍కు తగ్గట్టే ఈ చిత్రంలో రస్టిక్ మాస్ యాక్షన్ క్యారెక్టర్ చేశారు. రెండు రోజుల కింద వచ్చిన ట్రైలర్ అదిరిపోయింది. గోదావరి జిల్లాల బ్యాక్‍డ్రాప్‍లో రూరల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు కృష్ణ చైతన్య. మే 31వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను మూవీ టీమ్ నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ టైమ్, వేదిక కూడా ఖరారయ్యాయి.
ప్రీ-రిలీజ్ ఈవెంట్ వివరాలు ఇవే
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ మే 28వ తేదీన నిర్వహించనున్నట్టు విశ్వక్‍సేన్ ఇటీవలే చెప్పారు. అయితే, టైమ్‍తో వేదికను నేడు (మే 27) ఖరారు చేసింది మూవీ టీమ్. రేపు (మే 28) సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్ కన్వెషన్‍లో ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
అతిథిగా బాలయ్య
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ అంటే తనకు ఎంత ఇష్టమో చాలాసార్లు చెప్పారు విశ్వక్‍సేన్. గతంలో దాస్ కా దమ్కీ ట్రైలర్ కూడా బాలయ్య రిలీజ్ చేశారు. ఇప్పుడు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు కూడా బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీంతో ఆయన ఏం మాట్లాడతారో అనే ఆసక్తి నెలకొంది.
ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు బాలకృష్ణ వస్తారని ఇటీవల ట్రైలర్ లాంచ్ అప్పుడే విశ్వక్‍సేన్ చెప్పారు. నేడు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది టీమ్. “మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ కోసం గాడ్ ఆఫ్ మాసెస్ ఎన్‍బీకే వస్తున్నారు. మే 28న సాయంత్రం 6 నుంచి ఎన్‍కన్వెన్షన్‍లో జరిగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు నందమూరి బాలకృష్ణ రానున్నారు” అని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ నేడు ట్వీట్ చేసింది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో లంక రత్నాకర్ అనే లోకల్ రాజకీయ నాయకుడి పాత్ర చేశారు విశ్వక్‍సేన్. ట్రైలర్లో విశ్వక్ గెటప్, గోదావరి యాసలో డైలాగ్ డెలివరీ, యాక్షన్ అదిరిపోయాయి. ఈ చిత్రంలో విశ్వక్ సరసన నేహా శెట్టి హీరోయిన్‍గా నటించారు. అంజలి, గోపరాజు రమణ, సాయికుమార్, హైపర్ ఆది, ఆయేషా ఖాన్ కీలకపాత్రలు పోషించారు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ మూవీ నుంచి వచ్చిన సుట్టంలా సూసి పాట చాలా పాపులర్ అయింది. ట్రైలర్లో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంటెన్స్‌గా సాగింది. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ బ్యానర్లపై నాగవంశీ, సాయిసౌజన్య ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. గతేడాదిలోనే ఈ మూవీ రిలీజ్ కావాల్సింది. అయితే, కొన్ని కారణాలతో ఆలస్యమవుతూ వస్తోంది. ఎట్టకేలకు మే 31వ తేదీన రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ రావటంతో విశ్వక్‍కు ఈ సినిమా భారీ ఓపెనింగ్ ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి.