Bigg Boss Nominations: ఈ వారం నామినేషన్లు విష్ణుప్రియ చేతుల్లో.. ఎంత దమ్ముందో చూపిస్తా: పృథ్వితో గౌతమ్ గొడవ (వీడియో)
Bigg Boss 8 Telugu Nominations: ఈ వారం నామినేషన్లలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు బిగ్‍బాస్. ఈ తంతును విష్ణుప్రియ చేతుల్లో పెట్టేశారు. యష్మి, పృథ్వితో గౌతమ్ కృష్ణకు మరోసారి గొడవ అయింది. ఈ ప్రోమో వచ్చేసింది.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో తొమ్మిదో వారం నామినేషన్లకు వేళయింది. ఎనిమిదో వారం మహబూబ్ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్ల ప్రక్రియ నేడు (అక్టోబర్ 28) సోమవారం ఉండనుంది. అయితే, ఈసారి నామినేషన్ల తంతులో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు బిగ్‍బాస్. విష్ణుప్రియపై భారం వేశారు. దీనికి సంబంధించిన నేటి ప్రోమో వచ్చింది.
విష్ణుప్రియకు నామినేషన్ల బాధ్యత
హౌస్‍లో ఇప్పటి నుంచి వారాలు గడిచే కొద్ది ఆటన కఠినంతరం అవుతుందని బిగ్‍బాస్ చెప్పడంతో ప్రోమో మొదలైంది. నేటి నామినేషన్ల అత్యంత ముఖ్యమని చెప్పారు. ఇంట్లో ప్రయాణాన్ని కొనసాగించేందుకు అర్హత లేని ఐదుగురిని నామినేట్ చేయాలని మెగాచీఫ్ విష్ణుప్రియకు బిగ్‍బాస్ తెలిపారు. నామినేట్ చేసిన వారిని జైలులో పెట్టి తాళం వేయాలన్నారు. సాధారణంగా కారణాలు చెప్పుకొని కంటెస్టెంట్లు ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారు. అయితే, ఈ వారం నామినేషన్లు చేసే బాధ్యతను విష్ణుప్రియకు ఇచ్చి బిగ్‍బాస్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
వాళ్లను నామినేట్ చేయవు
బిగ్‍బాస్ చెప్పిన రూల్‍తో విష్ణుప్రియ చప్పట్లు కొట్టారు. ముందుగా గౌతమ్ కృష్ణను ఆమె నామినేట్ చేశారు. చీఫ్‍గా ఉన్నప్పుడు గౌతమ్ తీసుకున్న నిర్ణయాన్ని కారణంగా చూపారు విష్ణు. దీంతో ప్రతీ వారం ఇదే పాయింట్‍పై నామినేట్ చేస్తారా అని గౌతమ్ అడిగారు. తనకు ఇప్పుడే ఛాన్స్ వచ్చిందని విష్ణు తెలిపారు.
పృథ్విరాజ్‍ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ గౌతమ్ మాట్లాడారు. “నా కంటే అన్‍బ్యాలెన్స్డ్ వ్యక్తి లేడు, నా కంటే తక్కువ పని చేసే వాడు, నా కంటే ఎక్కువ పాయింట్స్ ఉన్న వాడు ఉన్నా నువ్వు వాళ్లను నామినేట్ చేయవు” అని గౌతమ్ అన్నారు. పృథ్వి గురించే అంటున్నాడని అర్థం చేసుకున్న విష్ణు అభ్యంతరం తెలిపారు. ఎందుకు ఒకే వ్యక్తి గురించి అంటున్నావని విష్ణుప్రియ అన్నారు.
అలా పిలవొద్దు: గౌతమ్‍పై యష్మి ఫైర్
ఈ క్రమంలో యష్మి గౌడ మధ్యలో కల్పించుకున్నారు. తన ఆలోచనలను ఇక్కడ పెట్టొద్దు అని గౌతమ్‍ను యష్మి వారించారు. అలా అయితే తాను కూడా అలాగే మాట్లాడతానని అన్నారు. దీంతో ‘ఆగు అక్క’ అని గౌతమ్ అన్నారు. దీంతో తనను అక్క అని పిలవొద్దని యష్మి అరిచారు. ఓసారి క్రష్, ఓసారి అక్క అని తనను పిలవొద్దని అన్నారు.
ఆ తర్వాత విష్ణుతో టేస్టీ తేజ, ప్రేరణ వాగ్వాదం చేసుకున్నారు. “నేను ఎవడిని నీ పాయింట్ ఆఫ్ వ్యూ పరిగణనలోకి తీసుకునేందుకు” అని తేజ అన్నారు. తాను పృథ్వి ఇప్పుడు బాగానే ఉన్నామని ప్రేరణ చెప్పారు. నయని పావని కూడా ఏదో విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. “దేనికి భయపడాల్సిన పని లేదు. ఏమీ లేదు. ఏది ఉంటే అది ఖుల్లా మాట్లాడేసుకుందాం” అని తేజ అన్నారు.
ఏం దమ్ముందో చూపిస్తా
నామినేట్ అయి గౌతమ్ జైలులోకి వెళ్లాక పృథ్వి నవ్వారు. “మస్తు నవ్వొస్తుంది లే కాకా నీకు” అని పృథ్వితో గౌతమ్ అన్నారు. దీంతో ఓ వ్యక్తి అంటున్నావే కానీ, నా పేరు చెప్పేందుకు నీకు దమ్ములేదని పృథ్వి వెటకారంగా మాట్లాడారు. దీంతో “దగ్గరికి రా.. ఎంత దమ్ము ఉందో చూపిస్తా. నీ పేరు చెప్పానా. ఎందుకు లేస్తున్నావ్” అని గౌతమ్ ఫైర్ అయ్యారు. జైలు తలుపు తీసేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రోమో ముగిసింది. నామినేషన్ల తంతు నేటి ఎపిసోడ్‍లో ఉండనుంది.
నామినేషన్లలో వీరే
ఈ తొమ్మిదో వారంలో గౌతమ్ కృష్ణ, నయని పావని, హరితేజ, టేస్టీ తేజ, యష్మి గౌడ ఉండనున్నారని లీకులు ద్వారా వెల్లడైంది. నేటి ఎపిసోడ్‍లో క్లారిటీ రానుంది.
టాపిక్