Mark Antony Collection: విశాల్ కెరీర్‍లోనే బెస్ట్ ఓపెనింగ్స్.. మార్క్ ఆంటోనీ 2 డేస్ కలెక్షన్స్
Mark Antony Day 2 Collection: తమిళ స్టార్ హీరో విశాల్ మరోసారి విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా మార్క్ ఆంటోనీ. ఈ సినిమాకు బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. సో.. మార్క్ ఆంటోనీ 2 రోజుల కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..
Mark Antony 2 Days Collection: కోలీవుడ్ అగ్ర హీరో విశాల్, డైరెక్టర్ అండ్ యాక్టర్ ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ మార్క్ ఆంటోనీ. టైమ్ ట్రావెల్ కథకు కాస్తా మాస్, కమర్షియల్ హంగులు అద్ది తెరకెక్కించిన ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. మూవీలో రీతూ వర్మ, అభినయ, సునీల్, సెల్వరాఘవన్ కీలక పాత్రలు పోషించారు.
ట్రెండింగ్ వార్తలు
బడ్జెట్-బిజినెస్
ఎస్ వినోద్ కుమార్ నిర్మించిన మార్క్ ఆంటోనీ సినిమాను రూ. 30 కోట్ల బడ్జెట్‍తో రూపొందించారు. ఈ సినిమా సుమారు రూ. 38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వరల్డ్ వైడ్గా రూ. 40 కోట్లకు ఫిక్స్ అయింది. ఇక సినిమాను తమిళనాడులో 1100 థియేటర్లు, ఏపీ-తెలంగాణలో 500 స్క్రీన్స్, కేరళ, కర్ణాటకలో సుమారు 500 థియేటర్లు, మొత్తంగా వరల్డ్ వైడ్‍గా 2900 స్క్రీన్లలో విడుదల చేశారు.
ఫస్ట్ డే కలెక్షన్స్
సెప్టెంబర్ 15న విడుదలైన మార్క్ ఆంటోనీ మూవీకి తొలిరోజు బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఇది విశాల్ కెరీర్‍లోనే అత్యధిక ఓపెనింగ్స్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మార్క్ ఆంటోనీకి ఫస్ట్ డే తమిళంలో రూ. 5.5 కోట్ల షేర్, రూ. 7.2 కోట్ల గ్రాస్, తెలుగులో రూ. 1 కోటి షేర్, రూ. 2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. ఇలా తొలి రోజు సుమారు రూ. 10 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
2వ రోజు వసూళ్లు
మార్క్ ఆంటోనీ సినిమా తమిళంలో రెండో రోజు కూడా అదే హవా కొనసాగించింది. కానీ, తెలుగులో మాత్రం కలెక్షన్స్ తగ్గాయి. సినిమాకు రెండో రోజున తమిళంలో రూ. 1.35 కోట్ల షేర్ కలెక్ట్ కాగా తెలుగులో రూ. 60 లక్షల రేంజ్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇలా మార్క్ ఆంటోనీ మూవీకి 2వ రోజున వరల్డ్ వైడ్గా రూ. 6.29 కోట్ల షేర్, రూ. 8.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
2 రోజుల్లో వరల్డ్ వైడ్‍గా
ఇక మార్క్ ఆంటోనీ సినిమాకు 2 రోజుల్లో తమిళనాడులో రూ. 16.65 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.45 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.80 కోట్లు, ఓవర్సీస్‍లో రూ. 3.55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇలా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 25.45 కోట్ల గ్రాస్, రూ. 12.60 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది. అంటే ఇంకా ఈ మూవీకి 27.4 కోట్లు వస్తేనే హిట్ టాక్ తెచ్చుకుంటుంది.