Gaami OTT: ఓటీటీలో విశ్వ‌క్‌ సేన్ గామి సెన్సేషన్.. 72 గంటల్లో 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్‌-vishwak sen gaami gets 50 million streaming minutes views on zee5 ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gaami Ott: ఓటీటీలో విశ్వ‌క్‌ సేన్ గామి సెన్సేషన్.. 72 గంటల్లో 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్‌

Gaami OTT: ఓటీటీలో విశ్వ‌క్‌ సేన్ గామి సెన్సేషన్.. 72 గంటల్లో 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 16, 2024 01:27 PM IST

Gaami OTT:విశ్వక్ సేన్ గామి ఓటీటీలో దుమ్మురేపుతోంది. 72 గంట‌ల్లోనే యాభై మిలియ‌న్ల స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్‌ను సొంతం చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది.

విశ్వక్ సేన్ గామి ఓటీటీ
విశ్వక్ సేన్ గామి ఓటీటీ

Gaami OTT: విశ్వ‌క్‌సేన్ గామి మూవీ ఓటీటీలో రికార్డ్ వ్యూస్‌తో అద‌ర‌గొడుతోంది. నేష‌న‌ల్ వైడ్‌గా ట్రెండింగ్‌లో ఉన్న ఈ మూవీ 72 గంట‌ల్లోనే యాభై మిలియ‌న్ల స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్‌ను సొంతం చేసుకున్న‌ది. అతి త‌క్కువ టైమ్‌లో ఎక్కువ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్‌ను ద‌క్కించుకున్న మూవీగా నిలిచింది.

అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌...

గామి సినిమాలో విశ్వ‌క్ సేన్ అఘోరా పాత్ర‌లో న‌టించాడు. అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీతో విధ్యాధ‌ర్ కాగిత ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మార్చి 8న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. విశ్వ‌క్‌సేన్ యాక్టింగ్‌తో పాటు క‌థ, క‌థ‌నాలు, టెక్నిక‌ల్ వాల్యూస్ అద్భుత‌మంటూ ప్రేక్ష‌క‌కుల ప్ర‌శంస‌ల్ని అందుకున్న‌ది.

ఆరేళ్ల పాటు షూటింగ్‌...

గామి మూవీ షూటింగ్ ఆరేళ్ల పాటు సాగ‌డం గ‌మ‌నార్హం. 2018లో ఈ మూవీని అనౌన్స్ చేశారు. 2024లో ఈ మూవీ రిలీజైంది. ఈ ఏప్రిల్ 12న జీ5 ద్వారా గామి మూవీ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

గామి క‌థ ఇదే...

మూడు క‌థ‌ల‌తో ద‌ర్శ‌కుడు విధ్యాధ‌ర్ కాగిత గామి మూవీని తెర‌కెక్కించాడు. శంక‌ర్ (విశ్వ‌క్‌సేన్‌) ఓ అఘోరా. అత‌డిని ఎవ‌రైనా తాకిన వెంట‌నేశ‌రీరంలో ఊహించ‌ని మార్పులు చోటుచేసుకుంటాయి. శంక‌ర్‌తో పాటుఅత‌డిని తాకిన వారికి ప్రాణాల‌కు ముప్పు ఏర్ప‌డుతుంటుంది. త్రివేణి ప‌ర్వ‌తంపై 36 ఏళ్ల‌కు ఒక్క‌సారి పూసే మాలిప‌త్రి అనే ఔష‌ద మొక్క మాత్ర‌మే ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం అని శంక‌ర్ తెలుసుకుంటాడు. ఈ మొక్క కోసం హిమాల‌యాల‌కు ప్ర‌యాణం మొద‌లుపెడ‌తాడు.

దుర్గ (అభిన‌య‌) ఓ దేవ‌దాసి. త‌న కూతురు ఉమాను(హారిక‌) కూడా దేవ‌దాసి వృత్తిలోకి తీసుకురావాల‌ని అనుకుంటుంది. కానీ ఉమా దేవ‌దాసి వృత్తికి సెట్ కాద‌ని తేలుతుంది. ఇండియా, చైనా బోర్డ‌ర్‌లోని ఓ మెడిక‌ల్ రీసెర్చ్ సెంట‌ర్‌లో ఓ యువ‌కుడు (సీ333) బందీగా ఉంటాడు.

ప్ర‌యోగాల పేరుతో అత‌డిని చిత్ర‌హింస‌ల‌కు గురిచేస్తుంటారు.శంక‌ర్ కు ఉమాతో పాటు పాటు రీసెర్చ్ సెంట‌ర్‌లో బందీగా ఉన్న సంబంధం ఏమిటి? హిమాల‌యాల‌కు చేరుకునే క్ర‌మంలో శంక‌ర్ ఎలాంటి అడ్డంకుల‌ను ఎదుర్కొన్నాడు? శంక‌ర్ వెంట హిమాల‌యాల‌కు బ‌య‌టుదేరిన జాహ్న‌వి ఎవ‌రు? అన్న‌దే గామి మూవీ(Gaami Review) క‌థ‌. ఈ మూడు క‌థ‌ల‌ను క‌లుపుతూ డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో సినిమాను తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు.

ఐదు కోట్ల బ‌డ్జెట్‌...20 కోట్ల క‌లెక్ష‌న్స్‌...

గామి సినిమాలో చాందిని చౌద‌రి, అభిన‌య, అబ్ధుల్ స‌మ‌ద్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాకు స్వీక‌ర్ అగ‌స్తి మ్యూజిక్ అందించాడు. దాదాపు ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో క్రౌడ్ ఫండింగ్ విధానంలో తెర‌కెక్కిన ఈ మూవీ ఇర‌వై కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. గామి తో స‌క్సెస్ అందుకోన్న విశ్వ‌క్‌సేన్ ప్ర‌స్తుతం మూడు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి మూవీ మే 17న రిలీజ్ కాబోతుండ‌గా... మెకానిక్ రాఖీ షూటింగ్‌ను జ‌రుపుకుంటోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి మూవీకి చైత‌న్య కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోండ‌గా నేహాశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

IPL_Entry_Point

టాపిక్