Varisu Hindi Collection First Week: వారిసు హిందీ క‌లెక్ష‌న్స్ - కాంతారను బీట్ చేయ‌లేక‌పోయిన విజ‌య్ సినిమా-vijay varisu hindi box office collection varisu fails to beat kantara ponniyin selvan hindi collection ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Varisu Hindi Box Office Collection Varisu Fails To Beat Kantara Ponniyin Selvan Hindi Collection

Varisu Hindi Collection First Week: వారిసు హిందీ క‌లెక్ష‌న్స్ - కాంతారను బీట్ చేయ‌లేక‌పోయిన విజ‌య్ సినిమా

Nelki Naresh Kumar HT Telugu
Jan 22, 2023 03:28 PM IST

Varisu Hindi Collection First Week: విజ‌య్ వారిసు హిందీ వెర్ష‌న్ తొలి వారంలో అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగా క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకోలేక‌పోయింది. పొన్నియ‌న్ సెల్వ‌న్ -1, కాంతార హిందీ డ‌బ్‌ వెర్ష‌న్స్‌లో స‌గం క‌లెక్ష‌న్స్‌ కూడా విజ‌య్ సినిమా రాబ‌ట్ట‌లేక‌పోయిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

విజ‌య్ వారిసు
విజ‌య్ వారిసు

Varisu Hindi Collection First Week: కోలీవుడ్‌లో రెండు వంద‌ల‌ కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన విజ‌య్ వారిసు సినిమా బాలీవుడ్‌లో మాత్రం అంచ‌నాల‌కు అందుకోలేక‌పోయింది. తొలి వారంలో కేవ‌లం 6.22 కోట్ల‌ క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టింది. విజ‌య్‌కి ఉన్న క్రేజ్ దృష్టా వారిసు హిందీ వెర్ష‌న్ తొలి వారంలో ప‌ది కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేశాయి. కానీ ఆ టార్గెట్‌ను విజ‌య్ సినిమా చేరుకోలేక‌పోయింది.

ఇటీవ‌ల హిందీలో డ‌బ్ అయిన సౌత్ సినిమాల‌తో పోలిస్తే వారిసు చాలా త‌క్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం. రిష‌బ్ శెట్టి హీరోగా న‌టించిన కాంతార సినిమా హిందీలో ఫ‌స్ట్ వీక్‌లో 15 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. పొన్నియ‌న్ సెల్వ‌న్ - 1 దాదాపు 16 కోట్ల వ‌సూళ్ల‌ను సొంతం చేసుకున్న‌ది. వాటిలో స‌గం కూడా వారిసు సినిమాకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

కానీ విజ‌య్ కెరీర్‌లో హిందీలో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమా వారిసు నిలిచింది. గ‌తంలో మాస్ట‌ర్ హిందీ డ‌బ్ వెర్ష‌న్ 4.73 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఆ రికార్డ్‌ను వారిసు బ్రేక్ చేసింది. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కు ప్రాధాన్య‌మిస్తూ ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి వారిసు సినిమాను తెర‌కెక్కించాడు. మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో విడిపోయిన త‌న కుటుంబాన్ని ఏకం చేసిన ఓ కొడుకు క‌థ‌తో ఈ సినిమా రూపొందింది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించాడు.

వారిసులో విజ‌య్‌కి జోడీగా ర‌ష్మిక మంద‌న్న న‌టించింది. కోలీవుడ్‌లో ప‌ది రోజుల్లో ఈ సినిమా 235 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకున్న‌ది. విజ‌య్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది.

IPL_Entry_Point