Leo Remuneration: 300 కోట్లతో లియో సినిమా.. విజయ్, త్రిష, డైరెక్టర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?-vijay trisha krishnan lokesh kanagaraj remuneration for leo movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Trisha Krishnan Lokesh Kanagaraj Remuneration For Leo Movie

Leo Remuneration: 300 కోట్లతో లియో సినిమా.. విజయ్, త్రిష, డైరెక్టర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Sanjiv Kumar HT Telugu
Oct 18, 2023 11:40 AM IST

Leo Movie Cast Remuneration: ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో లియో ఫీవర్ కాస్తా గట్టిగానే కనిపిస్తోంది. ఇటీవలే లియో ట్రైలర్ విడుదలై సెన్సేన్ క్రియేట్ చేసింది. లియో సినిమాకు విడుదలకు ఇంకా ఒక్క రోజు మిగిలి ఉండగా.. చిత్రంలోని విజయ్, త్రిష, డైరెక్టర్ లోకేష్ పారితోషికం హాట్ టాపిక్ అవుతోంది.

300 కోట్లతో లియో సినిమా.. విజయ్, త్రిష, డైరెక్టర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
300 కోట్లతో లియో సినిమా.. విజయ్, త్రిష, డైరెక్టర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Vijay Remuneration For Leo: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ సినిమా 'లియో'. 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జగదీష్ పళని స్వామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లియో సినిమాలో విజయ్ సరసన త్రిష కృష్ణన్ హీరోయన్‌హా చేస్తుండగా.. యాక్షన్ హీరో అర్జున్ సర్జా, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీఖాన్, మాథ్యూ థామస్ ఇతర ముఖ్య పాత్రలు ప్లే చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

లియో సినిమా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్‌తో విపరీతంగా ఆకట్టుకున్న లియో సినిమాలో నటీనటులు రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అవుతోంది. లియో సినిమాకు దాదాపు రూ. 300 కోట్ల బడ్జేట్ అయిందని ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అయితే, ఒక్కో సినిమాకు షేరింగ్‌తో కలిపి సుమారు రూ. 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకునే విజయ్ లియో చిత్రానికి ఏకంగా రూ. 120 కోట్లు తీసుకున్నాడని టాక్.

ఇప్పటివరకు విజయ్ ఏ సినిమాకు ఇంతలా పారితోషికం తీసుకోలేదని తెలుస్తోంది. చాలా కాలం తర్వాత హీరోయిన్‌గా చేస్తున్న త్రిష కృష్ణన్ (Trisha Krishnan Remuneration) లియో సినిమాకు రూ. 5 కోట్లు తీసుకుందట. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రూ. 8 కోట్లు, కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ రూ. 10 కోట్ల పారితోషికం అందుకున్నారని సమాచారం.

ఇక లియో సినిమాలో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ పాపులర్ యాక్టర్ సంజయ్ దత్ రూ. 8 కోట్లు తీసుకున్నాడట. అలాగే, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా రూ. కోటి, హీరోయిన్ ప్రియా ఆనంద్ రూ. 50 లక్షలు, డైరెక్టర్ అండ్ యాక్టర్ గౌతమ్ మీనన్ అండ్ మిస్కిన్ రూ. 30 నుంచి 50 లక్షల మధ్య రెమ్యునరేషన్ అందుకున్నట్లు కోలీవుడ్ ఫిల్మ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.