లాంగ్ గ్యాప్ తర్వాత అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది విజయశాంతి. పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టింది. వింటేజ్ విజయశాంతిని గుర్తుచేసింది. లేడీ అమితాబ్ గా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న విజయశాంతి ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోయిన్‌గా చెలామణి అయ్యింది. యాక్షన్ సినిమాలతో అప్పటి స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చింది.
విజయశాంతి 1988లో ఎమ్‌వీ శ్రీనివాస ప్రసాద్ అనే బిజినెస్‌మెన్‌ను పెళ్లిచేసుకున్నది. విజయశాంతి భర్త తెలుగులో ఓ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. అదే నిప్పురవ్వ మూవీ. బాలకృష్ణ, విజయశాంతి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాడు. నిప్పురవ్వ సినిమాను యువరత్న ఆర్ట్స్ బ్యానర్‌పై విజయశాంతి భర్త ఎమ్‌వీ శ్రీనివాస ప్రసాద్ నిర్మించాడు. ప్రొడ్యూసర్‌గా ఆయన చేసిన ఒకే ఒక మూవీ ఇదే కావడం గమనార్హం.
బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన పదిహేడవ మూవీ ఇది. ఇదే వారిద్దరు కలిసి చేసిన చివరి మూవీ కూడా నిప్పురవవ్వ గమనార్హం. బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన నిప్పురవ్వ డిజాస్టర్‌గా నిలిచింది. నిప్పురవ్వ రిలీజ్ రోజే బాలకృష్ణ మరో మూవీ బంగారు బుల్లోడు కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. బంగారు బుల్లోడు మాత్రం బ్లాక్‌బస్టర్ అయ్యింది.
నిప్పురవ్వ షూటింగ్‌లో ప్రమాదం జరిగి ముగ్గురు యూనిట్ సభ్యులు కన్నుమూయడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఈ ప్రమాదం కారణంగా ఏడాదిపాటు నిప్పురవ్వ షూటింగ్ నిలిచిపోయింది. ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది. ఎన్నో కష్టాలు పడి విజయశాంతి భర్త ఎమ్‌వీ శ్రీనివాసప్రసాద్ ఈ సినిమాను రిలీజ్ చేశారు.
కానీ నిప్పురవ్వ డిజాస్టర్‌గా నిలిచి ఆయనకు భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. నిప్పురవ్వ సినిమాకు నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు. బప్పిలహరి, రాజ్ - కోటి పాటలను సమకూర్చగా..ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి బీజీఎమ్ అందించాడు.
నిప్పు రవ్వ మూవీలో హీరోయిన్ శోభన ఓ పాటలో కనిపించింది. అమ్రీష్ పురి విలన్‌గా నటించాడు. రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, బాబ్ ఆంటోనీ కీలక పాత్రల్లో కనిపించారు.
సంబంధిత కథనం