Karthik Varma Dandu: ఆయన గురించి మాట్లాడే అర్హత నాకు లేదు.. విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు కామెంట్స్-virupaksha director karthik varma dandu comments on bommarillu bhaskar in siddhu jonnalagadda jack pre release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthik Varma Dandu: ఆయన గురించి మాట్లాడే అర్హత నాకు లేదు.. విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు కామెంట్స్

Karthik Varma Dandu: ఆయన గురించి మాట్లాడే అర్హత నాకు లేదు.. విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Karthik Varma Dandu On Bommarillu Bhaskar In Jack Event: విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు. ఇటీవల ఆయన సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో కార్తీక్ వర్మ దండు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఆయన గురించి మాట్లాడే అర్హత నాకు లేదు.. విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు కామెంట్స్

Karthik Varma Dandu On Bommarillu Bhaskar In Jack Event: భమ్ బోలేనాథ్ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన కార్తీక్ వర్మ దండు సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. రీసెంట్‌గా ఆయన సిద్ధు జొన్నల గడ్డ నటించిన జాక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిల్లో ఒకరిగా హాజరయ్యారు.

చాలా కాలం గ్యాప్ తర్వాత

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా జాక్. బొమ్మరిల్లు భాస్కర్ చాలా కాలం గ్యాప్ తర్వాత దర్శకత్వం వహించిన జాక్ మూవీ నిన్న (ఏప్రిల్ 10) థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం మిశ్రమ స్పందన తెచ్చుకుంటోన్న జాక్ మూవీ రిలీజ్‌కు ముందు నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విరూపాక్ష్ డైరెక్టర్ కార్తీక్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

రైటింగ్ నాకు చాలా ఇష్టం

కార్తిక్ దండు మాట్లాడుతూ.. "ప్రసాద్ గారు, బాపీ గారు నన్ను 2019 నుంచి లాక్ చేశారు. ఇది నాకు హోమ్ బ్యానర్ లాంటిది. నాకు విరూపాక్షతో అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి థాంక్స్. బొమ్మరిల్లు భాస్కర్ గారి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. బొమ్మరిల్లు, పరుగు, ఆరెంజ్ లాంటి గొప్ప చిత్రాలను తీశారు. ఆయన రైటింగ్ నాకు చాలా ఇష్టం" అని అన్నారు.

ఆ ఇమేజ్ రావడం

"సిద్దు జొన్నలగడ్డ సినిమా అంటే అందరూ మినిమం గ్యారెంటీ అని ఫిక్స్ అయ్యారు. ఆ ఇమేజ్ రావడం అంత సులభం కాదు. ఈ సినిమా కూడా అలరిస్తుందని ఆశిస్తున్నాను. జాక్ చిత్రానికి ఆల్ ది బెస్ట్" అని విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు తన స్పీచ్ ముగించారు.

ఆయనను చూసే సివిక్ కారు కొన్న

ఇదే ఈవెంట్‌కు మరో అతిథిగా వచ్చిన తండేల్ మూవీ డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడుతూ .. "బొమ్మరిల్లు భాస్కర్ గారిని నా కెరీర్ ప్రారంభంలో చూశాను. స్క్రిప్ట్ డిస్కషన్ నడుస్తుంటే బొమ్మరిల్లు భాస్కర్‌ని చూస్తుండేవాడిని. ఆయన అప్పట్లో సివిక్ కారుని కొన్నారు. ఆ కారుని చూసే నేను కూడా అదే కొన్నాను" అని తెలిపారు.

ఇంట్లో వాళ్లు అడుగుతుంటారు

"సిద్దు అంటే మా ఇంట్లో వారందరికీ చాలా ఇష్టం. సిద్దుతో సినిమా ఎప్పుడు చేస్తావ్ అని ఇంట్లో వాళ్లు అడుగుతుంటారు. వైష్ణవి మరింత ముందుకు వెళ్లాలి. జాక్ ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని డైరెక్టర్ చందూ మొండేటి పేర్కొన్నారు.

కాలేజ్‌లో చూశాను

మ్యాడ్ స్క్వేర్ దర్శకుడు కల్యాణ్ శంకర్ మాట్లాడుతూ.. "నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలు చూశాను. పరుగు, ఆరెంజ్ ఇలా బొమ్మరిల్లు భాస్కర్ గొప్ప చిత్రాల్ని తీశారు. బొమ్మరిల్లు భాస్కర్ గారికి ఓ సిగ్నేచర్ ఉంటుంది" అని అన్నారు.

వందరెట్లు ఎక్కువగా ఉంటుంది

"మా సిద్దుని టిల్లు గాడిలానే చూశారు. కానీ, దాని కంటే వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది. జాక్‌తో అది మరింతగా ఉంటుంది. వైష్ణవికి ఈ చిత్రం మరింత సక్సెస్ తెచ్చి పెట్టాలి. జాక్ చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయండి" అని దర్శకుడు కల్యాణ్ శంకర్ కోరారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం