Telugu News  /  Entertainment  /  Vijay Varasudu To Stream On Amazon Prime From February 22
విజ‌య్
విజ‌య్

Varasudu OTT Release Date: విజ‌య్ వారిసు ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే

04 February 2023, 6:30 ISTNelki Naresh Kumar
04 February 2023, 6:30 IST

Varasudu OTT Release Date: సంక్రాంతికి రిలీజైన విజ‌య్ వారిసు సినిమా మూడు వంద‌ల కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది.

Varasudu OTT Release Date: ఈ ఏడాది సంక్రాంతి విన్న‌ర్‌ల‌లో ఒక‌టిగా నిలిచిన విజ‌య్ వారిసు ఓటీటీలోకి రాబోతున్న‌ది. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 22 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. త‌మిళం, తెలుగు తో పాటు ద‌క్షిణాది భాష‌ల‌న్నింటిలో అదే రోజు ఈ సినిమా రిలీజ్ కానుంది.

ట్రెండింగ్ వార్తలు

వారిసు థియేట‌ర్ రిలీజ్‌కు చాలా రోజుల ముందే డిజిట‌ల్ రైట్స్‌ను దాదాపు వంద కోట్ల‌కు అమెజాన్ ప్రైమ్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. తొలుత ఈ సినిమా ఓటీటీలో ఫిబ్ర‌వ‌రి 10న రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఇప్ప‌టికీ థియేట‌ర్ల‌లో వారిసు ఆడుతుండ‌టంతో ఫిబ్ర‌వ‌రి 22 కు రిలీజ్ డేట్‌ను పోస్ట్ పోన్ చేసిన‌ట్లు స‌మాచారం.

అంతే కాకుండా థియేట‌ర్‌, ఓటీటీ రిలీజ్‌కు న‌ల‌భై రోజ‌లు గ్యాప్ ఖ‌చ్చితంగా ఉండాల‌నే ఆలోచ‌న‌తోనే ఫిబ్ర‌వ‌రి 22ను స్ట్రీమింగ్ డేట్‌గా ఫిక్స్ చేసిన‌ట్లు తెలిసింది. ఈ సినిమాకు వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అపార్థాల‌తో విడిపోయిన త‌న కుటుంబాన్ని ఏకం చేసిన ఓ కొడుకు క‌థ‌తో ఈ సినిమా రూపొందింది. మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో పాటు విజ‌య్ యాక్టింగ్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

జ‌న‌వ‌రి 11న రిలీజైన వారిసు సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా 300 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. విజ‌య్ కెరీర్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఈసినిమాలో విజ‌య్‌కి జోడీగా ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించింది.

వారిసు సినిమా తెలుగులో వార‌సుడు పేరుతో డ‌బ్ చేశారు. తెలుగు వెర్ష‌న్ మాత్రం మూడు రోజులు ఆల‌స్యంగా జ‌న‌వ‌రి 14న రిలీజైంది. తెలుగు వెర్ష‌న్ ఇర‌వై కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. వారిసు సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు రిలీజ్ చేశారు. ఈ సినిమాతోనే ఆయ‌న నిర్మాత‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.