Mark Antony Trp Rating: విశాల్ వంద కోట్ల మూవీకి తెలుగులో 0.99 టీఆర్‌పీ రేటింగ్
Mark Antony Trp Rating: థియేటర్లలో వంద కోట్ల వసూళ్లను రాబట్టిన విశాల్ మార్క్ ఆంటోనీ మూవీకి బుల్లితెరపై షాకింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా 0.99 టీఆర్‌పీ రేటింగ్‌ను మాత్రమే దక్కించుకున్నది.
Mark Antony Trp Rating: విశాల్ హీరోగా నటించిన మార్క్ ఆంటోనీ మూవీ వంద కోట్ల వసూళ్లను రాబట్టింది. విశాల్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డ్ నెలకొల్పింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ మార్క్ ఆంటోనీ మూవీని తెరకెక్కించాడు. విశాల్‌తో పాటు ఎస్‌జే సూర్య, రీతూవర్మ, సునీల్ కీలక పాత్రల్లో నటించాడు.
జీ తెలుగులో టెలికాస్ట్...
మార్క్ ఆంటోనీ వరల్ట్ టెలివిజన్ తెలుగు ప్రీమియర్ ఇటీవల జీతెలుగులో టెలికాస్ట్ అయ్యింది. థియేటర్లలో కాసుల వర్షాన్ని కురిపించిన ఈ మూవీని టీవీలో ప్రేక్షకులు అసలు పట్టించుకోలేదు. ఈ తెలుగు ప్రీమియర్‌కు షాకింగ్ టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. అర్బన్ ఏరియాలో 1.28 టీఆర్‌పీ రేటింగ్ రాగా...అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలో కలిపి 0.99 టీఆర్‌పీ రేటింగ్ మాత్రమే వచ్చింది. వంద కోట్ల మూవీకి 0.99 టీఆర్‌పీ రేటింగ్ రావడంపై ఆడియెన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వంద కోట్లకు కనీసం వన్ కూడా రాలేదంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఆరేళ్ల తర్వాత...
గత కొన్నాళ్లుగా వరుస పరాజయాల్లో ఉన్న విశాల్‌ను మార్క్ ఆంటోనీ మూవీ గట్టెక్కించింది.2018లో రిలీజైన ఇరుంబుతిరై తర్వాత విశాల్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. దాదాపు ఆరేళ్ల తర్వాత మార్క్ ఆంటోనీతో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు.
మార్క్ ఆంటోనీ కథ ఇదే...
ఆంటోనీ (విశాల్) ఓ గ్యాంగ్‌స్టర్. గొడవల్లో చనిపోతాడు. తండ్రి ఆంటోనీపై ద్వేషంతోనే అతడి కొడుకు మార్క్ (విశాల్) పెరుగుతాడు. ఆంటోనీ కొడుకు అనే ముద్ర కారణంగా మార్క్‌కు అడుగడుగునా అవమానాలు పడుతుంటాడు. టైమ్ ట్రావెల్ ఫోన్ ద్వారా 1975లోనే చనిపోయిన తండ్రితో మార్క్ మాట్లాడుతాడు. అప్పుడే తండ్రి మంచి మనసుతో పాటు అతడి గతం ఏమిటో మార్క్‌కు తెలుస్తుంది. తండ్రిని తిరిగి బతికించుకునే అవకాశం కూడా మార్క్‌కు వస్తుంది. అది ఎలా సాధ్యమైంది? మార్క్‌కు జాకీ(ఎస్‌జేసూర్య), ఏకాంబరం(సునీల్)లతో ఉన్న సంబంధం ఏమిటి? అన్నదే ఈ మూవీ కథ.
అమెజాన్ ప్రైమ్...
టైమ్ ట్రావెల్‌కు గ్యాంగ్‌స్టర్ మాఫియా కథను మిక్స్ చేస్తూ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ మార్క్ ఆంటోనీ సినిమాను తెరకెక్కించిన తీరు థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించింది. మార్క్ ఆంటోనీ మూవీ ఓటీటీలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
21 కోట్ల లాభాలు...
తమిళంలో నిర్మాతలకు లాభాల వర్షం కురిపించిన మార్క్ ఆంటోనీ మూవీ తెలుగులో మాత్రం నష్టాలనే తెచ్చిపెట్టింది. తెలుగులో నాలుగున్నర కోట్ల ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైంది. నాలుగు కోట్ల వరకు మాత్రమే కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతలకు యాభై లక్షల వరకు నష్టాలను తెచ్చిపెట్టింది. తమిళ వెర్షన్ మాత్రం నిర్మాతలకు 25 కోట్లకుపైగా లాభాలను తెచ్చిపెట్టింది.
మార్క్ ఆంటోనీ తర్వాత రత్నం మూవీతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చాడు విశాల్. హరి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. రత్నంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
టాపిక్