Varasudu Tv Premiere Date: విజయ్ వారసుడు ఫస్ట్ టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్ - ఏ ఛానెల్‌లో టెలికాస్ట్ కానుందంటే?
Varasudu Tv Premiere Date: విజయ్ వారసుడు సినిమా టీవీ ప్రీమియర్ డేట్ రివీలైంది. సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ఈ మూవీ ఏ ఛానల్‌లో టెలికాస్ట్ కానుందంటే...
Varasudu Tv Premiere Date: విజయ్ (Vijay) వారసుడు మూవీ బుల్లితెర ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ సినిమా తెలుగు టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్సయింది. జెమిని టీవీలో జూన్ 25న ఈ సినిమా టెలికాస్ట్ కానుంది. సాయంత్రం ఆరు గంటలకు ఈ సినిమా ప్రీమియర్ మొదలుకానుంది.
ట్రెండింగ్ వార్తలు
వారసుడు తెలుగు వెర్షన్‌కు సంబంధించి ఇదే ఫస్ట్ టీవీ ప్రీమియర్ కావడం గమనార్హం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ విజయ్ తెలుగు డబ్బింగ్ సినిమాల పరంగా గత టీఆర్‌పీ రేటింగ్ రికార్డులను అధిగమించే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
తమిళంలో వారిసు పేరుతో ఈ ఏడాది సంక్రాంతికి(Sankarnthi) రిలీజైన ఈ మూవీ 300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. వారిసు సినిమాకు వంశీపైడిపల్లి దర్శకత్వం వహించాడు. వారసుడుతోనే వంశీపైడిపల్లి దర్శకుడిగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి చివరి కోరిక మేరకు అపోహలు, అపార్థాలతో విడిపోయిన తన కుటుంబాన్ని ఓ యువకుడు ఎలా ఏకం చేశాడన్నదే ఈ సినిమా కథ.
వారిసులో విజయ్ యాక్టింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాయి. తెలుగులో ఈ మూవీ 20 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. టాలీవుడ్‌లో రిలీజైన విజయ్ సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది.
వారసుడు సినిమాలో విజయ్‌కి జోడీగా రష్మిక మందన్న (Rashmika Mnadanna) హీరోయిన్‌గా నటించింది. నిర్మాతగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు. వారసుడులో శ్రీకాంత్, జయసుధ, శరత్‌కుమార్, సంగీత, శామ్ ప్రధాన పాత్రలను పోషించారు.