OTT Action Thriller: ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-vijayaraghavan malayalam action thriller movie rifle club ott release streaming date on netflix ott platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Action Thriller: ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Action Thriller: ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 13, 2025 06:22 PM IST

OTT Action Thriller: రైఫిల్ క్లబ్ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ఈ చిత్రం థియేటర్లలో మంచి హిట్ సాధించింది. ఈ సినిమా ఏ ఓటీటీలో రానుందంటే..

OTT Action Thriller: ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
OTT Action Thriller: ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

మలయాళ నటులు విజయరాఘవన్, దిలీశ్ పోతన్, వాణి విశ్వనాథ్ ప్రధాన పాత్రలు పోషించిన రైఫిల్ క్లబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. డిసెంబర్ 19వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీకి అషిక్ అబూ దర్శకత్వం వహించారు. ఈ రైఫిల్ క్లబ్ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.

స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడ?

రైఫిల్ క్లబ్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జనవరి 16వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. నెట్‍ఫిక్స్ లిస్టింగ్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. డబ్బింగ్ వెర్షన్‍లపై ఇంకా క్లారిటీ రాలేదు. జనవరి 16వ తేదీన ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మలయాళంలో ఒక్కటే స్ట్రీమింగ్‍కు వస్తుందా తెలుగు సహా మరిన్ని డబ్బింగ్ వెర్షన్‍లోనూ ఉంటుందా అనేది చూడాలి.

రైఫిల్ క్లబ్ చిత్రంలో విజయరాఘవన్, వాణి విశ్వనాథ్, దిలీశ్‍తో పాటు అనురాగ్ కశ్యప్, హమన్కింద్ ప్రధాన పాత్రలు పోషించారు. దర్శన రాజేంద్రన్, ఉన్నిమాయా ప్రసాద్, వినీశ్ కుమార్, సురభి లక్ష్మి కీలకపాత్రల్లో కనిపించారు.

రైఫిల్ క్లబ్ చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు మలయాళ డైరెక్టర్ అషిక్ అబూ. అనుకోకుండా ఓ డాన్ కొడుకును యాక్సిడెంట్ చేసిన ఓ జంట తప్పించుకోవడం, కాపాడాలంటూ రైఫిల్ క్లబ్ సభ్యుల దగ్గరికి వెళ్లడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రానికి శ్యామ్ పుష్కరన్, దిలీశ్ నాయర్, షర్ఫు కథను అందించారు. గ్రిప్పింగ్‍గా రూపొందించారు డైరెక్టర్ ఆషిక్. సినిమాటోగ్రఫీ బాధ్యతలు కూడా నిర్వర్తించారు.

రైఫిల్ క్లబ్ కలెక్షన్లు

రైఫిల్ క్లబ్ చిత్రం సుమారు రూ.10కోట్ల బడ్జెట్‍తో రూపొందినట్టు అంచనా. ఈ చిత్రం దాదాపు రూ.30కోట్ల కలెక్షన్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ కొట్టింది. ఈ చిత్రాన్ని చాలా శాతం పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో మంచి కలెక్షన్లను దక్కించుకుంది.

రైఫిల్ క్లబ్ మూవీని ఓపీఎం సినిమాస్, ట్రూ స్టోరీ పతాకాలపై ఆషిక్ అబూ, విన్సెంట్ వడక్కన్, విశాల్ విన్సెంట్ టోనీ ప్రొడ్యూజ్ చేశారు. రెక్స్ విజయన్ సంగీతం అందించిన ఈ మూవీకి వీ సాజన్ ఎడిటింగ్ చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం