Action Thriller Movie: ట్విస్ట్‌లతో సాగే తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫ్రీ స్ట్రీమింగ్ - ఎక్కడ చూడాలంటే?
Action Thriller Movie: తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రైడ్ అదే పేరుతో తెలుగులోకి డబ్ అయ్యింది. విక్రమ్ ప్రభు హీరోగా నటించిన ఈ మూవీలో శ్రీదివ్య, అనంతిక సనీల్‌కుమార్ కథానాయికలుగా కనిపించారు. రైడ్ మూవీ తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.

Action Thriller Movie: టాలీవుడ్ హీరోయిన్లు శ్రీదివ్య, అనంతిక సనీల్‌కుమార్ నటించిన తమిళ మూవీ రైడ్ తెలుగులో అదే పేరుతో డబ్ అయ్యింది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో విక్రమ్ ప్రభు హీరోగా నటించాడు. రైడ్ మూవీ తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు లేకుండా 4కే వెర్షన్ యూట్యూబ్‌లో రిలీజైంది. రైడ్ మూవీ తెలుగు వెర్షన్‌ను ఆహా ఓటీటీలోనూ చూడొచ్చు.
కన్నడ రీమేక్...
కన్నడంలో శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన తగారు మూవీకి రీమేక్‌గా రైడ్ తెరకెక్కింది. కన్నడంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ తమిళంలో యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయనే కామెంట్స్ వినిపించాయి. 2023లో రైడ్ మూవీ థియేటర్లలో రిలీజైంది.
రైడ్ కథ ఇదే...
ప్రభాకరన్ (విక్రమ్ ప్రభు) నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్. ధైర్యసాహసాలు ఎక్కువే. డాలీ, చిట్టి అనే రౌడీలు అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటారు. వారి కారణంగా ఎంతో మంది అమ్మాయిలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే నిజం ప్రభాకరన్ ఇన్వేస్టిగేషన్‌లో తేలుతుంది.
ఓ ఎన్‌కౌంటర్‌లో డాలీ తమ్ముడు కాక్రోచ్‌ను ప్రభాకర్ చంపేస్తాడు. ప్రభాకరన్‌పై పగతో రగిలిపోయిన డాలీ అతడిపై ఎటాక్ చేస్తాడు. ఈ ప్రమాదంలో ప్రభాకరన్ భార్య వెంబా (శ్రీదివ్య) కన్నుమూస్తుంది. తన భార్యను చంపిన డాలీ గ్యాంగ్‌లోని ఒక్కొక్కరిని పట్టుకుంటూ చంపేస్తుంటాడు ప్రభాకరన్.
చివరకు డాలీని అతడు ఎలా పట్టుకున్నాడు? ప్రభాకరన్‌పై కోపంతో డాలీ కిడ్నాప్ చేసిన వేన్‌మతి (అనంతిక) ఎవరు? వేన్‌మతిని ప్రభాకరన్ ఎలా కాపాడాడు? డాలీకి ఎలాంటి శిక్ష విధించాడు అన్నదే రైడ్ మూవీ కథ.
అనుష్క మూవీతో...
రైడ్‌లో హీరోగా నటించిన విక్రమ్ ప్రభు త్వరలోనే అనుష్క ఘాటీ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ సినిమాలో దేశీరాజు అనే క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. క్రిష్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల అతడి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు.
తెలుగు సినిమాలతోనే...
రైడ్ మూవీలో హీరోయిన్‌గా నటించిన శ్రీదివ్య తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గా పలు సినిమాలు చేసింది. హనుమాన్ జంక్షన్, యువరాజుతో పాటు మరికొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించింది. మనసారాతో హీరోయిన్‌గా మారింది శ్రీదివ్య.మారుతి డైరెక్షన్‌లో వచ్చిన బస్‌స్టాప్, దిల్‌రాజు కేరింత, వారధి సహా హీరోయిన్‌గా తెలుగులో పలు సినిమాలు చేసింది.
తమిళంలో బెంగళూరు నాటక్కల్, పెన్సిల్, ఈట్టి తో పాటు మరికొన్ని సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసింది. ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సత్యం సుందరం మూవీలో కార్తి భార్య పాత్రలో శ్రీదివ్య కనిపించింది.
మ్యాడ్ హీరోయిన్...
రైడ్‌లో హీరోయిన్‌గా నటించిన అనంతిక సనీల్‌కుమార్ మ్యాడ్ మూవీతో గత ఏడాది తెలుగులో పెద్ద సక్సెస్ అందుకున్నది. ప్రస్తుతం మ్యాడ్ సీక్వెల్‌తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న 8 వసంతాలు మూవీలోహీరోయిన్‌గా కనిపించబోతున్నది. ఫణీంద్ర నరిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఛాలెంజింగ్ రోల్ చేస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్