Family Dhamaka on Aha: ఆహాలో విశ్వక్‌సేన్ ఫ్యామిలీ ధమాకా.. స్ట్రీమింగ్ డేట్ రివీల్
Family Dhamaka on Aha: ఆహాలో విశ్వక్‌సేన్ ఫ్యామిలీ ధమాకా షో ప్రారంభం కాబోతోంది. ఈ షో స్ట్రీమింగ్ డేట్ ను తాజాగా సోమవారం (ఆగస్ట్ 28) ఆహా ఓటీటీ రివీల్ చేసింది.
Family Dhamaka on Aha: ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా మరో ఇంట్రెస్టింగ్ షోతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ షో పేరు ఫ్యామిలీ ధమాకా. మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో స్ట్రీమింగ్ తేదీని సోమవారం (ఆగస్ట్ 28) ఆహా ఓటీటీ రివీల్ చేసింది. ఈ సందర్భంగా ఓ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈ షో సెప్టెంబర్ 8 నుంచి స్ట్రీమ్ అవనుంది.
ఫ్యామిలీ ధమాకా షో ప్రారంభం కానున్నట్లు కొన్ని రోజుల కిందట ఓ పోస్టర్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. విశ్వక్ సేన్ హోస్ట్ గా వస్తున్నాడన్న వార్తతో దీనికి విపరీతమైన బజ్ క్రియేటైంది. ఈ షో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఆహా ఓటీటీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఫ్యామిలీ ధమాకా సెప్టెంబర్ 8 నుంచి ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు స్ట్రీమ్ అవుతుంది.
15 ఎపిసోడ్లపాటు ఈ షో సాగనుంది. తాజా ప్రోమోలో విశ్వక్ తనదైన స్టైల్లో షోకి వచ్చిన ఫ్యామిలీస్ ను ప్రశ్నలు అడగటం చూడొచ్చు. "వెల్‌కమ్ టు మోస్ట్ ఎంటర్‌టైనింగ్ ఫ్యామిలీ షో ఎవర్.. ఫ్యామిలీ ధమాకా.. ఇది దాస్ కా ఇలాఖా" అంటూ ఈ షో గురించి పరిచయం చేస్తూ ఈ ప్రోమోలో ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్. ఏడు సమాధానాలు ఉన్న ప్రశ్నలు అడగడం ఈ షో ప్రత్యకతగా కనిపిస్తోంది.
ఈ ప్రోమోలో కొన్ని ఫ్యామిలీస్ రావడం, వాళ్లను తనదైన స్టైల్లో ఫన్నీగా కొన్ని ప్రశ్నలు అడగటం ద్వారా విశ్వక్ సరదాగా షోని నడిపించేశాడు. తొలిసారి ఇలాంటి షోకి హోస్ట్ చేస్తున్నా.. విశ్వక్ అవలీలగా ఈ కొత్త రోల్ పోషించినట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఈ షోపై విశ్వక్ తన ఎక్సైట్‌మెంట్ చూపించాడు.
"ఫ్యామిలీ ధమాకాలో భాగం కావడం, ఆహా ఓటీటీలో హోస్ట్ గా తొలి షో చేయబోతుండటం నాలో సంతోషాన్ని నింపుతోంది. సవాళ్లను ఎదుర్కోవడానికి, నవ్వుల్లో ముంచెత్తడానికి వచ్చే కుటుంబాలతో ఈ షో ప్రేక్షకులకు మంచి మజా అందిస్తుంది. ఈ కొత్త ప్రయాణంలో ప్రేక్షకులు నాతో చేరడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను" అని విశ్వక్ అన్నాడు.