ఒక్క డైలాగ్‌కే రూ. 447 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో! అతనెవరో తెలుసా?-vin diesel remuneration for one dialogue for groot in marvel cinematic universe and vin diesel net worth ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vin Diesel Remuneration For One Dialogue For Groot In Marvel Cinematic Universe And Vin Diesel Net Worth

ఒక్క డైలాగ్‌కే రూ. 447 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో! అతనెవరో తెలుసా?

Sanjiv Kumar HT Telugu
Feb 25, 2024 03:02 PM IST

Vin Diesel Remuneration For Groot Voice: ఒకే ఒక్క డైలాగ్‌కు ఏకంగా రూ. 447 కోట్లు తీసుకున్నాడు ప్రముఖ హాలీవుడ్ హీరో విన్ డీజిల్. ట్రిపుల్ ఎక్స్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న విన్ డీజిల్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోని గ్రూట్ పాత్రకు కోట్లల్లో ఛార్జ్ చేసినట్లు టాక్.

ఒక్క డైలాగ్‌కే రూ. 447 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో!  అతనెవరో తెలుసా?
ఒక్క డైలాగ్‌కే రూ. 447 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో! అతనెవరో తెలుసా? (Instagram)

Vin Diesel Net Worth: సాధారణంగా ఒక సినిమాకు వందల కోట్లు పారితోషికం తీసుకుంటారని తెలిసిన విషయమే. కానీ, ఒకే ఒక్క డైలాగ్‌కు వందల కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటారనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. కానీ, అది నిజంగానే జరిగింది. హాలీవుడ్ పాపులర్ యాక్టర్ విన్ డీజిల్ కేవలం ఒక డైలాగ్‌కే ఏకంగా రూ. 447 కోట్లు అందుకున్నాడు. అలా ఒక్క డైలాగ్‌కు అంత రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరోగా రికార్డ్ సాధించాడు విన్ డీజిల్.

పిల్లలకు మరి ఇష్టం

మార్వెల్ సినిమాలకు ప్రపంచస్థాయిలో అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి వచ్చే సినిమాలపై ప్రేక్షకులు, మూవీ లవర్స్ ఎక్కడాలేని ఆసక్తి చూపుతారు. అలాంటి ఈ మార్వెల్ సినిమాటిక్స్ యూనివర్స్‌లోని ఓ పాత్ర పేరే గ్రూట్. చెట్టులా ఉండే యానిమేటెడ్ పాత్ర అంటే చాలా మందికి ఫేవరేట్. ముఖ్యంగా చిన్న పిల్లలకు అయితే మరి ఇష్టం. అయితే, ఈ చెట్టు లాంటి గ్రూట్ క్యారెక్టర్‌కు సినిమాల్లో ఎలాంటి డైలాగ్స్ ఉండవు.

గ్రూట్ పాత్రకు ఉండే ఒకే ఒక్క డైలాగ్ ఐ యామ్ గ్రూట్. ఈ ఒక్క డైలాగ్‌తోనే ప్రతి సినిమాలో ఈ క్యారెక్టర్ కనిపిస్తుంది. అయితే, ఈ యానిమేటెడ్ క్యారెక్టర్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చింది విన్ డీజిల్. గ్రూట్ చెప్పేది ఒకే డైలాగ్ అయినా అది డిఫరెంట్ మాడ్యులేషన్స్‌లో ఉంటుంది. కోపం, బాధ, సంతోషం, కౌంటర్స్ ఇలా ఎలాంటి భావం అయిననా ఐ యామ్ గ్రూట్ అని మాత్రమే చెబుతుంది. దీన్ని అలా వివిధ రకాలుగా డబ్బింగ్ చెప్పింది విన్ డీజిల్.

8 చిత్రాల్లో పాత్ర

అలా ఒక్క డైలాగ్‌కు విన్ డీజిల్ దాదాపుగా రూ. 447 కోట్లు అందుకున్నాడని హాలీవుడ్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో గ్రూట్ పాత్ర మొత్తం 8 చిత్రాల్లో కనిపిస్తుంటుంది. అవి గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ (2014), గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 2 (2017), అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ (2018), అవెంజర్స్: ఎండ్ గేమ్ (2019), థోర్: లవ్ అండ్ థండర్ (2022), గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ: హాలిడే స్పెషల్ (2022, ఓటీటీలో మాత్రమే), గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 (2023), ఐ యామ్ గ్రూట్ సీజన్ 1 అండ్ 2 (2022-2023).

వీటిలో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ: హాలిడే స్పెషల్, ఐ యామ్ గ్రూట్ సీజన్ 1 అండ్ 2 నేరుగా డిస్నీ ప్లస్ హాట్ ‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో కేవలం గ్రూట్ పాత్ర ఒక్కటి మాత్రమే ఉంటుంది. కానీ, డైలాగ్స్ ఏం ఉండవు. మిగతా సినిమాల్లో సూపర్ హీరోలతోపాటు గ్రూట్ క్యారెక్టర్ ఉంటుంది. ఇలా ఒక్కో సినిమాకు డబ్బింగ్ చెప్పినందుకు విన్ డీజిల్ 13 మిలియన్ డాలర్స్ (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 107 కోట్లు) పారితోషికం అందుకున్నట్లు సమాచారం.

నిజం లేదంటూ

ఇలా మొత్తంగా అన్ని సినిమాలకు కలిపి 54 మిలియన్ డాలర్స్ అందుకున్నాడట విన్ డీజిల్. అంటే దాదాపుగా రూ. 447 కోట్లకుపైగా పారితోషికం అందుకున్నాడు విన్ డీజిల్. ఇలా ఒక్కో డైలాగ్‌కు వందల కోట్లు అందుకున్న హీరోగా విన్ రికార్డుకెక్కాడు అని హాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది. కానీ, వాటిలో నిజం లేదని గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ ఫ్రాంఛైజీ చిత్రాల దర్శకుడు జేమ్స్ గన్ ఓ సందర్భంలో చెప్పినట్లు కూడా హాలీవుడ్ మీడియా పేర్కొంది.

వీటిలో ఎంత నిజముందో తెలియదు కానీ, గ్రూట్ పాత్రకు విన్ డీజిల్ భారీగానే పారితోషికం అందుకున్నాడనే టాక్ గట్టిగానే వినిపించింది. ఇదిలా ఉంటే విన్ డీజిల్ నికర ఆస్తి విలువ దాదాపుగా 250 మిలియన్ డాలర్లు (రూ. 1980 కోట్లు) ఉంటుందని అంచనా. ఇక అతని సంవత్సర ఆదాయం 40 మిలియన్ డాలర్లు (రూ. 331 కోట్లు), బ్యాంక్ బ్యాలన్స్ 71 మిలియన్ డాలర్స్ (రూ. 588 కోట్లు) ఉంటుందని హాలీవుడ్ మీడియా తెలిపింది. అలాగే ఒక్కో సినిమాకు విన్ డీజిల్ 26 మిలియన్ డాలర్స్ (రూ. 215 కోట్లు) తీసుకుంటాడని సమాచారం.

తీసుకునే అవకాశం ఉందని

కాబట్టి, గ్రూట్ పాత్రకు ఒక్కో సినిమాకు విన్ డీజిల్ రూ. 107 కోట్లు తీసుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా విన్ డీజిల్ ట్రిపుల్ ఎక్స్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంఛైజీ చిత్రాలతో వరల్డ్ వైడ్‌గా అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ క్రేజ్‌తోనే గ్రూట్ క్యారెక్టర్‌కు విన్ డీజిల్‌ను ఎంపిక చేయడం, అంత మొత్తంలో పారితోషికం ఇవ్వడం జరిగినట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point