Action Thriller OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Action Thriller OTT: విశ్వక్‌సేన్ మెకానిక్ రాకీ మూవీ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో నాలుగు భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించాడు.
Action Thriller OTT: విశ్వక్‌సేన్ మెకానిక్ రాకీ మూవీ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా శుక్రవారం నుంచి ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజైంది. నవంబర్ 22న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సరిగ్గా ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రావడం ఆసక్తికరంగా మారింది.
మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్...
మెకానిక్ రాకీ మూవీలో విశ్వక్‌సేన్‌కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. సర్‌ప్రైజింగ్ రోల్‌లో శ్రద్ధా శ్రీనాథ్ కనిపించింది. ఈ మూవీతో రవితేజ మూళ్లపూడి డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో నరేష్, సునీల్, హైపర్ ఆది కీలక పాత్రల్లో కనిపించారు. ఎస్ఆర్‌టీ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.
రాకీ లైఫ్‌లోకి ఇద్దరు అమ్మాయిలు...
బీటెక్‌ను అనుకోకుండా మధ్యలోనే ఆపేస్తాడు రాకేష్ అలియాస్ రాకీ (విశ్వక్‌సేన్) . మలక్‌పేటలో తండ్రి (నరేష్) నిర్వహించే ఆర్‌కే గ్యారేజెస్‌లో మెకానిక్‌గా పనిచేస్తూనే డ్రైవింగ్ పాఠాలు నేర్పుతుంటాడు. రాకీ గ్యారేజీ స్థలాన్ని రంకిరెడ్డి (సునీల్) అనే రౌడీ ఆక్రమించుకోవాలని చూస్తాడు.
రంకిరెడ్డి నుంచి తన స్థలాన్ని కాపాడుకోవడానికి రాకీకి యాభై లక్షలు కావాల్సివస్తుంది. అదే టైమ్‌లో రాకీ లైఫ్‌లోకి మాయ (శ్రద్ధా శ్రీనాథ్) తో పాటు కాలేజీ రోజుల్లో అతడిని ప్రేమించినప్రియ (మీనాక్షి చౌదరి) ఎంట్రీ ఇస్తారు. వారిద్దరి రాకతో రాకీ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది?
ప్రియకు రాకీ దూరమవ్వడానికి కారణం ఏమిటి? రాకీకి దక్కాల్సిన ఓ ఇన్సూరెన్స్ సొమ్ములో నామినీగా మరొకరు పేరు ఎందుకు ఉంది? ఆ పాలసీ ఎవరిది? రాకీ జీవితంలోకి మాయ ఎందుకొచ్చింది?రంకిరెడ్డి నుంచి తన గ్యారేజీని రాకీ కాపాడుకున్నాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
మూడు సినిమాలు...
ఈ ఏడాది మెకానిక్ రాకీతో పాటు గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు చేశాడు విశ్వక్‌సేన్. గామి బాక్సాఫీస్ వద్ద చక్కటి వసూళ్లను రాబట్టగా...గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ యావరేజ్‌గా నిలిచాయి.
ప్రస్తుతం లైలా, ఫంకీ సినిమాలు చేస్తోన్నాడు విశ్వక్ సేన్. వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. బాలకృష్ణ డాకు మహారాజ్‌లో విశ్వక్‌సేన్ గెస్ట్ రోల్‌లో నటించినట్లు ప్రచారం జరుగుతోంది.