Vishak as Sanjay Gandhi In Emergency: సంజయ్‌గాంధీగా విశాక్‌.. ఎమర్జెన్సీ నుంచి మరో ఫస్ట్‌ లుక్‌-vishak nair as sanjay gandhi in emergency first look revealed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vishak Nair As Sanjay Gandhi In Emergency First Look Revealed

Vishak as Sanjay Gandhi In Emergency: సంజయ్‌గాంధీగా విశాక్‌.. ఎమర్జెన్సీ నుంచి మరో ఫస్ట్‌ లుక్‌

HT Telugu Desk HT Telugu
Sep 13, 2022 05:58 PM IST

Vishak as Sanjay Gandhi In Emergency: ఎమర్జెన్సీ మూవీ నుంచి మరో ఫస్ట్‌ లుక్‌ వచ్చింది. ఈ మూవీలో సంజయ్‌గాంధీగా కనిపిస్తున్న విశాక్‌ నాయర్‌కు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ ఇది.

సంజయ్ గాంధీ పాత్రలో కనిపిస్తున్న విశాక్ నాయర్
సంజయ్ గాంధీ పాత్రలో కనిపిస్తున్న విశాక్ నాయర్

Vishak as Sanjay Gandhi In Emergency: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌.. ఇందిరాగాంధీలాగా కనిపిస్తూ, డైరెక్ట్‌ చేస్తున్న మూవీ ఎమర్జెన్సీ. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీపై ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఇందిర క్యారెక్టర్‌లో కనిపిస్తున్న కంగనతోపాటు జయప్రకాశ్‌ నారాయణ్‌ పాత్ర పోషిస్తున్న అనుపమ్‌ ఖేర్‌ ఫస్ట్‌ లుక్స్‌ రిలీజ్‌ అయ్యాయి.

తాజాగా మంగళవారం (సెప్టెంబర్‌ 13) సంజయ్‌ గాంధీ క్యారెక్టర్‌లో కనిపిస్తున్న విశాక్‌ నాయర్‌ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ ఫస్ట్‌ లుక్‌ను కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది. ఈ సందర్భంగా విశాక్‌ను పవర్‌హౌజ్‌ ఆఫ్‌ టాలెంట్‌ అంటూ కంగనా కొనియాడటం విశేషం. ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ ఎమర్జెన్సీ మూవీ ఫస్ట్‌ లుక్స్‌తోనే అంచనాలు పెంచేస్తోంది.

గతంలో అచ్చూ ఇందిరా గాంధీలాగా కనిపిస్తున్న కంగన లుక్‌ వైరల్‌ అయింది. ఆ తర్వాత అనుపమ్‌ ఖేర్ క్యారెక్టర్‌ కూడా అదే రేంజ్‌లో బజ్‌ క్రియేట్‌ చేసింది. ఇక ఇప్పుడు విశాక్‌ కూడా అచ్చుగుద్దినట్లు సంజయ్‌ గాంధీలా కనిపిస్తున్నాడు. "సంజయ్‌ గాంధీ పాత్రలో టాలెంట్‌ పవర్‌హౌజ్‌ అయిన విశాక్‌ నాయర్‌ నటిస్తున్నాడు. సంజయ్‌ గాంధీ.. ఇందిర ఆత్మలాగా ఉండేవాడు. ఆయనను ఇందిర ఎంతగానో ప్రేమించేవారు" అని కంగన ఈ ఇన్‌స్టా పోస్ట్‌కు క్యాప్షన్‌ ఉంచింది.

విశాక్‌ నాయర్‌ మలయాళంలో స్టార్‌ హీరో. అతనికి సంజయ్‌ గాంధీ పాత్ర ఇవ్వడంపై గతంలో కంగనా రనౌత్‌ స్పందించింది. "సంజయ్‌ గాంధీ అచ్చూ తన తల్లిలాగే ఉండేవారు. ఆమె జీవితంలోని ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరు. ఈ పాత్ర కోసం అన్ని ఎమోషన్లను పండించే నటుడు కావాలని అనుకున్నాను. దీనికోసం ఆరు నెలల పాటు వెతికాను.

చివరికి విశాక్‌ ఈ పాత్రకు సూటవుతాడని భావించాను. అతడో అద్భుతమైన నటుడు. అతడు సంజయ్‌ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడు" అని కంగన చెప్పింది. ఈ ఎమర్జెన్సీ మూవీకి కంగననే స్టోరీని అందించడంతోపాటు డైరెక్ట్‌ చేసింది. పైగా ఇందిర పాత్రలోనూ అదరగొట్టనుంది. ఈ మూవీలో అనుపమ్‌ ఖేర్‌, మహిమా చౌదరి, శ్రేయాస్‌ తల్పడేలు ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయి పాత్రలో శ్రేయాస్‌ తల్పడే కనిపిస్తున్నాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.