Virata Parvam Collections: విరాట పర్వం రెండు రోజుల కలెక్షన్లు ఎంతో తెలుసా?-virata parvam two days world wide collections not up to the mark ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Virata Parvam Two Days World Wide Collections Not Up To The Mark

Virata Parvam Collections: విరాట పర్వం రెండు రోజుల కలెక్షన్లు ఎంతో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Jun 19, 2022 04:40 PM IST

భారీ అంచనాల మధ్య రిలీజైన మూవీ విరాట పర్వం. రానా, సాయిపల్లవి నటించిన ఈ మూవీకి పాజిటివ్‌ రివ్యూలు వచ్చాయి. అయితే కలెక్షన్ల విషయంలో మాత్రం అంతగా దూసుకెళ్లలేకపోతోంది.

విరాట పర్వం మూవీలో రానా, సాయి పల్లవి
విరాట పర్వం మూవీలో రానా, సాయి పల్లవి (Twitter)

ఓ రియల్‌ స్టోరీని, నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఓ విభిన్నమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది విరాట పర్వం మూవీ. ఈ సినిమాలో సాయిపల్లవి నటనకు ప్రేక్షకులతోపాటు క్రిటిక్స్‌ కూడా ఫిదా అయిపోయారు. ద‌ర్శ‌కుడు వేణు ఉడుగుల 1990ల దశకంలో జరిగిన యథార్థ సంఘటనతో న‌క్స‌లిజం నేప‌థ్యానికి ప్రేమ‌క‌థ‌ను జోడించి విరాట‌ప‌ర్వం సినిమాను తెర‌కెక్కించాడు. రానా, సాయిప‌ల్ల‌వి తో పాటు ప‌లువురు అగ్ర‌ న‌టీన‌టులు భాగ‌ం కావ‌డంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి నెల‌కొంది.

అందుకు తగినట్లే రిలీజైన రోజే బాక్సాఫీస్‌ దగ్గర కూడా మంచి కలెక్షన్లే రాబట్టింది. అయితే రెండో రోజే ఈ సినిమా కాస్త డల్లయింది. మొత్తంగా రెండు రోజులు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.3.9 కోట్లు వసూలు చేసింది. తొలి రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి రూ.1.53 కోట్ల షేర్‌ సాధించినట్లు ట్రేడ్‌ అనలిస్టులు వెల్లడించారు.

నైజాంలో రూ.82 లక్షలు, సీడెల్‌లో రూ. 12 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, ఈస్ట్‌, వెస్ట్‌, గుంటూరు, కృష్ణ, నెల్లూరు కలిపి రూ.45 లక్షలు వసూలు చేసింది. మొత్తం ఈ రెండు రోజుల్లో కలిపి రూ.2.5 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు వచ్చాయి. ఇక కర్ణాటకతోపాటు మిగతా ఇండియాలో కలిపి రెండు రోజుల్లో రూ.20 లక్షలు మాత్రమే వసూలు చేయగలిగింది. విదేశాల్లో రూ.54 లక్షలు వసూలయ్యాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్