Virata Parvam OTT Release: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న విరాటపర్వం.. ఎప్పుడు? ఎందులో?-virata parvam ott release date fixed and fans are excited ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Virata Parvam Ott Release Date Fixed And Fans Are Excited

Virata Parvam OTT Release: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న విరాటపర్వం.. ఎప్పుడు? ఎందులో?

HT Telugu Desk HT Telugu
Jun 29, 2022 07:10 PM IST

Virata Parvam OTT Release: రానా దగ్గుబాటి, సాయి పల్లవి నటించిన విరాట పర్వం మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్సయింది. ఊహించినదానికంటే చాలా త్వరగానే ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది.

విరాట పర్వం మూవీలో రానా, సాయిపల్లవి
విరాట పర్వం మూవీలో రానా, సాయిపల్లవి (twitter)

విరాట పర్వం మూవీ జూన్‌ 17న రిలీజైంది. ఈ సినిమాకు పాజిటివ్‌ టాకే వచ్చింది. అయితే బాక్సాఫీస్‌ దగ్గర మాత్రం ఊహించిన మేర కలెక్షన్లు రాబట్టలేకపోయింది. దీంతో చాలా త్వరగానే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్‌ నిర్ణయించారు. విరాట పర్వం ఈ శుక్రవారమే (జులై 1) నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కాబోతోంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది.

తెలుగు, మలయాళం, తమిళం భాషల్లో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండనుంది. విరాట పర్వం ప్రపంచాన్ని అనుభూతి చెందడానికి సిద్ధంగా ఉండండి. జులై 1న తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తోంది అని ఈ గ్లోబల్‌ ఓటీటీ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

ఈ సినిమా చాలా త్వరగా ఓటీటీలోకి వస్తుండటంపై ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. అయితే కొంతమంది ఈ సినిమాను హిందీలోనూ డబ్‌ చేసి రిలీజ్‌ చేయాలని కోరడం విశేషం. ఈ సినిమా చాలా బాగుంది.. దయచేసి హిందీలో రిలీజ్‌ చేయండి అని ఓ యూజర్‌ కోరాడు.

సినిమా రిలీజైన తొలిరోజే చాలా వరకూ పాజిటివ్‌ రివ్యూలే వచ్చాయి. ముఖ్యంగా సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తొలిసారి ఓ భిన్నమైన పాత్రలో ఆమెను చూశారు. పైగా ఈ మూవీ హీరోయిన్‌ చుట్టూ తిరిగే కథే. దీంతో సాయి పల్లవి తన నట విశ్వరూపం చూపించింది. తెలంగాణలో 1990లనాటి నక్సల్‌ ఉద్యమాన్ని ఈ సినిమా కళ్లకు కట్టింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం