నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే మోస్ట్ వయోలెంట్ చిత్రంగా వస్తోంది హిట్ 3. మే 1న గ్రాండ్ రిలీజ్ కానున్న సందర్భంగా ఏప్రిల్ 27న హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ స్పీచ్ ఇచ్చాడు.
హీరో విశ్వక్సేన్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్తే. ముందుగా పహల్గామ్ బాధితులకు నా కండోలెన్సెస్. హిట్ నాది, శేష్‌ది, నాని అన్నది, హిట్ మాది, మన అందరిదీ. ఇదే స్టేజ్ మీద నాని అన్న ఫలక్‌నామ దాస్ ఫంక్షన్‌కి వచ్చినప్పుడు నేను హీరోగా హిట్ అనౌన్స్ చేశారు. ఇదే వేదిక మీద హిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రాజమౌళి గారు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. రాజమౌళి గారి సపోర్టుకి థాంక్యూ సో మచ్" అని అన్నాడు.
"హిట్ నుంచి మరెన్నో సినిమాలు వస్తాయి. నాని అన్న యాక్టర్‌గా హ్యాట్రిక్ కొట్టారు నిర్మాతగా హ్యాట్రి కొట్టారు. నిర్మాతగా యాక్టర్‌గా హిట్ 3తో సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ కాబోతుంది. ప్రశాంతి గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రొడ్యూసర్" అని విశ్వక్ సేన్ తెలిపాడు.
"మే 1న ఈ సినిమా చాలా వయోలెంట్‌గా ఉండబోతుంది. ఇది చాలా న్యూ ఏజ్ ఫిలిం. హిట్ నా మనసుకి చాలా దగ్గరైన సినిమా. నా కెరీర్ గ్రోత్‌లో చాలా క్రూషియల్ ఫిల్మ్. ఎంత కాదనుకున్న నా బిడ్డ కూడా ఇది. హిట్ 3 వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్" అని విశ్వక్ సేన్ తన స్పీచ్ ముగించాడు.
అయితే స్పీచ్‌కు ముందు విశ్వక్ సేన్ స్టేజీ ఎక్కగానే యాంకర్ సుమ ఇంట్రాగేషన్ చేసింది. "నన్ను ఇంట్రాగేషన్ చేస్తారా, ఆఫీసర్‌ను, నేను కూడా ఆఫీసర్‌నే తెలుసా" అని విశ్వక్ సేన్ అన్నాడు. "ఇప్పుడు మీరు డ్యూటీలో లేరు కదా. ఇప్పుడు ఆఫీసర్ అర్జున్ సర్కార్ కదా" అని యాంకర్ సుమ అంటే.. "మా తెలంగాణ బ్రాంచ్‌లో నేనే కదా" అని విశ్వక్ సేన్ బదులిచ్చాడు.
హో.. అని ఆశ్చర్యపోయిన యాంకర్ సుమ "పద్ధతిగా చేస్తాం బాబు కూర్చోండి" అని చెప్పింది. దాంతో విశ్వక్ సేన్ కుర్చీలో కూర్చున్నాడు. "మీలో ఉన్నది.. అర్జున్ సర్కార్, విక్రమ్‌లో లేని ఓ క్వాలిటీ ఏంటనుకుంటున్నారు పద్ధతిగా" అని సుమ కనకాల అడిగింది. "ఇది ఫిట్టింగ్ ఇది. ఇద్దరిలో ఉండేది ప్రశాంతత" అని విశ్వక్ సేన్ అన్నాడు. "మరి మీలో" అని యాంకర్ సుమ అడిగింది.
"కామ్‌నెస్. నాకు ఇప్పుడిప్పుడే వస్తుంది. మొన్ననే 30 వచ్చినయ్. ఇప్పుడు మెల్లగా వస్తది. మనోడి (అడవి శేష్) లెక్క కూల్‌గా, నాని అన్న లెక్క కామ్‌గా, ఆ ప్రశాంతత.. నేను అటు ఇటు పరుగెత్తుకుంటూ ఉంటాను కదా. మొన్ననే మార్చిలో 30 వచ్చినయ్ కదా నాకు తెలిసి వాళ్లలా చేంజ్ చేసుకుంటా" అని విశ్వక్ సేన్ బదులిచ్చాడు.
"ఓకే ఆఫీసర్ లాస్ట్ క్వశ్చన్.. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు" అని సుమ కనకాల అడిగింది. సంబంధాలు చూడమని మా అమ్మకి మొన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చా. కాబట్టి, ఎప్పుడు దొరికితే అప్పుడు" అని విశ్వక్ సేన్ తన పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు.
సంబంధిత కథనం