Vishwak Sen: లైలాకు రెడీ అవ్వడానికి రెండేసి గంటలు పట్టింది.. అమ్మాయిలకు హ్యాట్సాఫ్ చెప్పాలి.. విశ్వక్ సేన్ కామెంట్స్-vishwak sen comments on girls and laila role make up in icchukundam baby song release event akanksha sharma ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwak Sen: లైలాకు రెడీ అవ్వడానికి రెండేసి గంటలు పట్టింది.. అమ్మాయిలకు హ్యాట్సాఫ్ చెప్పాలి.. విశ్వక్ సేన్ కామెంట్స్

Vishwak Sen: లైలాకు రెడీ అవ్వడానికి రెండేసి గంటలు పట్టింది.. అమ్మాయిలకు హ్యాట్సాఫ్ చెప్పాలి.. విశ్వక్ సేన్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Jan 24, 2025 11:13 AM IST

Vishwak Sen About Girls And Makeup In Laila Song Launch: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లైలా. తాజాగా లైలా సినిమా నుంచి ఇచ్చుకుందాం బేబీ అనే బీచ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

లైలాకు రెడీ అవ్వడానికి రెండేసి గంటలు పట్టింది.. అమ్మాయిలకు హ్యాట్సాఫ్ చెప్పాలి.. విశ్వక్ సేన్ కామెంట్స్
లైలాకు రెడీ అవ్వడానికి రెండేసి గంటలు పట్టింది.. అమ్మాయిలకు హ్యాట్సాఫ్ చెప్పాలి.. విశ్వక్ సేన్ కామెంట్స్

Vishwak Sen About Girls In Laila Song Launch: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అప్ కమింగ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమా 'లైలా'. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. లైలా చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. తాజాగా లైలా మూవీ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ ఇచ్చుకుందాం బేబీ పాటను విడుదల చేశారు.

ఇచ్చుకుందాం బేబీ సింగర్స్

లియోన్ జేమ్స్ స్వరపరిచిన ఈ ట్రాక్ అప్ బీట్ మోడ్రన్ స్టయిల్ బ్లెండ్‌తో ఆకట్టుకుంది. ఇచ్చుకుందాం బేబీ పాటని ఆదిత్య ఆర్కే , ఎంఎం మానసి ఎనర్జిటిక్ వోకల్స్‌తో ఆలపించారు. పూర్ణాచారి అందించిన సాహిత్యం లీడ్ పెయిర్ కెమిస్ట్రీని ప్రెజెంట్ చేసింది. యూత్‌ఫుల్ ఎనర్జీతో సాంగ్ వైరల్‌గా మారింది.

అదనపు గ్లామర్ తీసుకొస్తుంది

విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మల కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ బీచ్ బ్యాక్ డ్రాప్ పాట వైబ్‌ను మరింతగా పెంచుతోంది. ఆకాంక్ష శర్మ తన చార్మ్‌తో సన్నివేశానికి అదనపు గ్లామర్‌ను తెస్తుంది. విశ్వక్ సేన్ చరిస్మాటిక్‌గా కనిపించాడు. ఫుట్ ట్యాపింగ్ నెంబర్ ఇచ్చుకుందాం బేబీ మ్యూజిక్, విజువల్స్ రెండింటిలోనూ కట్టిపడేసింది. ఫస్ట్ సింగిల్ సోను మోడల్ లాగానే, ఇచ్చుకుందాం బేబీ కూడా సూపర్ హిట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

ఇలాంటి క్యారెక్టర్ చేయాలని

ఇక సాంగ్ లాంచింగ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్తే. యాక్టర్‌గా నా విష్‌లో ఉన్న సినిమా 'లైలా'. ఇలాంటి కథ క్యారెక్టర్ చేయాలని ఎప్పటినుంచో ఉండే. డైరెక్టర్ రామ్ నారాయణ్ కథ చెప్పగానే నేను చేస్తానని చెప్పాను. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన సాహు అన్నకి థాంక్ యూ" అని అన్నాడు.

అబ్బాయిలకు లైలా, అమ్మాయిలకు సోను

"ఫిబ్రవరి 14న వస్తున్నాం. వాలెంటైన్స్ డేకి సింగిల్స్ తమకు ఎవరూ లేరని బాధపడుతుంటారు. ఈ వాలెంటైన్స్ డే కి మీకు లైలా ఉంది. అమ్మాయిలు సింగిల్ అని అనుకుంటే మీకు సోను మోడల్ ఉన్నాడు (నవ్వుతూ). నా కెరీర్‌లో యాక్షన్ టచ్‌తో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ ఇదే. ఇది న్యూ ఏజ్ ఫిలిం. మీరంతా ఎంజాయ్ చేస్తారు. ఫిబ్రవరి 14కి కలుద్దాం. అప్పటివరకూ ఇచ్చుకుందాం బేబీని ఎంజాయ్ చేయండి" అని విశ్వక్ సేన్ తెలిపాడు.

రెండేసి గంటలు పట్టేది

"ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఫిల్మ్. చాలా క్లీన్ ఫిల్మ్ తీశాం. లైలా మీకు నచ్చుతుంది. లైలా కోసం రెడీ అవ్వడానికి రెండేసి గంటలు పట్టేది. నిజంగా అమ్మాయిలకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఫిబ్రవరి 1న రాయలసీయ మాస్ సాంగ్ ఓహో రత్తమ్మ రిలీజ్ చేస్తున్నాం. అది కూడా అదిరిపోయింది" అని విశ్వక్ సేన్ తన స్పీచ్ ముగించాడు.

Whats_app_banner

సంబంధిత కథనం