Vinaro Bhagyamu Vishnu Katha Collection: విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ సినిమా ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే-vinaro bhagyamu vishnu katha day 1 collection second highest in kiran abbavaram career
Telugu News  /  Entertainment  /  Vinaro Bhagyamu Vishnu Katha Day 1 Collection Second Highest In Kiran Abbavaram Career
విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ
విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ

Vinaro Bhagyamu Vishnu Katha Collection: విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ సినిమా ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే

19 February 2023, 12:43 ISTNelki Naresh Kumar
19 February 2023, 12:43 IST

Vinaro Bhagyamu Vishnu Katha Collection: కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టించిన విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ సినిమాకు తొలిరోజు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఎంతంటే...

Vinaro Bhagyamu Vishnu Katha Collection: కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టించిన విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ సినిమా శ‌నివారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తొలిరోజు ఈ సినిమా డీసెంట్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. శ‌నివారం నాడు రెండు కోట్ల డెబ్భైఐదు ల‌క్ష‌ల గ్రాస్‌ను కోటి న‌ల‌భై ల‌క్ష‌ల‌కుపైగా షేర్‌ను ద‌క్కించుకున్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమాకు రెండు కోట్ల న‌ల‌భై ల‌క్ష‌ల గ్రాస్ వ‌చ్చిన‌ట్లు తెలిసింది. ఎస్‌.ఆర్ క‌ళ్యాణ‌మండపం త‌ర్వాత కిర‌ణ్ అబ్బ‌వ‌రం కెరీర్‌లో హ‌య్యెస్ట్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న సినిమాగా విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ‌ నిలిచింది. నైజాం ఏరియాలో 60 ల‌క్ష‌ల‌, సీడెడ్‌లో 20ల‌క్ష‌ల‌కుపైగా విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ సినిమాకు క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

ఓవ‌ర్‌సీస్‌లో ఈ సినిమా ప‌ది ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు చెబుతున్నారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు నాలుగు కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు తెలిసింది.

ప‌క్క‌వాడు సంతోషంగా మ‌న‌ము బాగున్న‌ట్లేన‌ని న‌మ్మే ఓ యువ‌కుడి క‌థ ఇది. తాను ప్రేమించిన అమ్మాయిని ఓ మ‌ర్డ‌ర్ కేసు నుంచి హీరో ఎలా కాపాడ‌డ‌నే పాయింట్‌కు కామెడీ, స‌స్పెన్‌, థ్రిల్‌ను జోడించి ద‌ర్శ‌కుడు ముర‌ళీ కిషోర్ అబ్బూరు విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ‌ సినిమాను తెర‌కెక్కించాడు. ఈ సినిమాలో క‌శ్మీరా ప‌ర‌దేశీ హీరోయిన్‌గా న‌టించ‌గా ముర‌ళీ శ‌ర్మ కీల‌క పాత్ర‌ను పోషించాడు. జీఏ2 పిక్చ‌ర్స్ ప‌తాకంపై బ‌న్నీవాస్ ఈ సినిమాను నిర్మించారు.

టాపిక్