ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు హారర్ థ్రిల్లర్ సిరీస్.. 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటేసి.. ఎక్కడ చూడాలంటే?-viraatapalem pc meena reporting ott streaming on zee5 and crossed 50 million streaming minutes viraatapalem ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు హారర్ థ్రిల్లర్ సిరీస్.. 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటేసి.. ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు హారర్ థ్రిల్లర్ సిరీస్.. 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటేసి.. ఎక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సిరీస్ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ దూసుకుపోతోంది. ఏకంగా 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటేసి ఓటీటీ ట్రెండింగ్‌లో సత్తా చాటుతోంది. మూఢ నమ్మకాల కాన్సెప్ట్‌తో వచ్చిన విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ఓటీటీ రిలీజ్‌పై లుక్కేద్దాం.

ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు హారర్ థ్రిల్లర్ సిరీస్.. 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటేసి.. ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలోకి ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. వాటిలో, కొన్ని మాత్రమే ఓటీటీ ఆడియెన్స్ ఆదరణ అందుకుని సత్తా చాటుతుంటాయి. అలాంటి వాటిలో నేరుగా ఓటీటీ రిలీజ్ అయిన తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్

ఆ తెలుగు వెబ్ సిరీసే విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్. తెలుగులో సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కిన విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ఓటీటీలో 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటేసి దూసుకుపోతోంది. ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న ఈ సిరీస్ విరాటపాలెం ఓటీటీలోకి వచ్చిన రెండు, మూడు రోజుల్లోనే ఈ ఘనత సాధించింది.

జీ5 ఓటీటీలో

రెండు, మూడు రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చేసిన విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ జీ5 ఓటీటీ ట్రెండింగ్‌లో దంచికొడుతోంది. జీ5లో తెలుగు సహా ఇతర భాషల్లో విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. జూన్ 26న జీ5లో విరాటపాలెం ఓటీటీ రిలీజ్ అయింది.

ముఖ్య పాత్రలు

భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన జీ5 తెలుగు ఒరిజినల్ సిరీస్ విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్‌‌తో మళ్లీ అందరినీ ఆకట్టుకుంది. కెవి శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌ను కృష్ణ పోలూరు డైరెక్ట్ చేశారు. అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రముఖ పాత్రలు పోషించారు.

అమ్మవారి శాపంగా

1980లలో ఆంధ్రప్రదేశ్‌లోని విరాటపాలెం అనే గ్రామంలో ప్రతి వధువు తన పెళ్లి రోజున చనిపోతుంటుంది. అది అమ్మవారి శాపం అని గ్రామస్థులు భయంతో వణికిపోతుంటారు. అలా దాదాపు ఓ పదేళ్ల పాటుగా గ్రామంలో వివాహాం అనేది జరగదు.

మూఢ నమ్మకాలతో

భయం, మూఢ నమ్మకాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండే ఆ గ్రామంలోకి పోలీసు కానిస్టేబుల్ మీనా (అభిజ్ఞ వూతలూరు) వస్తుంది. శాపగ్రస్తమైన గ్రామంలోకి ప్రవేశించి అక్కడి ప్రజల్ని ప్రశ్నించడానికి ధైర్యం చేస్తుంది.

థ్రిల్లింగ్ విషయాలు

ఆ ఊరి రహస్యాల్ని పీసీ మీనా ఎలా తెలుసుకుంది? అది శాపమా? ఎవరైనా చేస్తున్న హత్యలా? అనే ఉత్కంఠ, థ్రిల్స్ కలిగించే అంశాలతో సిరీస్ సాగుతుంది. ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్‌ను జీ5 ఓటీటీలో ఎంచక్కా చూసేయండి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం