Dhamki Hindi Release Date: ఒకేరోజు ఓటీటీలో, థియేటర్లలో రిలీజైన విశ్వక్‌సేన్ మూవీ
Dhamki Hindi Release Date: విశ్వక్‌సేన్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీ శుక్రవారం ఓటీటీతో పాటు థియేటర్‌లో రిలీజైంది. అదేలా అంటే...
Dhamki Hindi Release Date: దాస్ కా ధమ్కీ మూవీ ఒకేరోజు ఇటు ఓటీటీతో పాటు అటు థియేటర్లలో రిలీజైంది. విశ్వక్‌సేన్ (Vishwak Sen) హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా తెలుగు వెర్షన్ శుక్రవారం ఆహా ఓటీటీలో (Aha OTT) రిలీజైంది. మరోవైపు హిందీ వెర్షన్ దాస్ కా ధమ్కీ పేరుతో థియేటర్ల ద్వారా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
ఒకే పోలికలతో ఉన్న ఓ నిజాయితీపరుడైన హోటల్ వెయిటర్‌తో పాటు డబ్బుపై వ్యామోహం కలిగిన ఓ డాక్టర్ కథతో విశ్వక్‌సేన్ ధమ్కీ సినిమాను తెరకెక్కించాడు. మార్చి 22న థియేటర్లలో రిలీజైన తెలుగు వెర్షన్ మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది. రెండు క్యారెక్టర్స్‌లో విశ్వక్‌సేన్ చూపించన వేరియేషన్ బాగున్నా కథలో కొత్తదనం లేకపోవడంతో యావరేజ్ గా నిలిచింది. దాంతో థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
శుక్రవారం ఆహా ఓటీటీలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. మరోవైపు పాన్ ఇండియన్ సినిమాగా విశ్వక్‌సేన్ ధమ్కీ సినిమాను రూపొందించారు. మార్చి 22న తెలుగుతో పాటు హిందీలో ఒకేసారి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల ఇరవై రోజులు ఆలస్యంగా శుక్రవారం హిందీ వెర్షన్ థియేటర్లలో విడుదలైంది. ఒకేరోజు ధమ్కీ తెలుగు వెర్షన్ ఓటీటీలో హిందీ వెర్షన్ థియేటర్‌లో రిలీజ్ కావడం చర్చనీయాంశంగా మారింది.
దాస్ కా ధమ్కీ సినిమాలో నివేథా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. హైపర్ ఆది, రావురమేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్లు విశ్వక్‌సేన్ ప్రకటించాడు.