Vikranth Rona Telugu OTT Release:ఓటీటీలోకి వచ్చేసిన విక్రాంత్ రోణ తెలుగు వెర్షన్ - ఏ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుందంటే-vikranth rona telugu version ott streaming details where and when to watch this periodical movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vikranth Rona Telugu Version Ott Streaming Details Where And When To Watch This Periodical Movie

Vikranth Rona Telugu OTT Release:ఓటీటీలోకి వచ్చేసిన విక్రాంత్ రోణ తెలుగు వెర్షన్ - ఏ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుందంటే

Nelki Naresh Kumar HT Telugu
Sep 16, 2022 03:39 PM IST

Vikranth Rona Telugu OTT Release: కిచ్చా సుదీప్ హీరోగా న‌టించిన విక్రాంత్ రోణ సినిమా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 200 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. థియేట‌ర్ల‌లో క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన ఈ సినిమా నేడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే...

కిచ్చా సుదీప్
కిచ్చా సుదీప్ (Twitter)

Vikranth Rona Telugu OTT Release: కేజీఎఫ్ త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా సినీ అభిమానుల్లో అత్యంత ఆస‌క్తిని రేకెత్తించిన క‌న్న‌డ చిత్రం విక్రాంత్ రోణ‌. కిచ్చా సుదీప్ హీరోగా పీరియాడిక‌ల్ క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రానికి అనూప్ భండారీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జూలై 28న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా 200 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. కాగా ఈ సినిమా క‌న్న‌డ వెర్ష‌న్ సెప్టెంబ‌ర్ 2న జీ5 ఓటీటీలో విడుద‌లైంది.

తెలుగు వెర్ష‌న్ మాత్రం నేటి (సెప్టెంబ‌ర్ 16)నుంచి డిస్నీ ప్ల‌స్‌హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ వెర్ష‌న్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వ‌చ్చింది. కొమ‌ర‌ట్టు అనే ఫిక్ష‌నల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జ‌రిగే క‌థ‌తో ఈసినిమా తెర‌కెక్కింది. ఆ ఊరిలో వ‌రుస‌గా చిన్న‌పిల్ల‌లు హ‌త్య‌ల‌కు గుర‌వుతుంటారు. ఆ హ‌త్య‌ల వెన‌కున్న మిస్ట‌రీని విక్రాంత్ రోణ అనే పోలీస్ ఆఫీస‌ర్ ఎలా ఛేదించాడ‌నే క‌థాంశానికి గ్రాఫిక్స్ హంగుల‌ను జోడించి ద‌ర్శ‌కుడు అనూప్ భండారీ ఈ సినిమాను తెర‌కెక్కించాడు.

ఇందులో నెగెటివ్ షేడ్స్ తో కూడిన క్యారెక్ట‌ర్‌లో ద‌ర్శ‌కుడు అనూప్ భండారీ సోద‌రుడు నిరూప్ భండారీ క‌నిపించారు. గ్రాఫిక్స్‌, విజువ‌ల్స్‌తో పాటు సుదీప్ యాక్టింగ్‌, అత‌డిపై తెర‌కెక్కించిన పోరాట ఘ‌ట్టాల‌కు మంచి పేరు వ‌చ్చింది. ఈ సినిమాకు విక్రాంత్ రోణ 2 పేరుతో సీక్వెల్ రూపొందించ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు ప్ర‌క‌టించాడు.

IPL_Entry_Point