Virat Kohli Dating : అనుష్క కంటే ముందు ఐదుగురు హీరోయిన్లతో కోహ్లీ డేటింగ్!
Virat Kohli Date With Five Heroines : నటి అనుష్క శర్మను పెళ్లి చేసుకునే ముందు విరాట్ కోహ్లీ ఐదుగురు నటీమణులతో డేటింగ్ చేసినట్టుగా వార్తలు ఉన్నాయి. ఇంతకీ ఎవరు వాళ్ళు?
బాలీవుడ్ ప్రముఖ నటి అనుష్క శర్మ, టీమిండియా ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ జంట సంతోషంగా వివాహం చేసుకున్నారు. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ(Anushka Sharma-Virat Kohli)తో పెళ్లి తర్వాత విరుష్క(Virushka) అనే పేరు ఫేమస్ అయింది. సినిమాల్లో పీక్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుష్క నిర్ణయించుకుంది. డేటింగ్‌లో ఉన్న ఈ జంట డిసెంబర్ 11, 2017న వివాహం చేసుకుంది. వీరికి 2021లో వామిక జన్మించింది.
కోహ్లీ, అనుష్క ప్రేమ కథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. మొదట స్నేహం, ఆ తర్వాత ప్రేమగా మారింది. ఓసారి సంబంధం విడిపోయిందని చెబుతారు. ఆ తర్వాత ఈ జంట ఎలా ఒక్కటయ్యారనేది ఆసక్తికరం. 2013లో షాంపూ ప్రకటన సందర్భంగా అనుష్క, విరాట్‌లు కలుసుకున్నారు. విరాట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనుష్కను తొలిసారి కలిసినప్పుడు చాలా నెర్వస్ అయ్యానని చెప్పాడు. అక్కడ మూడ్ మార్చేందుకు అనుష్క ఓ జోక్ చెప్పింది. అక్కడి నుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.
అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ(Virat Kohli) గురించిన ఓ వార్త జోరుగా చర్చనీయాంశమైంది. అనుష్క శర్మ కంటే ముందు విరాట్ ఐదుగురు హీరోయిన్లతో డేటింగ్ చేశాడట. సారా జేన్ డయాస్(Sarah-Jane Dias)తో మెుదట డేటింగ్ చేసినట్టుగా పుకారు ఉంది. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె విరాట్ కోహ్లీతో డేటింగ్ చేసిందని వార్తలు వచ్చాయి. పలు ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్స్, మీడియా సంస్థలు దీనిపై వార్తలను ప్రచారం చేశాయి.
పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన పంజాలో కూడా సారా కథానాయికగా నటించింది. తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా(tamanna bhatia)తో కోహ్లీ పేరు వినిపించింది. మొబైల్ ఫోన్ ప్రకటనలో నటించిన తర్వాత, ఆమె విరాట్ కోహ్లీతో డేటింగ్ చేసినట్టుగా పుకార్లు వచ్చాయి.
అదే సమయంలో నటి, మోడల్ సంజనా గల్రానీ(Sanjana Galrani)తో కూడా కూడా కోహ్లీ పేరు వినిపించింది. వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఇచ్చిన పార్టీలో సంజన కోహ్లీని కలిసినట్లు వార్తలు వచ్చాయి. ఇంకోవైపు విరాట్, ఇసాబెల్లె లైట్(izabelle leite)తోనూ చాలా సంవత్సరాలు కోహ్లీ డేటింగ్ చేశాడనే న్యూస్ వైరల్ అయ్యింది. ఈ జంట 2012 నుండి 2014 వరకు డేటింగ్ చేసినట్లుగా చెబుతారు. కోహ్లీతో తనకున్న అనుబంధం గురించి ఇసాబెల్లె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. రెండేళ్లు డేటింగ్ చేసి విడిపోయాం అని చెప్పింది. ఇక చివరిగా నటి సాక్షి అగర్వాల్(Sakshi Agarwal)తో విరాట్ డేటింగ్ చేశాడట. తమిళ నటి అయిన సాక్షి.. కోహ్లీతో డేటింగ్‌లో ఉందని, ఆ తర్వాత విడిపోయిందని చెబుతారు. ఇలా అనుష్కతో పెళ్లికి ముందు ఐదుగురు హీరోయిన్లతో కోహ్లీ డేటింగ్ చేశాడని పుకార్లు ఉన్నాయి. ఇది ఎంతవరకూ నిజమో వారికే తెలియాలి.