Vishwak Sen: ప్రొడ్యూసర్ కూతురితో విశ్వక్‌సేన్ ప్రేమాయణం -కల్కి డైరెక్టర్ బయోపిక్ -ఫంకీ మూవీపై నిర్మాత కామెంట్స్
Vishwak Sen: విశ్వక్‌సేన్ ఫంకీ మూవీ కథపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ సినిమా కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ బయోపిక్‌లా ఉంటుందని అన్నాడు. ఇందులో విశ్వక్‌సేన్ సినిమా డైరెక్టర్ క్యారెక్టర్‌లో కనిపిస్తే.. నిర్మాత కూతురిగా హీరోయిన్ నటిస్తుందని అన్నాడు.
విశ్వక్‌సేన్ హిట్టు అనే మాట విని చాలా కాలమైంది. అతడి గత సినిమాలు లైలా డిజాస్టర్‌గా నిలవగా...మెకానిక్ రాకీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.
జాతిరత్నాలు ఫేమ్...
లైలా తర్వాత ఫంకీ పేరుతో రొమాంటిక్ లవ్ డ్రామా మూవీ చేస్తోన్నాడు విశ్వక్‌సేన్. ఈ సినిమాకు జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అఫీషియల్‌గా లాంఛ్ అయ్యింది.
నాగ్ అశ్విన్ బయోపిక్...
ఫంకీ మూవీపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఫంకీ మూవీ కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ బయోపిక్‌లా ఉంటుందని అన్నారు. ఈ సినిమాలో విశ్వక్‌సేన్ ఓ సినిమా డైరెక్టర్‌గా కనిపిస్తాడని నిర్మాత అన్నాడు. “ఇందులో హీరోయిన్ ప్రొడ్యూసర్ కూతురిగా కనిపిస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది అన్నది ఫన్నీగా ఉంటుంది. కథ చాలా బాగుంటుంది. అనుదీప్ అనుకున్నది అనుకున్నట్లుగా తీస్తే గీత గోవిందంలా మరో పెద్ద బ్లాక్‌బస్టర్ మూవీ అవుతుంది. హీరోయిన్ డామినేటేడ్ స్టోరీతో ఫంకీ మూవీ సాగుతుంది. ఇప్పటివరకు చేసిన షూటింగ్‌లో ఫన్ బాగా వచ్చింది” అని సూర్యదేవర నాగవంశీ చెప్పాడు.
ఫంకీ మూవీలో డ్రాగన్ ఫేమ్ కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తోన్నాడు.
లైలా డిజాస్టర్...
లైలా మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంలో విశ్వక్‌సేన్ అభిమానులకు క్షమాపణలుచెప్పాడు. ఈ సినిమాలో విశ్వక్‌సేన్ లేడీ గెటప్‌పై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువయ్యాయని, బూతు సినిమాలా ఉందంటూ నెటిజన్లు, క్రిటిక్స్ దారుణంగా సినిమాపై విమర్శలు గుప్పించారు.
అసభ్యత లేకుండా...
ఈ విమర్శలపై విశ్వక్‌సేన్ రియాక్ట్ అవుతూ ఓ ప్రకటనను రిలీజ్ చేశారు. మరోసారి లైలా లాంటి సినిమా చేయనని పేర్కొన్నాడు. ఇకపై క్లాస్ లేదా మాస్ ఏ సినిమా అయినా సరే అసభ్యత లేకుండా చూసుకుంటానని అన్నాడు. నేను ఒక చెడు సినిమా తీస్తే నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకు ఉంది అంటూ ఈ లేఖలో అభిమానులను ఉద్దేశించి విశ్వక్ సేన్ పేర్కొన్నాడు.
మూడేళ్లు గ్యాప్...
సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటున్నాడు విశ్వక్‌సేన్. ఫంకీతో పాటు మరో మూడు సినిమాలు చేస్తోన్నాడు సమాచారం. మరోవైపు జాతిరత్నాలు సినిమాతో డైరెక్టర్‌గా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు అనుదీప్. ఈ సినిమా తర్వాత శివకార్తికేయన్‌తో ప్రిన్స్ మూవీ చేశాడు. ప్రిన్స్ డిజాస్టర్‌గా నిలవడంతో మూడేళ్ల గ్యాప్ తర్వాత ఫంకీ సినిమా చేస్తోన్నాడు.
సంబంధిత కథనం