Virender Sehwag Divorce: భార్యతో విడిపోతున్న వీరేంద్ర సెహ్వాగ్.. 20 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. త్వరలో విడాకులు?-virender sehwag separates with his wife aarti ahlawat after 20 years of marriage and headed to divorce speculations ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virender Sehwag Divorce: భార్యతో విడిపోతున్న వీరేంద్ర సెహ్వాగ్.. 20 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. త్వరలో విడాకులు?

Virender Sehwag Divorce: భార్యతో విడిపోతున్న వీరేంద్ర సెహ్వాగ్.. 20 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. త్వరలో విడాకులు?

Sanjiv Kumar HT Telugu
Jan 24, 2025 07:30 AM IST

Virender Sehwag Separate With His Wife Aarti Ahlawat: భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తి అహ్లావత్‌తో విడిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమ 20 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు బాలీవుడ్ మీడియా ఊహాగానాలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..!

భార్యతో విడిపోతున్న వీరేంద్ర సెహ్వాగ్.. 20 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. త్వరలో విడాకులు?
భార్యతో విడిపోతున్న వీరేంద్ర సెహ్వాగ్.. 20 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. త్వరలో విడాకులు?

Virender Sehwag Divorce To Wife Aarti Ahlawat: భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్, ఆయన భార్య ఆర్తి అహ్లావత్ 20 ఏళ్ల వివాహ బంధం తర్వాత విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2004లో వివాహం చేసుకున్న ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వారు త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లు ఊహాగానాలు చెలరేగాయి.

yearly horoscope entry point

20 ఏళ్లుగా

సెహ్వాగ్, ఆర్తి చాలా నెలలుగా విడిగా నివసిస్తున్నారని, విడాకులు తీసుకోబోతున్నారని సమాచారం. దూకుడు బ్యాటింగ్ శైలికి పేరుగాంచిన వీరేంద్ర, ఆర్తి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ దంపతులకు 2007లో ఆర్యవీర్, 2010లో వేదాంత్ జన్మించారు. 20 ఏళ్లుగా అన్యూనంగా కలిసి ఉన్న సెహ్వాగ్ ఆర్తి ఇటీవల పలు పరిణామాలతో వారి మధ్య దూరం పెరుగినట్లు టాక్.

దీపావళి వేడుకల సందర్భంగా వీరేంద్ర తన కుమారులు, తన తల్లితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే, ఆ పోస్ట్‌లో భార్య ఆర్తి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అలాగే, ఆమె పోస్ట్‌లో భార్య ఆర్తి ఫోటోలను షేర్ చేయలేదు వీరు. ఇలాంటి పలు చర్యలు వారి విడిపోయే ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.

లేని భార్య ప్రస్తావన

కాగా, రెండు వారాల క్రితం, వీరేంద్ర పాలక్కాడ్‌లోని విశ్వ నాగయక్షి ఆలయాన్ని సందర్శించి, ఆ ట్రిప్ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. అయితే, ఆ పోస్ట్‌లో ఆర్తి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అది వారి సంబంధంలో మనస్పర్థలు ఉన్నట్లు మరింతగా సూచిస్తోంది.

అయితే, భార్య ఆర్తితో విడిపోవడంపై క్రికెట్ దిగ్గజం సెహ్వాగ్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ, ఈ జంట బహిరంగంగానే దూరంగా మెలగడం అటు క్రికెట్ వర్గాలు, ఇటు వారి అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది.

ఆర్తి అహ్లావత్ గురించి

ఇదిలా ఉంటే, న్యూ ఢిల్లీకి చెందిన ఆర్తి అహ్లావత్ ఎక్కువగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. పెద్దగా ప్రజల అటెన్షన్ కోరుకోరు. డిసెంబర్ 16, 1980న జన్మించిన ఆర్తి అహ్లావత్ లేడీ ఇర్విన్ సెకండరీ స్కూల్, భారతీయ విద్యా భవన్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని మైత్రేయి కళాశాలలో కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా పూర్తి చేశారు.

ఈ జంట ప్రేమకథ 2000 సంవత్సరం ప్రారంభంలో మొదలైంది. 2004లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నివాసంలో సెహ్వాగ్, ఆర్తి వివాహం ఘనంగా జరిగింది. 20 సంవత్సరాలుగా, వీరు అన్యూన్యమైన జంటగా కనిపించారు. వీరేంద్ర క్రికెట్ కమిట్‌మెంట్‌లు, వారి కుటుంబ జీవితాన్ని సమతుల్యం చేసుకున్నారు. అయితే, వారి సంబంధం కొంతకాలంగా ఇబ్బందుల్లో ఉందని, దీనివల్ల విడిపోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం.

రిటైర్ తర్వాత

వీరేంద్ర 2015లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీకి చెందిన యాంటీ-డోపింగ్ అప్పీల్ ప్యానెల్ సభ్యుడిగా వంటి వివిధ పాత్రలలో పనిచేస్తున్నారు. ఎక్కువగా ప్రైవేట్‌గా ఉన్న సెహ్వాగ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఈ పరిణామాల నేపథ్యంలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, వీరేంద్ర, ఆర్తి ఇద్దరూ అధికారిక ప్రకటన చేయనప్పటికీ వారు విడిపోవడానికి సంకేతాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం